Brahmamudi Swapna: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నో సీరియల్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అందులో కొన్ని సీరియల్స్లలో నటించి నటీనటులు సీరియల్స్లలో పద్ధతిగా కనిపించినా కూడా బయట మాత్రం హీరోయిన్ రేంజ్ లో అందాలను ఆరబోస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈమధ్య సోషల్ మీడియాలో బుల్లితెర హీరోయిన్లు ఒక ఊపు ఊపిస్తున్నారు.. అలాంటి వారిలో బ్రహ్మముడి ఫేమ్ స్వప్న ఒకరు. సీరియల్స్లలో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న స్వప్న బయట హాట్ అందాలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ని పెంచుకుంది. అయితే తాజాగా ఈమె బ్రహ్మముడి సీరియల్ కోసం ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈమధ్య ఈమె క్యారెక్టర్ బాగా పాపులర్ అవడంతో డిమాండ్ కూడా చేస్తుందని తెలుస్తుంది . ఈమె అసలు పేరు రూప. మరి ఇక ఆలస్యం ఎందుకు? రూప ఒక్క రోజుకి ఎన్ని రూపాయలు తీసుకుంటుందో ఒక్కసారి చూసేద్దాం..
బ్రహ్మముడి స్వప్న రెమ్యూనరేషన్..?
ఈమధ్య సినిమా హీరోయిన్ల కన్నా సీరియల్ లో నటిస్తున్న వాళ్లకి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. దీనిపై ఈ మధ్య చర్చలు కూడా జరుగుతున్నాయి. మరో విషయం ఏంటంటే సినిమాలో నటిస్తున్న హీరోయిన్లు సీరియల్స్ కూడా నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది సీనియర్ హీరోయిన్లు సీరియల్స్లలో నటిస్తూ పాపులర్ అవుతున్నారు.. బ్రహ్మముడి సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంది స్వప్న పాత్రలో నటించిన రూప. ఈమె రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒక్క రోజుకి ఈమె 20వేలు తీసుకుంటుందని సమాచారం. నెలలో 20 రోజులు షూటింగ్ ఉంటే అన్ని రోజులు ఈమె షూటింగ్లో పాల్గొంటుంది. దాంతో నెలకు సంపాదన లక్షల్లో ఉంటుందని తెలుస్తుంది.
Also Read : ఈ వారం అత్యంత దారుణం.. బ్రహ్మముడి పరిస్థితి ఏంటి..?
రూప రియల్ లైఫ్..
ఈ సీరియల్ లో ముందుగా బిగ్ బాస్ ఫేమ్ హమీదా ఖాతూన్ నటించింది.. ఆ తర్వాత ఆమె తప్పుకోవడంతో ఆమె పాత్రలోకి రూప ముగ్గల్లా పోషిస్తున్నారు. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఈమె సుపరిచితురాలు.. ఇప్పటికే ఈమె పలు సీరియల్స్లలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు సినిమాల్లో కూడా నటించింది అన్న విషయం చాలామందికి తెలియదు.. కానీ ఈమె సినిమాలు కూడా చేసింది. నిజానికి ఈమె హైదరాబాద్ కు చెందిన ముద్దుగుమ్మ.. నర్సాపురంకు చెందిన రూప హైదరాబాద్‌లోనే చదువుకున్నారు. అనంతరం నటన వైపు ఆసక్తితో పలు సీరియల్స్, షోలలో నటిస్తున్నారు.. ఇప్పటివరకు నెగిటివ్ రోల్స్ లోనే ఎక్కువగా నటించింది.. సీరియల్స్ లో ఎలా ఉన్నా సరే సోషల్ మీడియాలో మాత్రం కాకరేపుతుంది. హాట్ అందాలతో లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అవి ఎంతగా వైరల్ అవుతుంటాయో మనం చూస్తూనే ఉంటాము.