E-Paper
Advertisement

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?
Advertisement

Gandhi Bhawan: రాజకీయ పార్టీల కీలక నేతలు.. సమయం, సందర్భం వచ్చినప్పుడు ఓ మాట చెబుతుంటారు. నోరు అదుపులో పెట్టుకోవాలని, మీడియాకు ఎట్టి పరిస్థితుల్లోనూ మసాలా ఇవ్వవద్దని అంటుంటారు. కానీ, కొందరు నేతలు తమకు ఎదురులేదని భావిస్తుంటారు, మా పార్టీలో మేమే తోపులమని అంచనాలు వేసుకుంటారు. ఫలితంగా వారి పీఠాలకు ఎసరు వస్తున్న సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ అధికార పార్టీలో కొండా సురేఖ, చిన్నారెడ్డి ఉదంతాలే అందుకు నిదర్శనం. జాతీయ స్థాయిలో అయితే చాలామంది నేతలు పత్తా లేకుండా పోయారు. నోరు జారిన జాబితాలో మరో అరడజను మంది సీనియర్లు ఉన్నట్లు తెలుస్తోంది. తాజా ఎపిసోడ్‌తో ఆయా నేతల్లో వణుకు మొదలైంది.

కాంగ్రెస్ పార్టీని ముంచేస్తున్న సొంత పార్టీ నేతలు

కాంగ్రెస్ పార్టీ అనేది సముద్రం లాంటింది. అందులోకి వచ్చినవారు వస్తుంటారు.. వెళ్లిపోయినవారు పోతుంటారు. అక్కడ నేతలకు విపరీతమైన స్వేచ్ఛ ఉంటుంది. ఎప్పుడు, ఏదైనా, ఎవరి మీదైనా మాట్లాడవచ్చు. తమకు ఎదురులేదని భావిస్తుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే నేతల కాస్త నోటి దూకుడు ఎక్కువ. నాలుగు పదునైన మాటలు మాట్లాడడం వల్ల వారి కెరీర్ డ్యామేజ్ అవుతున్న సందర్భాలు ఇటీవల రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. 2014 ముందు వరకు ఓ తరహా రాజకీయాలు ఉండేవి. ఆ తర్వాత రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. జాతీయ పార్టీల అగ్రనేతలు సైతం తమ నేతలను నోరు అదుపులో పెట్టుకోవాలని పదే పదే హెచ్చరిస్తుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే సొంత పార్టీ నేతలే కాంగ్రెస్ పార్టీని ముంచేస్తున్నారు. ఏ పార్టీలో లేని ఈ రచ్చ, కేవలం కాంగ్రెస్ పార్టీలో ఎందుకు జరుగుతోంది? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడు తున్నాయి.

కొండాసురేఖ-చెన్నారెడ్డి ఎపిసోడ్‌తో నేతలకు వణుకు

Advertisement

తెలంగాణలోని అధికార కాంగ్రెస్ పార్టీలో దాదాపు 10 రోజులుగా కొండా సురేఖ-చిన్నారెడ్డి వ్యవహారం తీవ్రచర్చకు దారితీసింది. దీనిపై మీడియాలో చర్చల మీద చర్చలు. ఒక విధంగా చెప్పాలంటే ప్రత్యర్థుల కంటే సొంత పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇన్నాళ్లు మాదిరిగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో లేదు. పరిస్థితులు మారాయి.. నేతలు మారారు. లోపాలను సరిదిద్దుకుంటూ పార్టీని బలోపేతం చేసేందుకు నిత్యం అడుగులు వేస్తున్నారు. గురువారం కొండా సురేఖను ప్రభుత్వం మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయడం, చిన్నారెడ్డిపై వేటు వేయడం చకచకా జరిగిపోయింది. బీసీ కార్డు బయటకు తీస్తారేమోనని భావించిన ప్రభుత్వం, వెంటనే ముగ్గురు బీసీ మహిళలకు పదవులు ఇచ్చారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు ఆలస్యంగా ఉంటాయని భావించారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి చకచకా పరిమాణాలు మారిపోయాయి. ఆ వేగాన్ని చూసి పలువురు సీనియర్లు సైతం షాకయ్యారు.

రేసులో అరడజను మంది నేతలు, నెక్ట్స్ వికెట్ ఎవరిది?

కొండా సురేఖ-చిన్నారెడ్డి వికెట్లు డౌన్ కావడంతో మిగతా నేతలకు చిన్నపాటి వణుకు మొదలైంది. గతంలో మీడియా ముందు తాము చేసిన మాటలు ఏ రూపంలో వెంటాడుతాయోనని భయపడుతున్నారు. ఈ తరహా నేతలు కాంగ్రెస్ పార్టీలో దాదాపు డజను మంది సీనియర్ నేతలు ఉండవచ్చని ఓ అంచనా. కొండా-చెన్నారెడ్డిలపై వేటు పడడంతో మిగతా-సీనియర్ నేతలకు వణుకు మొదలైనట్టు గాంధీభవన్ వర్గాల మాట. ఈ ఎపిసోడ్‌తో ఆయా నేతలు చల్లబడ్డారా? ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉందని చెప్పి దూకుడు కంటిన్యూ చేస్తారా? అన్నది అసలు ప్రశ్న. దూకుడుగా మాట్లాడే నేతలు జాబితా రెడీ అయ్యిందని, ఇంకా శృతిమించితే వేటు పడడం ఖాయమని గాంధీభవన్ వద్ద గుసగుసలు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. రానున్న రోజుల్లో దూకుడు నేతల నోటికి కళ్లెం పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Advertisement

ALSO READ: స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

Big Stories

Advertisement
×