E-Paper
Advertisement

Malayalam OTT Releases : జనవరి చివరి వారం మిస్ అవ్వకుండా చూడాల్సిన మలయాళ సినిమాలు… లిస్ట్ లో 100 కోట్ల సినిమా కూడా

Malayalam OTT Releases : జనవరి చివరి వారం మిస్ అవ్వకుండా చూడాల్సిన మలయాళ సినిమాలు… లిస్ట్ లో 100 కోట్ల సినిమా కూడా
Advertisement

Malayalam OTT Releases : నివిన్ పౌలీ నటించిన రీసెంట్ మూవీ ‘సర్వం మాయ’ ఈ వారం ఓటీటీలో విడుదల కానుంది. అదే సమయంలో ఇటీవల విడుదలైన శేషిప్పు, కలాంకావల్ వంటి మరికొన్ని సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి. ఇవన్నీ ఈ వీకెండ్ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమాలే. మరి ఈ సినిమాలు ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి ? ఎప్పుడు అందుబాటులో ఉంటాయి ? అనే వివరాలను తెలుసుకుందాం.

సర్వం మాయ

నివిన్ పౌలీ, రియా శిబు కీలక పాత్రల్లో నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ క్రిస్మస్ సందర్భంగా వచ్చింది. 100 కోట్లు కలెక్ట్ చేసి అందరి చేత ప్రశంసలు అందుకుంది. నివిన్, అజు వర్గీస్ కలిసి నటించిన కామెడీ సీన్స్ కూడా ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్నాయి. జియోహాట్‌స్టార్ లో ఈ సినిమా జనవరి 30 నుంచి అందుబాటులోకి రానుంది.

శెషిప్పు

Advertisement

ఈ చిత్రం మహిళల భద్రత నేపథ్యంలో ఉంటుంది. ముఖ్యంగా వేధింపుల వల్ల కలిగే మానసిక క్షోబను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. అంజు పాత్రలో మీనాక్షి జయన్ నటనతో శేషప్పు సినిమాను ప్రత్యేకంగా నిలిపింది. సన్ NXT, OTTplay లో ఈ సినిమా జనవరి 23 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

కలాంకావల్

థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి, కలాంకావల్ సినిమా చూడటానికి అనువైన సినిమా. వినాయకన్ నటించిన ఈ సినిమా కొట్టాయికోణంలో జరిగే పోలీసు దర్యాప్తు చుట్టూ తిరుగుతుంది, వరుస భయంకరమైన హత్యలు, మహిళల మిస్సింగ్ సంఘటనలతో ఈ సినిమా ఉత్కంఠంగా ఉంటుంది. సైనైడ్ మోహన్ అనే రియల్ కిల్లర్ స్టాన్లీ దాస్ పాత్రలో మమ్ముట్టి ఇరగదీశాడు. ఈ సినిమాను ప్రస్తుతం Sony LIV లో చూడవచ్చు.

భా భా బా

Advertisement

కేరళ ముఖ్యమంత్రి అవినీతిపరుడని ఆరోపణలు వచ్చినప్పుడు జరిగే గందరగోళంతో సినిమా ఉంటుంది. ముఖ్యమంత్రిని నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేయడంతో అసలు కథ మొదలవుతుంది. మోహన్ లాల్ గెస్ట్ పాత్రతో ‘భా భా బా’ కి హైప్ తెచ్చారు. ZEE5 లో చూడచ్చు.

ఖెద్ద

ఈ ఎమోషనల్ డ్రామా ఒక అమ్మ, కూతురు మధ్య రిలేషన్‌షిప్ సెన్సిటివ్‌గా ఎక్స్‌ప్లోర్ చేస్తుంది. రియల్ లైఫ్ రిలేషన్స్‌ను డీప్‌గా టచ్ చేసే ఈ చిత్రం హార్ట్ టచింగ్‌గా ఉంటుంది. అశా శరత్, ఉత్తర శరత్ వంటి నటీనటులు నటించారు. 2026 జనవరి 9 నుంచి ManoramaMaxలో అందుబాటులో ఉంది.

హత్తనే ఉదయ

ఉత్తర మలబార్ ప్రాంతంలోని ప్రజల ఆధ్యాత్మిక సంబంధాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రం 2025 ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదలైంది. కె. కున్హిరామన్ పనిక్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆతిరా సావిత్రి, దేవరాజ్ కోజికోడ్ సంతోష్ మానియాట్ ప్రధాన పాత్రలు పోషించారు. హిస్టారికల్ గ్లిమ్ప్సెస్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో స్టోరీ ఉంటుంది. ఇది 2026 జనవరి 23 నుంచి ManoramaMaxలో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also : 8వ రాత్రి శాపం… చూశారంటే పోతారు… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు చూడకూడని హర్రర్ మూవీ

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×