Karthika Deepam 2 serial today Episode: సూరజ్‌ను తీసుకుని పార్క్‌కు వెళ్తాడు దక్షిణమూర్తి. అప్పటికే అదే పార్కులో కూర్చుని ఉంటుంది జ్యోత్స్ను. జ్యోత్స్నను చూసిన సూరజ్ దూరంగా వెళ్లిపోతే దక్షిణమూర్తి మాత్రం దగ్గరకు వెళ్లి పక్కనే కూర్చుంటాడు. సుమిత్ర ఎలా ఉందని అడుగుతాడు. అందుకు జ్యోత్స్న కోపంగా దక్షిణమూర్తి ఎవరో తెలియనట్టు మాట్లాడుతుంది. మేం ఎవరో తెలియకుండా మా యోగక్షేమాలు ఎలా అడుగుతారని ప్రశ్నిస్తుంది. అందుకు దక్షిణమూర్తి మీ అమ్మ నా కూతురు నువ్వు నా మనవరాలివి అంటూ చెప్పగానే..
ఓహో బంధాలు, బంధుత్వాలు మీకు ఇంకా గుర్తున్నాయా..? అయినా మా అమ్మను బతికి ఉండగానే చంపేశారు కదా అంటూ జ్యోత్స్న కోపంగా మాలినిని, సూరజ్‌ను తిడుతుంటే.. నా మనవడు చాలా మంచివాడమ్మా అంటూ దక్షిణమూర్తి కూడా ఎమోషనల్ అవుతూ సూరజ్ గురించి బాధపడుతాడు. పైకి అలా అనిపిస్తున్నాడు కానీ మనసులో వాడు చాలా బాధ పడుతున్నాడు. తండ్రి లేకుండా బతికాడు.. తల్లి కన్నీరు చూస్తూ బతికాడు.. తాత బాధ చూస్తూ బతికాడు.. వాడిని వాడు వదిలేసుకుని తన తల్లి కోసం తన తాత కోసం బతుకుతున్నాడు అంటూ చెప్తుంటే..
జ్యోత్స్న కోపంగా ఇప్పుడు పగ తీర్చుకున్నాడు కదా ఇక బాధ ఏం ఉండదులే అంటూ తిడుతుంటే.. నీకు గతం తెలియదమ్మా అంటూ దక్షిణమూర్తి అంటే మరి సూరజ్‌కు తెలుసా..? ఎందుకు ఇంత పగ పెంచుకున్నాడు అంటూ ప్రశ్నిస్తుంది.. అప్పుడే అక్కడకు వచ్చిన సూరజ్ తన కోసం ఇక రావొద్దని తనకు చెప్పు తాత అంటే నేనే ఎవరి కోసం రాలేదు నన్ను నేను వెతుక్కోవడానికి వచ్చాను అంటూ జ్యోత్స్న చెప్పి వెళ్లిపోతుంది.
కార్తీక్, దీప ఇద్దరూ ఆఫీసుకు వెళ్తే ఉద్యోగులు వచ్చి సింపథీ చూపిస్తారు. మీరు ఎంతగానో నమ్మిన సూరజే మిమ్మల్ని మోసం చేశాడు అంటూ భయపడుతుంటారు. వాళ్లందరికీ కార్తీక్ ధైర్యం చెప్తాడు. అప్పుడే శివనారాయణ, దశరథ వస్తారు. ఎంప్లాయీస్ ఎవరికి ఏ అవసరం వచ్చినా తనకు చెప్పవచ్చని అంటాడు. తర్వాత ఆఫీసుకు వచ్చిన జ్యోత్స్న తన టేబుల్‌కు ఎదురుగా ఉన్న సూరజ్ టేబుల్, కుర్చీని చూసి కోపంగా ఆఫీస్ బాయ్‌ని పిలిచి ఆ టేబుల్ తీసేయమని చెప్తుంది. దీప, కార్తీక్ చూసి వద్దని నువ్వు ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోమని చెప్తారు. అందుకు జ్యోత్స్న ఒప్పుకోదు.. తనకు వేరే విషయాలేవీ గుర్తు రాకుండా ఫుల్లుగా వర్క్ ఇవ్వమని అడుగుతుంది. అలాగే మీ మీద పడిన నిందను మీరే పొగొట్టుకోండి అని చెప్తుంది.
సూరజ్‌తో దక్షిణమూర్తి మాట్లాడుతూ నీ మనసులో అది ఉంది. దాని మనసులో నువ్వు ఉన్నావు.. అది మనఃస్పూర్తిగా కూడా ఏడ్వలేకపోతుందిరా మనం అనుకున్నదానికంటే ఎక్కవ నష్టం జరిగింది అంటూ దక్షిణమూర్తి చెప్తుంటే.. మాలిని వచ్చి మరి మనకు నష్టం జరగలేదా మామయ్య అంటూ ప్రశ్నిస్తుంది. తన భర్తను చంపేశారని అది తాను ఎప్పటికీ మరిచిపోనని కానీ మీ కోసం ఏదీ పట్టించుకోనని మీకు ఏది మంచి అనిపిస్తే అదే చేయండని చెప్తుంది.
దక్షిణమూర్తి చెప్పిన నీ మనసులో అది ఉంది. దాని మనసులో నువ్వు ఉన్నావు అన్న మాటలు గుర్తు చేసుకుంటూ సూరజ్.. శివనారాయణ ఇంటికి వెళ్తాడు. ఇంట్లోకి వెళ్లి చూసి సూరజ్ షాక్ అవుతాడు. నేనేంటి ఇక్కడకు వచ్చాను అనుకుంటాడు. అప్పుడే జ్యోత్స్న వచ్చి అలవాటులో పొరపాటులా వచ్చావా..? కావాలని వచ్చావా..? అయినా నువ్వు నిజం ఎప్పుడు చెప్పవులే అంటూ ప్రశ్నిస్తే..
నేను మాలిని కొడుకు అన్న విషయంలో తప్పు నేనేప్పుడూ అబద్దం చెప్పలేదు అంటాడు సూరజ్. అయితే నన్ను ప్రేమించాను అన్నావు.. పెళ్లి చేసుకుంటాను అన్నావు.. జీవితాంతం నాతో కలిసి బతుకుతాను అన్నావు.. చివరకు తాళి వదిలేసి వెళ్లిపోయావు అదంతా అబద్దం కాదా అంటూ జ్యోత్స్న ప్రశ్నించగానే సూరజ్ మౌనంగా చూస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్ అయిపోతుంది.