E-Paper
Advertisement

ఆ క్షణం భయంతో వణికిపోయా.. కారు ఆపి మరీ చుట్టుముట్టారు- బుల్లితెర నటి ఆవేదన!

ఆ క్షణం భయంతో వణికిపోయా.. కారు ఆపి మరీ చుట్టుముట్టారు- బుల్లితెర నటి ఆవేదన!
Advertisement

Actress Haritha: అటు సినిమాలలో ఇటు సీరియల్స్ లో నటించే పాత్రలు ప్రేక్షకులను ఏ విధంగా ప్రభావితం చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా హీరో హీరోయిన్స్ రోల్స్ ను అభిమానులు ఏ విధంగా అయితే ఆదరిస్తారో.. అటు విలన్ పాత్రధారులను కూడా అంతే ఆదరిస్తారు అనడానికి బహిరంగంగా జరిగే సంఘటనలే నిదర్శనం అని చెప్పాలి. ఒకప్పుడు తనికెళ్ల భరణి మాతృదేవోభవ సినిమాలో చూపించిన విలనిజానికి, ఆయన బయటకు వెళ్ళినప్పుడు మహిళలు ఆయనను చుట్టుముట్టి చంపేసేంత పని చేశారని ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే సీనియర్ నటి అంజలీదేవి లవకుశ సినిమాలో జానకమ్మ పాత్ర పోషించి అందరిని మెప్పించింది. ఆమె ఒకసారి బయటకు వచ్చినప్పుడు అటుగా వెళుతున్న మహిళలు ఆమె నిజంగానే దేవత అని భావించి,, ఆమె కాళ్ళపై మోకరిల్లి ఆమె ఆశీర్వాదం తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ ఉదాహరణలను బట్టి చూస్తే ప్రజలు, ప్రేక్షకులు సినిమా పాత్రలను ఏ విధంగా ఓన్ చేసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు.

జనాలు తిరగబడ్డారు – హరిత

ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక సీరియల్ నటి తాను విలన్ పాత్రలు చేయడం వల్ల.. ఆ పాత్ర ప్రేక్షకులకు నచ్చలేదని, అందులో లీనమైపోయి తాను బయట కనిపించినప్పుడు తనను చుట్టుముట్టి దాడి చేసే ప్రయత్నం చేశారు అంటూ కామెంట్ చేసింది. ఇకపోతే గతంలో ఈ విషయాలన్నీ చెప్పగా ఇప్పుడు మళ్ళీ వైరల్ గా మారుతున్నాయి. ఆమె ఎవరో కాదు ప్రముఖ సీరియల్ నటీమణి హరిత (Haritha). తన విలన్ పాత్రల వల్ల తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి హరిత మాట్లాడుతూ..” తమిళ్ సీరియల్స్ లో నటించేటప్పుడు చాలా సీరియల్స్ లో నేను విలన్ పాత్రలే పోషించాను. అప్పట్లో జనాల మీద సీరియల్స్ ప్రభావం చాలా తక్కువ. దూరదర్శన్ తో పాటు రెండు మూడు చానళ్లు మాత్రమే ఉండేవి . అందుకే నటీనటులను ప్రేక్షకులు బాగా గుర్తుపెట్టుకునేవారు.

ఇంటికి ఫోన్ చేసి మరీ బెదిరించేవారు..

Advertisement

ఒకసారి నేను ఒక సీరియల్లో విలన్ పాత్ర పోషించాను. అది బాగా హిట్ అయింది. కానీ నాకు సమస్యలు తెచ్చి పెట్టింది. ఎలా అంటే నా నంబరు కనుక్కొని మరీ ఇంటికి ఫోన్ చేసి బెదిరించేవారు. తప్పు పనులు చేస్తే ఊరుకోమని .. మళ్లీ కనిపిస్తే బాగోదని హెచ్చరించే వాళ్ళు .. ఇక వాళ్లందరికీ సర్ది చెప్పుకొనే సరికి నా తల ప్రాణం తోకకు వచ్చేది. అంటూ తెలిపింది హరిత.. ఇలాంటి ఇబ్బందులు తెలుగు సీరియల్స్ లో కూడా ఎదురయ్యాయి. నేను తెలుగు సీరియల్స్ లో సుమారుగా 25 కు పైగా సీరియల్స్ లో నటించాను. ఇక్కడ కూడా విలన్ పాత్రలే వచ్చాయి.

ALSO READ:ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన నిహారిక రాకాస.. ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చంటే?

భయంతో అక్కడినుంచి పారిపోయా – హరిత

Advertisement

అలా ఒకసారి హైదరాబాదులో మా కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లికి వెళ్తే.. నేను వెళ్తున్న కారు ఆపి మరీ” ఇదిగో ఇదే పాపను నిత్యం ఏడిపించేది.. అసలు నువ్వు ఆడదానివే.. పసిపిల్లని అలా చేస్తావా?” అంటూ తిట్ల పురాణం మొదలుపెట్టారు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని భయంతో ఇంటికి వెళ్లిపోయాను. అప్పటినుంచి చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. ఇక ఇప్పటివరకు ముద్ద మందారం, అగ్నిపూలు, ఇంటింటి రామాయణం, చదరంగం ఇలా సుమారుగా పాతికి పైగా సీరియల్స్ లో నటించాను” అంటూ హరిత తెలిపింది. ఇక హరిత చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

త్రిగుణ్ ధూత.. వైల్డ్ కార్డ్స్ కి ఊహించని దెబ్బ..ఇది కదా అసలు గేమ్ అంటే?

Big Stories

Advertisement
×