Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ( Virat Kohli ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒంటి చేత్తో ఇండియాకు ఎన్నో విజయాలు అందించిన విరాట్ కోహ్లీ, ప్రస్తుతం వన్డేలో మాత్రమే కొనసాగుతున్నాడు. ఇప్పటికీ టీ20లు, టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చిన విరాట్ కోహ్లీ, కేవలం వన్డేల్లో కొనసాగుతూ అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో కూడా అదరగొడుతున్నాడు విరాట్ కోహ్లీ. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కోహ్లీ ప్రాతినిధి మహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అలాంటి విరాట్ కోహ్లీకి ఘోర అవమానం జరిగింది. విరాట్ కోహ్లీని ఆస్ట్రేలియా క్రికెటర్ చేసేశారు కొంతమంది కేటుగాళ్లు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం జరిగిన తర్వాత ఏవీ నిజమైన ఫోటోలు ? ఏవీ ఫేక్ ఫోటోలు ? అసలు ఇది నిజమో ? ఏది అబద్దమో తెలియడం లేదు. అంతా గ్రాఫిక్స్ మహిమ అయిపోయింది. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి కొందరు దుర్మార్గులు విరాట్ కోహ్లీని అవమానించారు. ఈ ఏఐ ద్వారా విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా జట్టులో ఉన్నట్లు క్రియేట్ చేశారు. ఆస్ట్రేలియాకు చెందిన ఎల్లో జెర్సీ విరాట్ కోహ్లీ వేసుకున్నట్లు క్రియేట్ చేసిన కేటుగాళ్లు, అతని ఫేస్ కూడా మార్చేశారు. ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ పుట్టి పెరిగితే ఎలా ఉంటుందో? అచ్చం అలాగే చేసేసారు. అంతేకాదు అతని బ్యాగ్రౌండ్ లో ఆస్ట్రేలియన్ ప్లేయర్లను కూడా క్రియేట్ చేశారు. ఆస్ట్రేలియా ( Australia Virat Kohli) ఆటగాడు ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ లో విరాట్ కోహ్లీ ఆడుతున్నట్లు మరికొన్ని ఫోటోలు క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. ఇవి చూసిన జనాలు పిచ్చోళ్ళు అయిపోతున్నారు. నిజంగానే విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాలో ఆడినట్లే ఫోటోలు కనిపిస్తున్నాయి. దీంతో ఆస్ట్రేలియాలో మరో విరాట్ కోహ్లీ ఉన్నాడని కొంత మంది అనుకుంటున్నారు. కోహ్లీ ఫోటోలు ఇలా క్రియేట్ చేసినందుకు కొంత మంది ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వార్నింగ్ చేస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( IPL 2026 ) మార్చి26 వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే ఆర్సీబీ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు కోహ్లీ. ప్రస్తుతం లండన్ లోనే రెస్ట్ తీసుకుంటోన్న విరాట్ కోహ్లీ, త్వరలోనే ఇండియాకు రానున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( IPL 2026 ) కోసం ఇప్పటికే మహేంద్ర సింగ్ ధోని ( Ms dhoni) ప్రాక్టీస్ మొదలెట్టాడు. త్వరలోనే కోహ్లీ ( Virat Kohli) కూడా బరిలోకి దిగనున్నాడు.
— Out Of Context Cricket (@GemsOfCricket) January 26, 2026