E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..
Advertisement

Gundeninda GudiGantalu Today episode September 4th: మీతో ఒకసారి మాట్లాడాలి బయటికి రండి అని అందరి ముందర చాలా మర్యాదగా మాట్లాడిన మీనా బయటికి తీసుకెళ్లగానే శృతి రికార్డ్ చేసిన వీడియోని చూపిస్తుంది. అది చూసిన సంజయ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఆ వీడియోని తీశారు అని చెప్పగానే నీలకంఠం కూడా ఆ వీడియోని చూసి మా వాడి రాజకీయ భవిష్యత్తు నాశనం అవుతుంది అని అంటాడు అయితే ఈ వీడియోని మేము సోషల్ మీడియాలో పెట్టకూడదు అంటే మౌనిక చేత మా ఇంటికి తీసుకువచ్చి మరి మా ఆయనకు రాఖీ కట్టించాలి అని మీనా అంటుంది.. ఇంట్లోకి మీనా శృతి రాగానే ప్రభావతి అవమానించేలా మాట్లాడుతుంది. కానీ సంజయ్ మౌనిక వాళ్ళు వచ్చారని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతుంది..

మీనా ప్లాన్ సక్సెస్..

మీనా శృతి ఇంట్లోకి రాగానే ప్రభావతి వాళ్ళిద్దర్నీ మెడ పట్టుకొని బయటకు గెంటేసారు కదా మీకు ఇలా జరగాల్సిందే అని దారుణంగా అవమానించేలా మాట్లాడుతుంది.. అయితే ప్రభావతి ఆ మాట అనగానే మిగిలిన వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. కానీ మీనా మాత్రం మన ఇంటి గేటు బయట ఏం జరుగుతుందో ఒకసారి చూడండి అని అంటుంది.. అయితే అప్పుడే ఒక కారు వచ్చే ఆగడంతో ఎవరు ఇప్పుడు ఈ టైం లో కారులో వచ్చారు అని ప్రభావతి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అయితే సంజు అలాగే నీలకంట ఒక కార్లోంచి రావడం చూసి మీరేంటి ఇలా వచ్చారు ఏదైనా గొడవ చేసి వచ్చారా. వీళ్ళని చూస్తుంటే గొడవ పడడానికి వస్తున్నట్లుంది అని ప్రభావతి కంగారు పడిపోతూ ఉంటుంది. కాని వాళ్ళిద్దరు మాత్రం చాలా కూల్ గా లోపలికి రావడం ప్రభావతితో మా తప్పు జరిగిపోయింది అని చెప్పడంతో కాస్త సంతోషంగా ఉంటారు. ఏమైంది అన్నయ్య మీరు ఇలా సడన్గా కబురు లేకుండా రావడం తో టెన్షన్ గా ఉంది అని ప్రభావతి అంటుంది..

నిజం చెప్పిన నీలకంఠం..

Advertisement

నీలకంఠం మా ఇంట్లో సంజు ని పాలిటిక్స్ లోకి ఎంటర్ ఇచ్చేందుకు పరిచయం చేయడానికి ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. మీ బాలు ఎప్పుడు వచ్చినా ఏదో ఒక గొడవ చేసి వెళుతూ ఉంటాడు కాబట్టి.. అయితే అందుకే బాలు చేతకాకుండా మిగిలిన వాళ్ళందరి చేత రాఖీ కట్టించాము అని నీలకంఠ నిజం చెప్తాడు. ఇంట్లో అంతా హడావిడిగా ఉన్నప్పుడు బాలు అక్కడ గొడవ చేస్తాడని భయపడ్డాము.. అందుకే తనని రానివ్వలేదు.. ఇప్పుడు మా తప్పు తెలుసుకున్నాం.. కాబట్టి మేము మళ్లీ మీ ఇంటికి వచ్చి క్షమాపణ చెప్పాలని అనుకుంటున్నామని నీలకంఠం అనగానే అయ్యో అన్నయ్యగారు మీరేంటి క్షమాపణ చెప్పడం ఏంటి..? వాడి గురించి తెలిసే మీరు ఇలా చేశారు కాబట్టి మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదండి అని అంటుంది.. ఈ మాట మీరు చెప్పడం కాదు బాబాయ్ గారు మా అన్నయ్య నోటి వెంట ఆ మాట వస్తే బాగుంటుంది కదా అని మీనా అంటుంది. ఇక సంజు బాలుని చేతులు పట్టుకొని నా తప్పైపోయింది బావగారు క్షమించండి అని అడుగుతాడు. మీనా దెబ్బకి సంజు దిగి రావడం ఈ ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది.

బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

బాలు మీరు నిజంగానే ఆ మాట అంటున్నారు బావ అని సంజుని అడుగుతాడు. అయితే సంజు కూడా నిజమే బావ నా తప్పైపోయింది అని ఆ ఒప్పుకుంటాడు. ఇక తర్వాత బాలు బాధపడిపోతూ ఉండగా మీనా మీరు ఆ మాట చెప్పకుండా మౌనికని తీసుకుని వచ్చి రాఖీ కడితే బాగుంటుంది కదా.. అని అంటుంది. అయితే ఆ మాట అనగానే నీలకంఠం మౌనికని తీసుకుని రాకుండా మేమెందుకు వస్తాం.. అమ్మ బయట కారులో ఉంది సంజు వెళ్లి మౌనికని తీసుకురా అని పంపిస్తాడు.. మౌనిక ఇంట్లోకి రాగానే అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. బాలు కి మౌనిక రాఖీ కట్టి నన్ను క్షమించు అన్నయ్య కొన్ని పరిస్థితుల వల్ల నేను అలా మాట్లాడాను అని చెప్తుంది. మొత్తానికి నేనా ఛాలెంజ్ చేసినట్లుగానే బాలుతో రాఖీ కట్టించేస్తుంది.

మీనాను పొగిడేసిన బాలు..

Advertisement

తన చెల్లెలు తనకు రాఖీ కట్టడం చాలా సంతోషంగా ఉంది అని దీనంతటికీ కారణం మీనాని అని బాలు మీనా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు.. మీనా లోపలికి రాగానే రావే నా పూలగంప నీవల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈరోజు నాకు నా చెల్లెలు రాఖీ కట్టింది. అంటే అతను నవ్వు ఈ రాఖీ లో కనిపిస్తుంది. తన అంతటికి నువ్వే కారణం అని మీనా అని గట్టిగా కౌగిలించుకొని సంతోషంగా ఉంటాడు బాలు.. నీ మొహం లో ఈ సంతోషం చూడడానికే నేను మౌనిక దగ్గరికి వెళ్లాను కాని వాళ్ళకి ఏదో చెప్పానని చెప్పగానే బాలు అస్సలు నమ్మడు. ఏం చెప్పి వాళ్ళని ఒప్పించావో నాకు ఆ నిజం చెప్పు అని బాలు అడుగుతాడు. ఇకమీద జరిగిన విషయం అంతా బాలుకు చెప్పేస్తుంది. అమ్మనా పూలగంప నువ్వు ఇంత చేసావా నీలో ఇంత టాలెంట్ ఉందా అని పొగిడేస్తాడు. ఇక మౌనిక వరలక్ష్మీ వ్రతం ఉందని అక్కడే ఉంచుకుంటారు. నీలకంఠ కి రాఖీ కట్టి పెద్ద గిఫ్ట్ నే ఎక్స్పెక్ట్ చేస్తుంది. మొత్తానికి మేన అనుకున్న విధంగానే మౌనికను తీసుకొని వచ్చి బాలుకి రాఖీ కట్టించడం ఎపిసోడ్ కి హైలైట్ గా నిలిచింది.. ఈ సీన్ చూసిన జనాలు చాలా సంతోషంగా ఉంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Big Stories

Advertisement
×