E-Paper
Advertisement

Gundeninda Gudigantalu TRP Rating : ‘గుండె నిండా గుడిగంటలు ‘ టీఆర్పీ.. జనవరి హైలెట్ ఎపిసోడ్స్..

Gundeninda Gudigantalu TRP Rating : ‘గుండె నిండా గుడిగంటలు ‘ టీఆర్పీ.. జనవరి హైలెట్ ఎపిసోడ్స్..
Advertisement

Gundeninda Gudigantalu TRP Rating : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ సీరియల్స్లలో గుండె నిండా గుడి గంటలు ఒకటి. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ రోజురోజుకీ ప్రేక్షకుల ఆదరణను పొందుతూ సూపర్ హిట్ టాక్ని సొంతం చేసుకుంటుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రసారమవుతున్న సీరియల్ జనాలని ఎంతగా అలరిస్తుందో చెప్పనక్కర్లేదు. బాలు మీనాలకు ప్రభావతి పెట్టే టార్చర్ ఈ సీరియల్కు హైలైట్ గా నిలిచింది. డిసెంబర్ నెలతో పోలిస్తే జనవరి నెలలో ఎపిసోడ్స్ బాగా హైలైట్ గా నిలిచాయి. మరి జనవరి నెలలో హైలెట్ అయిన ఎపిసోడ్స్ గురించి ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జనవరి హైలెట్ ఎపిసోడ్స్.. 

ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సూపర్ హిట్ సీరియల్ గుండెనిండా గుడి గంటలు. జనవరి నెలలో ఈ సీరియల్ జనాలని ఎంతగానో అలరించింది. ప్రభావతి తన డాన్సర్ స్కూల్ కి ఎవరు రాలేదని ఒక కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఎలాగైనా సరే తన డాన్సర్ స్కూల్ ని మళ్ళీ బిజీ అయ్యేలా చేసుకోవాలని డ్రెస్ కోడ్ ఆఫర్ ఇస్తుంది. కామాక్షి ప్రభావతి ఇద్దరు వెళ్లి డ్రెస్ కోడ్ ని తీసుకోవాలని అనుకుంటారు. అదే షాప్ కి రోహిణి కూడా ఒక అబ్బాయికి బట్టలు కొనాలని వస్తుంది. షాప్ అతను మాట చెప్పగానే రోహిణి షాక్ అవుతుంది. ఏదో ఒకటి చెప్పి చింటూ పేరును బయటకు రానివ్వకుండా మేనేజ్ చేస్తుంది. ఆ తర్వాత సుమతి డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతుంది. అంతే కాదు తన కాలేజీలో మొదటి స్థానంలో ఉండడంతో ఇంట్లోని వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు. మీ నాకు ఈ విషయాన్ని చెప్పగానే ఇంట్లోని వాళ్ళ అందరితో తన సంతోషాన్ని పంచుకుంటుంది. ఒక ప్రభావతి తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా సుమతి చాలా గొప్పగా చదివింది అంటూ మెచ్చుకుంటారు. ఇక ఆ తర్వాత సుమతికి జాబు కూడా వచ్చేస్తుంది. శివ పుట్టినరోజు సందర్భంగా మీనా బాలు వద్దన్నా సరే శివ దగ్గరికి వెళ్తాడు.. వీళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చేలా ప్రభావతి చేస్తుంది. కానీ ప్రభావతి ఎత్తుగడలు ఏవి కూడా బాలు మీనాల ప్రేమ ముందు నిలవలేకపోయాయి. వాళ్ళిద్దరూ మళ్లీ కలిసిపోవడంతో ప్రభావతి నిరాశపడుతుంది. మొత్తానికి బాలు మీనలు మళ్లీ ఒకటి అవ్వడంతో చాలా సంతోషంగా ఉంటారు. సుమతికి ఉద్యోగం ఒక హాస్పిటల్లో వస్తుంది. అదే హాస్పిటల్ కి రోహిణి రెండోసారి ప్రెగ్నెన్సీ కోసం చెకప్ కు వస్తుంది. అది తెలుసుకున్న సుమతి మీనాకు చెప్పడంతో రోహిణి ప్రెగ్నెంట్ అని అందరికీ చెప్తుంది. నేను ప్రెగ్నెంట్ కాదు. ప్రెగ్నెంట్ అవ్వడానికి చెకప్ చేయించుకుని వచ్చాను అని అనగానే అందరూ మీనా అని దారుణంగా తిట్టేస్తారు.. ఆ తర్వాత మరోసారి రోహిణి రెండోసారి ప్రెగ్నెంట్ కాబోతుందని తెలుసుకున్న మీనా ఈ విషయాన్ని శృతితో చెప్తుంది. శృతి ఇంట్లోని వాళ్లందరితో చెప్తుంది. అది కాస్త ప్రభావతి చెవిన పడడంతో పెద్ద రచ్చ చేస్తుంది.. మొత్తానికి రోహిణి అయితే ఏదో ఒకటి చెప్పి కథల్లేసి తప్పించుకుంటుంది.. జనవరి నెలలో హైలెట్ ఎపిసోడ్స్ ఇవే..

Advertisement

Also Read : ‘వారసురాలు’ నటీనటులు.. ఎవరు ఏ పాత్రలో నటిస్తున్నారంటే..?

ప్రస్తుతం స్టోరీ ఏంటంటే.. 

రోహిణి రెండోసారి ప్రెగ్నెంట్ అని చెప్పగానే ప్రభావతి అసలు నిజం ఏంటో తెలుసుకోవాలని రోహిణిని అడుగుతుంది. మొత్తానికి రోహిణి మరో కొత్త కథని చెప్పి ప్రభావతిని బోల్తా కొట్టిస్తుంది. బాలు మేనాలు రోహిణి ఏదో దాస్తుంది అని తెలుసుకునే ప్రయత్నం చెయ్యబోతారు.. రోహిణి మాత్రం ఎలాగైనా సరే వీరిద్దరిని ఇంట్లోంచి పంపించాలని అనుకుంటుంది. సుమతి చేసిన పనికి హాస్పిటల్లో ఉద్యోగం మానేయమని చెప్తారు ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే ఇవాళ ఎపిసోడ్ ని అసలు మిస్ అవ్వకుండా చూడాల్సిందే…

Related News

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

Big Stories

Advertisement
×