OTT Movie : ఈ దెయ్యాలు, చేతబడులను ప్రధానంగా చూపిస్తూ సినిమాలు తెరకెక్కుతున్నాయి. ప్రేక్షకులను కూడా భయపెడుతూ ఎంటర్టైన్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా క్రిస్టియానిటీ vs ఇండిజినస్ షామనిజం థీమ్‌లతో వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఒక క్రిస్టియన్ మిషనరీ దంపతుల చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. రీసెంట్ గానే ఈ సినిమా ఓటీటీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
ఏ ఓటీటీలో ఉందంటే
‘షామన్’ (Shaman) 2025లో విడుదలైన హారర్ థ్రిల్లర్ చిత్రం. ఆంటోనియో నెగ్రెట్ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో సారా కానింగ్ (కాండిస్), డానియెల్ గిల్లీస్ (జోయెల్), జెట్ క్లైన్ (ఎలియట్), అలెజాండ్రో ఫజార్డో (ఫాదర్ మేయర్) నటించారు. ఈ చిత్రం 2025 ఆగస్టు 8న USలో లిమిటెడ్ థియేట్రికల్ రిలీజ్ అయింది. 93 నిమిషాల రన్‌టైమ్‌తో ప్రస్తుతం గూగుల్ ప్లే, అమెజాన్ వీడియో, ఆపిల్ టీవీ, యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.
కథలోకి వెళ్తే ..
ఈక్వెడార్‌లోని చింబొరాజో వోల్కానో సమీపంలోని ఒక గ్రామంలో కాండిస్, జోయెల్ అనే క్రిస్టియన్ మిషనరీ దంపతులు స్థానిక ఇండిజినస్ జనాభాను క్రిస్టియానిటీకి మార్చడానికి పనిచేస్తుంటారు. వీళ్ళు అక్కడున్న వాళ్ళకి ఆహారం, నీరు, క్లినిక్‌లతో సహాయం చేస్తూ, స్థానిక పాస్టర్ ఫాదర్ మేయర్ తో కలిసి చర్చి నడుపుతారు. ఈ సమయంలో ఈ దంపతుల టీనేజ్ కొడుకు ఎలియట్ గ్రామంలో స్నేహితులు లేక ఒంటరిగా ఉంటాడు. ఒక రోజు స్థానిక పిల్లలతో ఆడుతూ, అతను ఒక ప్రమాదకరమైన గుహలోకి వెళ్తాడు. అక్కడ నుండి ఒక పురాతన దెయ్యంతో తిరిగి వస్తాడు. ఆ తరువాత నుంచి ఎలియట్ వింత ప్రవర్తనకి కాండిస్‌ను భయపెడుతుంది. ఆమె కాథలిక్ ఎక్సార్సిజంతో అతన్ని కాపాడాలని అనుకుంటుంది. కానీ స్థానిక షామన్ ఈ ఆత్మ క్రిస్టియానిటీ కంటే పురాతనమైనదని, దాన్ని ఎదుర్కోవడానికి ఇండిజినస్ ఆచారాలు అవసరమని చెప్తాడు.
షామన్ ఆచారాలు, కాండిస్ కాథలిక్ ఎక్సార్సిజం ప్రయత్నాలతో భయాంకరమైన సన్నివేశాలు ఎదురవుతాయి. ఇది క్రిస్టియానిటీ vs ఇండిజినస్ ఆధ్యాత్మికత మధ్య ఉద్రిక్తతను హైలైట్ చేస్తుంది. కాండిస్ తన కాథలిక్ ఎక్సార్సిజం విశ్వాసంపై సందేహిస్తూ, షామన్ “వైట్ మ్యాజిక్” ఆచారాలను అనుసరిస్తుంది. ఇప్పుడు ఎలియట్ పొసెషన్ తీవ్రమవుతుంది. దీని వల్ల ఆ గ్రామంలో ఒక మహిళ చనిపోతుంది. క్లైమాక్స్‌లో షామన్, కాండిస్ కలిసి ఒక రిచ్వల్ చేస్తారు. కానీ ఆ దెయ్యం క్రిస్టియన్ ఆచారాలకు లొంగదు. క్లైమాక్స్ ఈ ఎక్సార్సిజంతో ఊహించని మలుపు తిరుగుతుంది. ఆ దెయ్యం ఏమవుతుంది ? ఎలియట్ కి ఎలాంటి సమస్యలు వస్తాయి ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : వీడియో కాల్ లో అన్నీ విప్పి పాడు పనులు… ప్రేమించిన అమ్మాయిని వదిలేసి ఆమె వలలో… అబ్బాయిలు మస్ట్ వాచ్