Gundeninda GudiGantalu Today episode September 9th: తన కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి మౌనిక చెప్పగానే మిగిలిన వాళ్ళందరూ కూడా తన ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతారు. నా ఆరోగ్యం బాగానే ఉంది. నేను కూడా బాగానే ఉన్నాను.. నువ్వు డైలీ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావా లేదా అని రోహిణి అడుగుతుంది.. నేను చెకప్ కి వెళ్తున్నాను వదినా అని మౌనిక చెప్పగానే రోహిణి ప్రభావతి నువ్వేంటి ఇంకా ఇక్కడ ముచ్చట్లు పెట్టుకున్నావు ప్రసాదలని చేసావా నైవేద్యాలని రెడీగా పెట్టావా అని అడుగుతుంది. వాటి గురించి నాకు ఏమీ తెలియదు అత్తయ్య అని రోహిణి ఎంత చెప్తున్నా సరే ప్రభావతి మాత్రం తెలియకపోతే తెలుసుకో అని అంటుంది. మీనా మాత్రం నేను చేస్తానులే అత్తయ్య రోహిణికి తెలియదు కదా అంటే ఆవిడేమీ ఆకర్షణ నుంచి ఊడిపడలేదు కదా నువ్వు దగ్గరుండి తన చేతి మొత్తం చేయించు అని మీనాకు చెప్తుంది.. ఎప్పుడూ వదినను నెత్తిన పెట్టుకునే మా అమ్మ ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది అని మౌనికకు అనుమానం మొదలవుతుంది.
మౌనిక ఏమైంది రోహిణి వదినను అమ్మ ఎందుకలా అరుస్తుంది ఏం జరిగింది అని అడుగుతుంది.. ఏం లేదు మౌనిక రోహిణి గురించి ఒక నిజం బయటపడింది దాంతో మీ అమ్మ ఇలా మాట్లాడుతుంది అని ప్రభావతి గురించి శృతి అన్ని విషయాలను మౌనికకు చెప్తుంది. ఏంటి రోహిణి వదిన ఇంత మోసం చేసిందా అంటే మలేషియా నుంచి తను రాలేదని మౌనిక అడుగుతుంది. అమ్మ అందుకేనా రోహిణి వదినని వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి అంటూ బాధ పెట్టేస్తుంది అని మౌనిక అంటుంది. ఇక రోహిణి లోపల మాత్రం చాలా సీరియస్ గా ఉంటుంది ఏమైంది నువ్వెందుకు అలా ఉన్నావు అని నేను అడగగానే నా గురించి మీరు మౌనికకు నిజం చెప్పారు కదా.. అందుకే నాకు చాలా కోపంగా ఉంది అని రోహిణి అంటుంది..
అన్ని పనులు దగ్గరే ఉండి చేసుకోమని రోహిణికి చెప్పడంతో రోహిణి కూడా వంటగదిలోనే ఉండి అన్నిట్లో చెయ్యిపెట్టి మరీ కష్ట పడిపోతూ ఉంటుంది. అయితే మౌలికకి రోహిణి మీద అనుమానం రావడంతో శృతిని అడుగుతుంది. శృతి అస్సలు వాగకుండా నోట్లో ఉన్నది మొత్తం కక్కేస్తుంది. లోపలికి వెళ్లిన మీనా పై రోహిణి సీరియస్ అవుతుంది అంతేకాదు.. నా గురించి మౌనికకు చెప్పడం అవసరమా అంటూ అరుస్తుంది.. ఎప్పుడో వచ్చి వెళ్లే మౌనికకి నా గురించి నిజం చెప్పడం అవసరమా అంటూ మీనా పై రోహిణి సీరియస్ అవుతుంది. ఎప్పుడో వచ్చే మౌనికకే నీ గురించి అనుమానం రావడంతో నిజం చెప్పాల్సి వచ్చింది అని మీనా అంటుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన శృతి ఏం మాట్లాడుతున్నావ్ అర్థం అవుతుందా రోహిణి నీ గురించి మాట్లాడాలంటేనే అసహ్యం ఇస్తుంది అంటూ దారుణంగా తిట్టేస్తుంది.. నువ్వు మనిషిలాగా కొంచెమైనా ప్రవర్తించు మీనా చెప్పిందే నువ్వు తప్పు అని అంటున్నావ్.. మీనా బాలు నీకోసం ఎంత చేశారో తెలుసా అని శృతి దిమ్మ తిరిగిపోయేలా రోహిణి కి కౌంటర్ ఇస్తుంది. శృతి ఎంతగా అంటున్న సరే రోహిణి మాత్రం మౌనంగా ఉండిపోతుంది.
నువ్వు ఒక మనిషి లాగా ఆలోచించు నువ్వు మావయ్య గారి 40 లక్షల దొబ్బేసి షాప్ పెట్టించిన విషయం బయటపడిన కూడా.. మీ ఇద్దరు కలవాలని బాలు మీనా చాలా ప్రయత్నాలు చేశారు. నీ మలేషియా బాగోతం బయటపడి నిన్ను అత్తయ్య ఇంట్లో నుంచి గెంటేసిన సరే మీ ఇద్దరిని కలవడానికి లోపల పెట్టి తాళం వేసాడు బాలు.. అలాంటి వీరిద్దరి గురించి నువ్వు ఇంత దారుణంగా మాట్లాడతావా నీకు కొంచమైన బుద్ధుందా..? నీలాంటి ఒక ఫ్రాడ్ నీ పూజలు ఆంటీ ఎలా కూర్చోనిస్తుందో నేను చూస్తాను. అసలు ఎందుకు ఆంటీ నిన్ను ఈ పూజలు కూర్చో పెడుతుందో కూడా నేను చూస్తాను నీ అంత చూస్తాను అంటూ రోహిణికి మనసులో ఉన్న నిజాన్ని మొత్తాన్ని బయటపెట్టేస్తుంది. అంతే కదూ శృతి మాటతో రోహిణి మౌనంగా ఉండిపోతుంది.. ఇక మీనా పద శృతి ఇక్కడ ఉంటే ఏదో ఒకటి గొడవ పెట్టుకుంటావు అని తీసుకొని వెళ్ళిపోతుంది..
మనోజ్ మణికంఠను తీసుకొని మళ్ళీ బారుకు వెళ్తాడు.. తన భార్య తను మళ్లీ మోసం చేసింది అని చెప్పుకొని బాధపడిపోతూ ఉంటాడు. మరో రోహిణి నన్ను మళ్ళీ మళ్ళీ మోసం చేస్తుంది అని మణికంఠతో చెప్పి కన్నీళ్లు పెట్టుకున్న మనోజ్ మందు తాగుతూ ఉంటాడు.. అది చూసిన గుణ తన భర్తని అడ్డుపెట్టుకొని రోహిణి చేత డబ్బులు తీసుకోవాలి అని అనుకుంటాడు.. రోహిణి కి ఫోన్ చేయించి దినేష్ చేసినట్లు చేసి చెప్పాలని అనుకుంటాడు. రోహిణి గుణ మాట విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. మొత్తానికి గుణ ప్లాన్ ప్రకారం రోహిణి డబ్బులు ఇస్తానని అంటుంది.
రోహిణి మనోజ్ ని ఎలాగైనా సరే కాపాడుకోవాలని అనుకుంటుంది. ఇక పూజ కోసమని అక్కడ ఉన్న వాళ్ళందరూ వస్తారు వాళ్ళందరిని ప్రభావతి రిసీవ్ చేసుకుని అందరితో సరదాగా మాట్లాడుతుంటుంది. వాళ్ళందరూ కూడా ప్రభావతిని ముగ్గురు కోడలు ఉన్నారు కదా ఇల్లు చాలా బాగుంటుంది అంటూ పొగిడేస్తూ ఉంటారు.. ప్రభావతి మాత్రం ముగ్గురు కోడలు ఉన్న ఏం ప్రయోజనం నా ఇంటికి ఏం తీసుకుని వచ్చి వచ్చారు అని బాధ పడిపోతూ ఉంటుంది. అయితే రోహిణి అందరూ అడగడంతో శృతి మాత్రం అడ్డంగా ఇరికించేస్తుంది మొత్తానికి రోహిణి కి ఘోర అవమానం అయితే జరుగుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…
Also Read :Podarillu Today Episode : కన్నాకు టెన్షన్.. మనసు మార్చుకొని మాధవ్.. బాధపడ్డ మనీష..