E-Paper
Advertisement

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      
Advertisement

Ninnu kori serial today Episode: మాయ దగ్గరకు వెళ్లిన షాలిని రేపు ఏం జరుగుతుందోనని తనకు భయంగా ఉందని బిడ్డ శాంపిల్‌ అత్తయ్యకు బ్లడ్‌కు మ్యాచ్‌ అవ్వకపోతే నిన్ను విరాజ్‌ బావ ఇంట్లోంచి పంపిచేస్తాడు కదా అని భయపడుతుంటే.. మ్యాచ్‌ అవ్వకపోయినా నన్ను పంపించలేడు అంటూ మాయ చెప్తుంది. ఎందుకు పంపిచలేడు నిజం బయటపడితే నిన్ను జుట్టు పట్టి బయటకు పంపిచేస్తాడు అంటే.. నా మెడలో తాళి ఉంది అది సమాజం నమ్మింది అని మాయ చెబితే.. అది వాళ్లకు లెక్కే కాదు.. నువ్వు నువ్వు చెప్తున్న సమాజం ఒకవైపు నిలబడినా అత్తయ్య ముందు అసలు తట్టుకోలేరు అంటుంది షాలిని. డెస్టినీ అనేది ఒకటుంటుంది అది మనల్ని తీసుకెళ్లాల్సిన చోటికి తీసుకెళ్తుంది. అనవసరగా ఏదేదో ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు వెళ్లి పడుకో అని చెప్తుంది. షాలిని వెళ్లిపోతుంది.

చంద్ర దగ్గరకు కామాక్షి, శృతి వెళ్తారు. నీకు కాస్తైనా ఆత్మగౌరవం ఉందా అని అడిగితే.. ఆత్మగౌరవం గురించి నువ్వే మాట్లాడాలా..? అసలు నీ కూతురి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడిన మందర మౌత్‌ పగిలేలా కొట్టాలి కానీ నువ్వేం చేశావు.. నీ మౌత్‌ ఫోల్డ్‌ చేసుకుని కూర్చున్నావు అంటుంది చంద్ర. మా మీదకు బాగానే లేస్తావు కానీ రేపు మాయ కడుపులో బిడ్డకు పాజిటివ్‌ వస్తే అప్పుడేం చేస్తావు అంటూ కామాక్షి అంటే అయితే ఇప్పుడు ఏం చేద్దాం అత్తయ్యకు టెస్టులు క్యాన్సిల్‌ చేద్దామా..? అంటూ అదిగో మామయ్య వెళ్తున్నారు ఆయననే పిలిచి అడుగుదామా అంటూ పిలిచి ఆయనకు విషయం చెబితే.. ఆయన కామాక్షి, శృతిలను పిచ్చిగా తిట్టి వెళ్లిపోతాడు.

Advertisement

ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన విరాజ్ ను రూంలోకి తీసుకెళ్లి క్రాంతి చెప్పిన విషయాలు చెప్తుంది. బిడ్డ శాంపిల్‌ అత్తయ్యకు మ్యాచ్‌ అవుతాయో లేదో తెలుసుకోవచ్చట.. ఇక మన సమస్యలు తీరిపోయే సమయం వచ్చింది అని చెప్పగానే.. ఆ దేవుడు కరుణిస్తే అంతకన్నా కావాల్సింది ఏముంది అంటూ ఎమోషనల్‌ అవుతుంటే.. చంద్ర కోపంగా చేతులు పట్టుకుంటావేంటి..? నేను ఇప్పుడు నీ భార్యను కాదు అంటుంది. అందుకు విరాజ్‌ కోపంగా నువ్వు నాకు ఎప్పటికీ అర్థం కావే అంటూ వెళ్లిపోతాడు.

మరుసటి రోజు మాయ, విరాజ్‌, జగదీశ్వరి హాస్పిటల్‌కు వెళ్తారు. విరాజ్‌ డాక్టర్‌ను కలవడానికి లోపలికి వెళ్తే బయట జగదీశ్వరి, మాయల మధ్య గొడవ జరుగుతుంది. మాయను జగదీశ్వరి తిడుతుంది. అప్పుడే డాక్టర్‌ వచ్చి వాళ్లిద్దరిని శాంపిల్‌ కలెక్ట్‌ చేసుకుంటామని తీసుకెళ్తారు. మరోవైపు ఇంట్లో మాయ కోసం మందర వెతుకుతుంది. వాళ్లు హాస్పిటల్‌కు వెళ్లారని కామాక్షి చెప్తుంది. మందర కంగారు పడుతుంటే.. శృతి వెటకారంగా ఏంటి కంగారుపడుతున్నావు గుడిలో ఏమైనా గంట కొట్టేశావా అంటుంది. మందర మాత్రం చంద్ర నిజం కనిపెట్టేసిందని కంగారుపడుతుంది. ఆ విషయం వెంటనే మాయకు చెప్పాలని పక్కకు వెళ్లి కాల్‌ చేస్తుంది. చంద్ర గుడిలో ఎంక్వైరీ చేసిందని చెప్పగానే.. హాస్పిటల్‌ లో ఉన్న మాయ కంగారుపడుతుంది. విరాజ్‌ ఏమైంది మాయ అని అడిగితే ఏం లేదు అంటూ పక్కకు వెళ్లి మందరతో ఫోన్‌ మాట్లాడుతుంది. చంద్రకు నిజం తెలిసినా మౌనంగా ఉందంటే అదేదో పెద్ద ప్లానింగ్‌తో ఉందే అంటూ హెచ్చరిస్తుంది. మాయ కోపంగా మందరను తిడుతుంది. అంతా నీ వల్లే అంటూ తిడితే ఇక నీ మాట మీరను మాయ అంటూ మందర చెప్తుంది.

Advertisement

వెంటనే మాయ షాలినికి ఫోన్‌ చేసి చంద్రకు నిజం తెలిసింది నువ్వు వెళ్లి చంద్రతో మాట్లాడు అని చెప్పగానే.. షాలిని కాల్‌ కట్‌ చేసి చంద్ర దగ్గరకు వెళ్లి మాయను విరాజ్‌ బావ పెళ్లే చేసుకోలేదట అని చెప్తుంది. హాస్పిటల్‌లో ఉన్న విరాజ్‌ దగ్గరకు డాక్టర్‌ వెళ్లి రిపోర్ట్స్‌ వచ్చాయి రండి అంటూ పిలుస్తాడు. విరాజ్‌ డాక్టర్‌ దగ్గరకు వెళ్తాడు. మాయ కడుపులో బిడ్డ శాంపిల్‌ 90శాతం మ్యాచ్‌ అయ్యాయి అని చెప్పగానే.. అందరూ హ్యాపీగా ఫీలవుతారు. మరోవైపు విరాజ్‌ కు మాయకు పెళ్లి కాలేదన్న విషయం తనకు ముందే తెలుసని షాలినికి చెప్తుంది చంద్ర.  ఇంతలో ఈరోజు నిన్ను కోరి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×