Telangana Govt: ఎట్టకేలకు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. దీనిపై మరింత లోతుగా విచారణ చేసేందుకు సీబీఐకి అప్పగించాలని అసెంబ్లీ నిర్ణయించింది. ఈ మేరకు శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
తెలంగాణ అసెంబ్లీలో ఆదివారం సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టుపై సుధీర్ఘ చర్చ జరిగింది. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీ-విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం సభలో చెప్పాల్సిన అంశాలను క్లియర్‌గా వివరించింది.
విపక్ష బీఆర్ఎస్ సభ్యులు పార్టీ వెర్షన్‌ను వాళ్లు చెప్పారు. ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. చివరకు అన్ని పార్టీల సభ్యులు శాసనసభలో చర్చించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలు పంచుకున్నాయని తెలిపారు సీఎం రేవంతరెడ్డి. ప్రాజెక్టు డిజైన్ మొదలు నిర్మాణం, నిధుల విషయంలో కేంద్ర సంస్థలు పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ ఆర్థిక సంస్థలు పాలుపంచుకున్నందున ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించడం సముచితమని శాసనసభ భావిస్తోందని తేల్చిచెప్పారు.
ALSO READ: కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణంలో.. అసెంబ్లీలో ధ్వజమెత్తిన భట్టి
ఎన్నో రకాల అంశాలు ఇందులో ఉన్నందున తెలంగాణ ప్రభుత్వం సీబీఐకి ఆదేశించినట్టు ముఖ్యమంత్రి సభలో వెల్లడించారు. ఊరు, పేరు, అంచనాలు మార్చి దోచుకున్న వారందర్నీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడిన విచారణ జరగాలని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టులో అక్రమాలపై ఇప్పటివరకు రకరకాల సంస్థలు నివేదికలు ఇచ్చాయని తెలిపారు.
ఎన్‌డీఎస్‌ఏ, విజిలెన్స్, కాగ్, జస్టిస్ ఘోష్ కమిషన్ గత పాలకులు చేసిన తప్పులను వివరించారని తెలిపారు. అదే సమయంలో తమ పరిధిలో ఏ సంస్థ దర్యాప్తు చేసినా తమ చిత్తశుద్ధిని శంకిస్తారని, అందుకే ఎలాంటి శషభిషలకు తావు లేకుండా సీబీఐకి అప్పగిస్తున్నట్లు తెలిపారు. సీఎం ప్రకటన తర్వాత అసెంబ్లీ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రసాద్ ప్రకటన చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టుపై అసెంబ్లీలో సుధీర్ఘంగా మాట్లాడారు సీఎం రేవంత్‌రెడ్డి. రాజెక్టు పేరుతో చేసిన మోసం అంతాఇంతా కాదని, లక్ష కోట్ల రూపాయలు కొల్లగొట్టారని వివరించారు. ఏఐబీపీ పథకం కింద ఏదైనా ప్రాజెక్టును కేంద్రం గుర్తిస్తే 75 శాతం నిధులు ఇచ్చే నిబంధన ఉందని, ఆ విధంగా ఉమ్మడి రాష్ట్రంలో 2013న 25 ప్రాజెక్టులను గుర్తించిందన్నారు.
వాటిలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ఉందన్నారు. ఆ ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో మేడిగడ్డకు మార్చారని, తెలంగాణకు గుదిబండగా మార్చిన వారిని శిక్షించాల్సిన అవసరం ఈ సమాజానికి ఉందన్నారు. కేసీఆర్-హరీశ్‌రావు అరాచకాలను ఈటల రాజేందర్ ఆపలేదన్నారు. మేడిగడ్డ కూలిపోవడంతో లక్ష కోట్ల రూపాయలు గోదావరిలో కొట్టుకుపోయాయని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు సీఎం. రూ.85,449 కోట్లు అప్పు తీసుకున్నారని వివరించారు. అందులో రూ.27,738 కోట్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 11.5 శాతం వడ్డీకి తెచ్చారని వెల్లడించారు. ఆ లెక్కన రూ.30,536 కోట్లు 12 శాతం వడ్డీకి అప్పుతెచ్చారని, చేసిన అప్పులకు ఇప్పటివరకు రూ.19,879 కోట్లు ప్రిన్సిపల్ అమౌంట్ చెల్లించామన్నారు. ఈ ప్రాజెక్టు భారం ఇంకా రూ.60,869 కోట్లు మనపై ఉందన్నారు.
BIG BREAKING
కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వ నిర్ణయం
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన pic.twitter.com/U6woOWxFzT
— BIG TV Breaking News (@bigtvtelugu) September 1, 2025