BigTV English

GudiGantalu Today episode: మనోజ్ కి దిమ్మతిరిగే షాక్.. అర్ధరాత్రి ప్రభావతి ఇంట్లో దెయ్యం.. జంబలకడి పంబ సీన్ రిపీట్..

GudiGantalu Today episode: మనోజ్ కి దిమ్మతిరిగే షాక్.. అర్ధరాత్రి ప్రభావతి ఇంట్లో దెయ్యం.. జంబలకడి పంబ సీన్ రిపీట్..

Gundeninda GudiGantalu Today episode September 1st : నిన్నటి ఎపిసోడ్ లో.. అంత పెద్ద షాపు కొంటే మనోజ్ ఏ పేరు పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అందరూ తలా ఒక పేరు పెట్టమని చెప్తారు. మీనా మాత్రం సుశీల ఫర్నిచర్స్ అని పెడితే బాగుంటుందని అంటుంది.. అమ్మమ్మ గారిది మంచి మనసు ఆవిడ పేరు మీద పెడితే బాగా జరుగుతుంది అని అంటుంది. కానీ ఎవరు కూడా ఆ పేరు గురించి ఆలోచించరు. మేము ఆలోచించి మంచి పేరు నిర్ణయిస్తామని రోహిణి మనోజ్ అంటారు. ఇక రూమ్ లోకి వెళ్లిన వాళ్ళిద్దరూ ఏం పేరు పెట్టాలని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు. రోహిణి అత్తయ్య పేరు పెడితే బాగుంటుంది కదా అని అంటుంది. దానికి అస్సలు ఒప్పుకోవడం మనోజ్. నా పేరు కలిసి రావడం లేదు ఆమె పేరు పెడితే మన షాప్ కూడా దివాలా తీస్తుంది అని అంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. గదిలోకి వెళ్తున్న బాలు వీళ్ళ మాటలు విని అక్కడికి వస్తాడు. బట్టలు తీసుకొస్తున్న మీనా బాలు అటుగా వెళ్లడం చూసి ఏమైందని అనుకుంటుంది. మా అమ్మ పేరు మీద పెడితే కచ్చితంగా మనం చిప్పకూడు తినాలి అని మనోజ్ అనడం బాలు రికార్డ్ చేస్తాడు. వాళ్ళిద్దరూ బెడ్ రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటే బాలు సడన్గా ఎంట్రీ ఇస్తాడు. ఏంట్రా మా రూమ్ లోకి వచ్చేసావ్ కనీసం పర్మిషన్ కూడా తీసుకోవాలని లేదా అని మనోజ్ అంటాడు. నేను ఊరికే రాలేదు ఒక విషయం చెప్పడానికి వచ్చాను అని బాలు అంటాడు. ఏమైందిరా ఎందుకు వచ్చావు చెప్పు అని అడుగుతాడు మనోజ్..

షాప్ కి నువ్వు ఏ పేరు పెట్టాలి అనుకుంటున్నావు అని అడుగుతాడు. ఇంకా ఆలోచించలేదు డిసైడ్ అయ్యాక అందరికీ చెప్తామని మనోజ్ అంటాడు. నువ్వు అమ్మపేరే షాప్ కి పెట్టాలి. ఈ రికార్డు బయట పెట్టాను అనుకో నీ బండారం మొత్తం బయటపడి మళ్లీ నువ్వు గుడి ముందు చేరుతావు అని అంటాడు. పార్క్ లోకి వెళ్ళాలి. ఇది అమ్మ వింటే నీ పని గోవిందా.. అనగానే మనోజ్ రోహిణి టెన్షన్ పడుతూ ఉంటారు.. మీనా ఎందుకండీ వాళ్ళని ఇబ్బంది పెడతారు అది వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కుంటున్న షాప్ అది వాళ్ళ ఇష్టం కదా అని అంటుంది.. అమ్మకి నేనంటే ఇష్టం లేకపోయినా అమ్మంటే నాకు ఇష్టం అమ్మ చేతి గోరుముద్దలు తినాలని నాకు ఉంటుంది మీనా అని బాలు అంటాడు.


ఇదేనేమో తల్లి కొడుకుల మధ్య ఉన్న ప్రేమ అని మీనా అంటుంది.. మీరిద్దరు ఎప్పుడు గొడవపడ్డాను చూశాను కానీ ఇలా ఒకరంటే మరొకరికి ప్రేమ ఉండడం నిజంగా మంచి విషయమే అని మీనా అంటుంది. అటు రవి ఇంటికి రాగానే శృతి డాన్స్ వేస్తూ ఉండడం చూసి షాక్ అవుతాడు.. నువ్వేంటి నా బట్టలు వేసుకున్నావు అని అడుగుతాడు. నాకు ఇవి నచ్చాయి వేసుకున్నాను నువ్వు నా బట్టలు వేసుకో మరి ఏం పర్లేదు అని శృతి అంటుంది.. నేను వేసుకుని అని రవి అన్నా సరే అయితే నేను మా పుట్టింటికి వెళ్తానని బలవంతంగా రవి చేత నైటీ వేయిస్తుంది.

ఇక అర్ధరాత్రి నాకు టీ కావాలి అని అడుగుతుంది. రవి టీ పెట్టడానికి వంటగదిలోకి వెళ్తాడు. ప్రభావతి అర్ధరాత్రి ఆకలేస్తుంది అంటూ కిందకి వస్తుంది. వంటగదిలో ఎవరు ఉండడం చూసి మొదట దెయ్యం అనుకుంటుంది. ఆ తర్వాత దొంగని అనుకుంటుంది. కేకలు వేసి అందరినీ రమ్మని పిలుస్తుంది. బాలు రాగానే బాలుని పట్టుకొని ప్రభావతి అక్కడ దొంగది ఉంది రా అని అంటుంది.. మా అమ్మకి మిగతా టైంలో కొడుకు అవసరం లేదు. కానీ ఇలాంటి టైంలో కొడుకు చాలా అవసరం అందుకే నన్ను పట్టుకుని బాలు సంతోష పడతాడు..

మొత్తానికి బాలు ధైర్యం చేసి వంటగదిలోకి వెళ్లి ఆమెను గట్టిగా పట్టుకుంటాడు. ముందు ఎలా ఉందో తెలియదు గానీ వెనకనుంచి మాత్రం కత్తిలాగుందని మనోజ్ అంటాడు. బాలు ఆమెను గట్టిగా పట్టుకోవడం చూసిన మేన దొంగదాన్ని పట్టుకోడానికి మీరేంటండి ఇలా చేస్తున్నారు అని అంటుంది.. ఇక అక్కడ రవి ఉండడం చూసి బాలు షాక్ అయ్యి బయటకు లాక్కొని వస్తాడు.. ఇదేంట్రా ఇలా జరిగింది నువ్వేంటి రా ఇలాంటి బట్టలు వేసుకున్నావ్ అని అందరూ అడుగుతారు. అప్పుడే శృతి అక్కడికి వస్తుంది. రవి బట్టలో ఉన్న శృతిని చూసి అందరూ షాక్ అవుతారు.

Also Read : ‘బ్రహ్మముడి ‘ స్వప్న.. ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

ఇదేంటి మీరిద్దరూ ఇలా బట్టలు మార్చుకున్నారు అని ప్రభావతి అడుగుతుంది. మేం ఏదో ఫన్నీగా ఉండడానికి ఇలా వేసుకున్న దాంట్లో తప్పేంటి అని శ్రుతి అడుగుతుంది.. నేను ముగ్గురు మొనగాళ్లు లాంటి కొడుకుల్ని కన్నాను అనుకున్నాను. ఆ ఇంట వంట ఇలాంటివి లేవు అమ్మ అని ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.. సత్యం మీ ఆటలు ఏమున్నా సరే మీ బెడ్ రూమ్ వరకే పెట్టుకోండి ఇలా బయటకు తీసుకురాకండి అని అంటాడు. ఏది ఏమైనా సరే రా నువ్వు వెనకనుంచి మాత్రం కత్తిలాగున్నావని మనోజ్ రవిని అంటాడు. దానికి రవి అర్ధరాత్రి చిలిపి పనులు ఏంటమ్మా అని అమ్మాయిలాగా మాట్లాడుతాడు. అందరూ సరదాగా నవ్వుకుంటారు. ఇక శృతి మా మీద కోపం పోయింది కదా అయితే మన అందరం కలిసి ఒక సెల్ఫీ దిగుదామని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో మీనా వాళ్ళ అమ్మని ప్రభావతి దారుణంగా అవమానిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Anchor Suma యాంకర్ సుమ ఇంటి విలువ రూ.500 కోట్లా … మామూలుగా సంపాదించలేదుగా?

Jayammu Nischayammuraa: సందీప్ ముందు ఆర్జీవీ పరువు తీసిన జగపతి… నా వోడ్కా ఎక్కడా అంటూ

Tasty Teja: వేలం పాటలో గణేష్ లడ్డు సొంతం చేసుకున్న టేస్టీ తేజ.. ఖరీదు ఎంతో తెలుసా?

Kissik Talks Show : గీతా సింగ్ పెళ్లి చేసుకోకపోవడానికి అదే కారణమా.. ఇప్పటికీ ఒంటరిగానే

Illu Illalu Pillalu Today Episode: ప్రేమ గుండెలు బద్దలయ్యే షాక్.. కళ్యాణ్ కోసం ధీరజ్ వేట.. శ్రీవల్లికి చందు దూరం..

Intinti Ramayanam Today Episode: అదంతా కలా?.. చక్రధర్ మాస్టర్ ప్లాన్.. అక్షయ్ ను ఇరికించేసిన అవని..

Big Stories

×