E-Paper
Advertisement

Podarillu Today Episode : కన్నాకు టెన్షన్.. మనసు మార్చుకొని మాధవ్.. బాధపడ్డ మనీష..

Podarillu Today Episode : కన్నాకు టెన్షన్.. మనసు మార్చుకొని మాధవ్.. బాధపడ్డ మనీష..
Advertisement

Podarillu Today Episode September 9th :మహాలక్ష్మి అలాగే చక్రి ఇద్దరు కూడా ఇంట్లో ఎంగేజ్మెంట్ కదా మనం వెళ్లి ఇంట్లోకి కావాల్సిన సరుకులు అన్నిటినీ కొనాలి అని వెళతారు. ఒక సూపర్ మార్కెట్ కి వెళ్ళగానే అక్కడ అన్ని సర్కుల్ని తీసుకుంటూ ఉండగా గోపిక సడన్గా ఎంట్రీ ఇస్తుంది. గోపికను చూసి చక్రి తనతో పులిహార కలిపే ప్రయత్నం చేస్తాడు. ఏంటి నువ్వు ఇదే షాప్ కి వచ్చావా సరుకులు ఏమైనా కొనాలా అని చక్రి అడుగుతాడు. గోపిక సిగ్గుపడుతూ ఉండడం చూసి ఏయ్ దొంగ నువ్వు నా కోసమే వచ్చావు కదా అని చక్రి అంటాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసినా మహాలక్ష్మి కోపంతో చక్రిని కొడుతూ ఒక ఆట ఆడుకుంటుంది.. గోపికతో మాట్లాడాలని చక్రి ప్రయత్నిస్తున్న సరే మహాలక్ష్మి మాత్రం చక్రిని కొడుతూనే ఉంటుంది. ఇక మొత్తానికి మహాలక్ష్మి చక్రి ఇద్దరు కలిసి ఇంట్లోనే సరుకులు అన్నిటినీ కొనేసి తీసుకొని వస్తారు.

జయంతి గురించి బయటపడ్డ నిజాలు..

మనము జయంతి గురించి ఏమి తెలుసుకోకుండానే పెళ్లికి రెడీ అవ్వడం మంచిది కాదు. తన గురించి అన్ని విషయాలను తెలుసుకోవాలి.. ఆమె ఎలాంటిదో తెలుసుకొని ఆ తర్వాత ఈ పెళ్లి కప్పుకోవడం మంచిది అని మహాలక్ష్మి అనగానే చక్రి సరే వాళ్ళ ఇంటి చుట్టుపక్కలకు వెళ్లి అడుగుదామని అంటుంది. జయంతి ఇంటి దగ్గరికి వెళ్లి ఆ చుట్టుపక్కల వాళ్ళని ఆరా తీస్తే..ఆమె మనస్తత్వం ఎలాంటిదో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలిసిపోతుంది కదా అని మహాలక్ష్మి చక్రి అనుకుంటారు.. జయంతి గురించి అక్కడ ఉన్న ఈ స్త్రీ మేస్త్రి అనడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు. జయంతి ఒక పెద్ద మహంకాళి లాంటిది అని తన భార్య కూడా చెప్పడంతో చక్రి మహాలక్ష్మి ఇలాంటి ఆవిడతో అన్నయ్యని పంపిస్తే మన కుటుంబాన్ని విడదీస్తుందేమో అని కంగారు పడిపోతుంటారు.. అన్నయ్యకి ఒకసారి చెప్పి ఈవిడ గురించి మాట్లాడాలి అని అనుకుంటారు..

కన్నా, కేశవ టెన్షన్..

Advertisement

చక్రి అన్నయ్య మహాలక్ష్మి వదిన వెళ్లారు కదా ఇంకా రాలేదేంటి అంటూ కన్నా అలాగే కేశవ ఇద్దరూ కంగారు పడిపోతూ వెతుకుతూ ఉంటారు. వీళ్ళు వెళ్లారు కదా రా.. జయంతి గురించి కనుక్కోవాలి అని మరి ఇంకా రాలేదు ఏంటి రా అని కేశవ కూడా అడుగుతూ ఉంటాడు. ఇక కన్నా తనదైన స్టైల్ లో సెటైర్లు వేస్తూ ఉంటారు అప్పుడే ఇంట్లోకి మహాలక్ష్మి చక్రి రాగానే ఏమైంది అన్నయ్య.. ఆ జయంతి గురించి ఏమైనా విషయాలు తెలుసా ఆమె ఎలాంటిది మంచిదేనా అని కన్నా అడుగుతాడు.. ఆమె గురించి ఒక్కరు కూడా మంచిగా చెప్పలేదు రా అన్నయ్యకు అలాంటి ఆవిడతో పెళ్లి చేస్తే ఇక మనకు అన్నయ్య దూరం అయిపోతాడు అని అందరూ బాధపడిపోతూ ఉంటారు. ఈ విషయాన్ని ఎలాగైనా సరే అన్నయ్యకి చెప్పాలని అనుకుంటారు.

కన్నీళ్లు పెట్టుకున్న మనీష..

మనీషా మాధవ్ ఇంటికి రాగానే చాలా సంతోషంగా తనని ఇంట్లోకి తీసుకొని వెళుతుంది.. బన్సీ మాధవ్ ఎందుకు వచ్చాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే లోపలికి వెళ్ళగానే మాధవ్ తో మాట్లాడాలి అని మనిషా కూడా ప్రయత్నాలు చేస్తుంది.. మాధవ్ నీ లోపలికి తీసుకొని వెళ్లి కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉండగా మనీషా కాఫీ తీసుకొని వస్తూ ఉంటుంది అయితే అప్పుడే మాధవ్ నాకు ఎంగేజ్మెంట్ రేపు అని చెప్పగానే ఒక్కసారిగా భయపడిపోయి ఆ కాఫీ కప్పు ని కింద పడేస్తుంది. మాధవ్ చెప్పిన మాట విని తన చాలా బాధపడిపోతుంది. ఇన్ని రోజులు మాధవ్ పై పెంచుకున్న ప్రేమని కళ్ళల్లో చూపిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏమైంది ఎందుకు అలా జరిగింది అని అడిగితే చెయ్యి జారిపోయింది నేను మళ్ళీ తీసుకొని వస్తాను అని మనిషా చెప్పిన సరే మాధవ్ వద్దని అంటాడు. ఇక ఎంగేజ్మెంట్ కి నాకు కొంచెం పని ఉంది కదా అన్న మనీషా అని పంపిస్తాను అని బంచి అంటాడు. ఆ మాట వినగానే మనిషా ఇంకాస్త బాధ పడిపోతుంది.

మాధవ్ నిర్ణయంతో షాక్..

Advertisement

ఆ జయంతితో అన్నయ్య పెళ్లి జరగడానికి వీల్లేదు ఎలాగైనా సరే ఈ పెళ్లిని ఆపాలి అన్నయ్యకి నచ్చ చెప్పాలి అని అనుకుంటారు.. అయితే ఇంట్లోకి మాధవ్ రాగానే మాధవ్ ని చూసి అందరూ భయపడిపోతూ ఉంటారు.. మీతో ఒక విషయం చెప్పాలి అని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు కానీ ఆ విషయాన్ని మాత్రం చెప్పరు చివరికి మహాలక్ష్మి ధైర్యం చేసి మీరు జయంతిని పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు అని చెప్తుంది. ఇక చక్రి అలాగే కన్నా ముగ్గురు కూడా జయంతి గురించి చెప్పగానే.. నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని మాధవ్ గట్టిగా చెప్పేస్తాడు.. అమ్మాయికి ఏమి తక్కువ లేదు నేను ఆల్రెడీ నా తమ్ముళ్ళని వేరు చేస్తే మాత్రం అసలు ఉండను అని అమ్మాయికి ముందే ఖచ్చితంగా చెప్పేసాను. మీరు భయపడాల్సిన పనిలేదు అని మాధవ్ జయంతిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతాడు.. ఇక మాధవ నిర్ణయాన్ని ఎవరు కాదనలేక జయంతితో పెళ్లికి ఒప్పుకుంటారు.

తాయారు షాక్.. గాయత్రీ హ్యాపీ..

మాధవ్ మన ఇంటి తరఫున బంధువులు ఎవరూ లేరు కదా ఎవరిని పిలవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు.. మన తరఫున ఉన్న ఒకే ఒక బంధువు తాయారు అత్తయ్య తనని కచ్చితంగా పిలవాల్సిందే అని అందరూ అనుకుంటారు అయితే నేను వెళ్లి అత్తయ్యకి చెప్తాను అని మాధవ్ తాయారును పిలవడానికి వెళ్తాడు. అయితే తాయారు ఇంట్లోకి మాధవ్ రాగానే ఎందుకొచ్చినవ్ రా.. నాకు చేసిన అవమానం సరిపోలేదా మళ్లీ నువ్వు వచ్చి అవమానించాలా అని వెటకారంగా మాట్లాడుతుంది. అయితే తాయారు ఎందుకు వచ్చావు అని అడిగితే నాకు నిశ్చితార్థం అత్త రేపు మీరు కచ్చితంగా రావాలి అని చెప్తాడు మాధవ్.. కానీ తాయారు నేను రాను అని అంటుంది గాయత్రి మాత్రం నేనిచ్చిన దానికి కచ్చితంగా నేను వస్తాను బావ అని మాటిస్తోంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్లో మాధవ్ నీ పెళ్ళికొడుకుగా చూసి అందరూ చాలా సంతోషంగా ఉంటారు.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ దెబ్బకు షాక్.. ప్రేమ పై నర్మద సెటైర్.. శ్రీవల్లికి దిమ్మతిరిగే ట్విస్ట్..

Related News

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ దెబ్బకు షాక్.. ప్రేమ పై నర్మద సెటైర్.. శ్రీవల్లికి దిమ్మతిరిగే ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: పార్వతికి అనుమానం..నిజం చెప్పిన అక్షయ్.. పల్లవి ఫుల్ హ్యాపీ..

Ninnu kori Serial Today Episode September 9th ‘నిన్నుకోరి’ సీరియల్‌: విరాట్‌కు ప్లాస్టిక్‌ సర్జరీ – ఒంటరిగా ఇంటికి వెళ్లిన చంద్ర

Wedensday Movies in Tv : సినీ ప్రియులకు సూపర్ న్యూస్.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..

Nindu Noorella Saavasam Serial Today Episode September 9th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అమర్

పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన.. బిగ్ బాస్ కోసమే వచ్చి దొరికిపోయారా?

బీబీ కొంపలో బెట్టింగ్ మాఫియా.. మరోసారి నాగార్జున పై రెచ్చిపోయిన నా అన్వేష్!

Big Stories

Advertisement
×