Gundeninda GudiGantalu Today episode September 8th: ప్రభావతి ఇంకా రాలేదు.. రోహిణి వ్రతం గురించి మాట్లాడుతూ బాధ పడిపోతూ ఉంటుంది. రోహిణి చాతి ఎలాగైనా సరే వ్రతం చేయించాలి అని మీనా శృతి ఇద్దరు కూడా అనుకుంటారు. అయితే సత్యంతో ఈ విషయం గురించి మాట్లాడాలి అని అనుకుంటారు. అత్తయ్య ఎంతగా చెప్పిన కూడా ఒప్పుకోవడం లేదు అని మిగిలిన వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు.. కానీ అత్తయ్య ఎంత చెప్పినా ఒప్పుకోవడం లేదు మావయ్య గారు అని మీనా కూడా సత్యం నీ రిక్వెస్ట్ చేస్తుంది అప్పుడే ఇంట్లోకి వచ్చిన ప్రభావతిని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. కానీ శృతి కూడా అత్తయ్య మీరు రోహిణి కోసం ఒప్పుకోవాల్సిందే అని మాట్లాడడంతో తను ఒక్కసారిగా సీరియస్ అవుతుంది. నువ్వు నాకు చెప్పే దానివయ్యావా? నిన్ను కూడా దాని లాగే చూస్తాను అంటూ సీరియస్ అవుతుంది.. ఆ మాట వినగానే శృతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది..
శృతి ని అరవడంతో తను భయపడిపోతూ ఉండగా బాలు ఇక ఎవరేం చెప్పినా అమ్మ వినదు అని తన ప్లాన్ ను వర్కౌట్ చేస్తాడు. శీల డార్లింగ్ పూజ ముగ్గురు కోడలతో అలాగే అమ్మ కూడా చేస్తుంది.. అంటూ ఫోన్ రాకపోయినా సరే వచ్చినట్లుగా బాలు మాట్లాడుతూ కిందకి వస్తాడు. ఇక చేసేదేమీ లేక ప్రభావతి ఒప్పుకుంటుంది.. ఇక ఆ తర్వాత ప్రభావతి వీళ్ళ వల్ల నేను ఒప్పుకున్నాను నా పరువును కాపాడాడు బాలు అంటూ తనపై ప్రశంసలు కురిపిస్తూ లోపలికి వెళ్ళిపోతుంది.. వరలక్ష్మీ వ్రతం రోజున మనోజ్ తనని దగ్గరకు తీసుకున్నాడని రోహిణి కల కంటుంది. మొత్తానికి రోహిణికి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది ప్రభావతి. ఇక బాలు దెబ్బకి రోహిణి పూజ చేసేందుకు ప్రభావతి ఒప్పుకుంటుంది. నిజంగానే ప్రభావతి ఒప్పేసుకుంది అని రోహిణి చాలా సంతోషంగా ఉంటుంది. తన భర్తతో కలిసి పూజ చేస్తున్నందుకు ఆనందంగా కూడా ఉంటుంది..
రోహిణి తనకు పూజ చేసే అవకాశం ఇచ్చిందని చాలా సంతోషంగా ఉండే లోపే.. ప్రభావతి వచ్చి పూజను నువ్వే దగ్గరుండి చూసుకోవాలి అని చెప్పగానే రోహిణి సరే అని అంటుంది. అయితే తను ఎప్పుడు పూజ చేయలేదు కాబట్టి ఎలా ఇదంతా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ప్రభావతి మాత్రం నువ్వు ఈ పూజ గనుక చేస్తే నీ మీద ఉన్న అబద్ధాలు లిస్టు ని కాస్త తగ్గింపు చేస్తాను అని అంటుంది. మొత్తం పూజకి ఎలా చేయాలి? ఎలాంటి ప్రసాదాలు పెట్టాలి ముత్తైదులకు ఏమి ఇవ్వాలి అంటూ అన్ని చెప్తుంది. ఆ మాట వినగానే రోహిణి మొదట మౌనంగా ఉండి పోయిన కూడా ఆ తర్వాత సరే అత్తయ్య అని అంటుంది.. ఇక అత్తయ్య చెప్పిన లిస్ట్ అంత ఎలా చేయాలి? నాకు ఏమీ రాదు కదా అని కంగారు పడిపోతూ ఉంటుంది.
మీనా రెడీ అవుతుండగా బాలు అక్కడికి వెళ్లి నా పూలగంపై ఎంత అందంగా ఉందో అంటూ మురిసిపోతూ ఉంటాడు. అప్పుడే మీనా ఈరోజు వ్రతం మీరు ముట్టుకోకూడదు అంటూ తోసేస్తుంది ఇక బాలు ఎంత చెప్పినా సరే వినకుండా గదిలోంచి బయటికి తోసేస్తుంది. అటు రవి పరిస్థితి కూడా అంతే చీర కట్టుకుంటుంది అని రోహిణికి సపోర్ట్ చేద్దాము అని అనుకుంటే నన్ను బయట గెంటేసింది అని ఇద్దరు ఒకరినొకరు చూసి మాట్లాడుకొని నవ్వుకుంటారు. మనోజ్ పరిస్థితి వేరులే వాడి మీదనే ఆ రోహిణి పడిపోయిన సరే తోసేసుకొని మరీ వచ్చేస్తాడు అని ఇద్దరు నవ్వుకుంటారు.. ఇక ప్రభావతి అందరూ రెడీ అయి వచ్చారా లేదా అని అరుస్తుంది.
మౌనిక చాలా సంతోషంగా అందంగా రెడీ అయ్యి కిందకు రావడం చూసిన బాలు నా చెల్లెలు ఇంత సంతోషంగా పుట్టింట్లో ఉండటం నేను ఇదే మొదటిసారిగా చూస్తున్నాను. అయితే తను చాలా అందంగా ఉంది కదా.. అంటూ బాలు మౌనికని పొగిడేస్తుంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రభావతి ఆ ఇంట్లో పని మనుషులతో పనులు చేయించుకునే పరిస్థితిలో ఉన్న నా కూతురు ఇలానే ఉంటుంది అని తెగ సంబరపడిపోతూ ఉంటుంది. అయితే మౌనిక మాత్రం తన పరిస్థితి అమ్మకు తెలిస్తే బాధపడుతుందేమో అని ఆలోచిస్తూ ఉంటుంది. మౌనికని ఇలా చూసి చాలా సంతోషంగా ఉందని ప్రభావతి అనగానే మిగిలిన కోడలు గురించి కూడా మాట్లాడుతుంది ప్రభావతి.. కోడళ్ళు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు అన్నట్టుగా ఎద్దేవా చేసి మాట్లాడడంతో ముగ్గురు కోడలు కూడా ఫీలవుతారు.
తన కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి మౌనిక చెప్పగానే మిగిలిన వాళ్ళందరూ కూడా తన ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతారు. నా ఆరోగ్యం బాగానే ఉంది. నేను కూడా బాగానే ఉన్నాను.. నువ్వు డైలీ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావా లేదా అని రోహిణి అడుగుతుంది.. నేను చెకప్ కి వెళ్తున్నాను వదినా అని మౌనిక చెప్పగానే రోహిణి ప్రభావతి నువ్వేంటి ఇంకా ఇక్కడ ముచ్చట్లు పెట్టుకున్నావు ప్రసాదలని చేసావా నైవేద్యాలని రెడీగా పెట్టావా అని అడుగుతుంది. వాటి గురించి నాకు ఏమీ తెలియదు అత్తయ్య అని రోహిణి ఎంత చెప్తున్నా సరే ప్రభావతి మాత్రం తెలియకపోతే తెలుసుకో అని అంటుంది. మీనా మాత్రం నేను చేస్తానులే అత్తయ్య రోహిణికి తెలియదు కదా అంటే ఆవిడేమీ ఆకర్షణ నుంచి ఊడిపడలేదు కదా నువ్వు దగ్గరుండి తన చేతి మొత్తం చేయించు అని మీనాకు చెప్తుంది.. ఎప్పుడూ వదినను నెత్తిన పెట్టుకునే మా అమ్మ ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది అని మౌనికకు అనుమానం మొదలవుతుంది.
మౌనిక ఏమైంది రోహిణి వదినను అమ్మ ఎందుకలా అరుస్తుంది ఏం జరిగింది అని అడుగుతుంది.. ఏం లేదు మౌనిక రోహిణి గురించి ఒక నిజం బయటపడింది దాంతో మీ అమ్మ ఇలా మాట్లాడుతుంది అని ప్రభావతి గురించి శృతి అన్ని విషయాలను మౌనికకు చెప్తుంది. ఏంటి రోహిణి వదిన ఇంత మోసం చేసిందా అంటే మలేషియా నుంచి తను రాలేదని మౌనిక అడుగుతుంది. అమ్మ అందుకేనా రోహిణి వదినని వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి అంటూ బాధ పెట్టేస్తుంది అని మౌనిక అంటుంది. ఇక రోహిణి లోపల మాత్రం చాలా సీరియస్ గా ఉంటుంది ఏమైంది నువ్వెందుకు అలా ఉన్నావు అని నేను అడగగానే నా గురించి మీరు మౌనికకు నిజం చెప్పారు కదా.. అందుకే నాకు చాలా కోపంగా ఉంది అని రోహిణి అంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :Podarillu Today Episode : జయంతి మాటతో షాక్.. చక్రీకి చుక్కలు చూపించిన మహా.. మనీషాకు షాక్.