E-Paper
Advertisement

Telugu Serials : బుల్లితెర ఆడియన్స్ కు బ్యాడ్ న్యూస్.. త్వరలో శుభం కార్డు పడబోతున్న టాప్ సీరియల్స్..

Telugu Serials : బుల్లితెర ఆడియన్స్ కు బ్యాడ్ న్యూస్.. త్వరలో శుభం కార్డు పడబోతున్న టాప్ సీరియల్స్..
Advertisement

Telugu Serials : బులితెర ఆడియన్స్ కు బ్యాడ్ న్యూస్.. అదేంటి.. ఏం జరిగిందనే అనుమానం కలుగుతుంది కదూ.. దానికి కారణాలు లేకపోలేదు. ప్రస్తుతం తెలుగులో ప్రసారం అవుతున్న టాప్ సీరియల్స్ లలో కొన్ని సీరియల్స్ ప్రేక్షకులకు సడెన్ షాక్ ఇస్తూ శుభం కార్డు వేసుకోబోతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖ తెలుగు ఛానెల్ స్టార్ మాలో ప్రసారం అవుతున్న కొన్ని టాప్ సీరియల్స్ ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. అందులో కొన్ని టాప్ రేటింగ్ సీరియల్స్ కు త్వరలోనే శుభం కార్డు పడబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త సీరియల్స్ కొన్ని ప్రసారం అయ్యేందుకు సిద్ధం అవుతున్నాయి. అందుకే పాత సీరియల్స్ స్టోరీని కట్ చేసి ముగింపుపలికే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆ సీరియల్స్ ఏవి? ప్రస్తుతం స్టార్ మాలో ఏ రేటింగ్ లో దూసుకుపోతున్నాయో ఒకసారి తెలుసుకుందాం..

త్వరలోనే బుల్లితెరపై కనుమరుగవుతున్న సీరియల్స్ ఇవే..

కార్తీక దీపం 2..

ప్రముఖ తెలుగు ఛానెల్ స్టార్ మాలో ప్రసారం అవుతున్న టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్ కార్తీక దీపం.. గతంలో వచ్చిన ఈ డైలీ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. ఆ సీరియల్ కు సీక్వెల్ గా కార్తీక దీపం 2 ప్రస్తుతం ప్రసారం అవుతుంది.. ఈ సీరియల్ స్టోరీ పై ఈ మధ్య విమర్శలు ఎదురవుతున్నాయి.. దాంతో ప్రస్తుతం సీరియల్ కు శుభం కార్డు వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత మరో స్టోరీతో కార్తీక దీపం 3 ని ప్రసారం చెయ్యనున్నట్లు ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. మరి దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం..

Advertisement

Also Read :బిగ్ బాస్ వల్ల చాలా నష్టపోయాను.. ఆ ఒక్కటి బాధగా అనిపించింది..

గుండెనిండా గుడిగంటలు.. 

స్టార్ మాలో ప్రసారం అవుతున్న టాప్ సీరియల్స్ లలో ఒకటి గుండెనిండా గుడిగంటలు.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామాతో మొదలైన స్టోరీ కావడంతో జనాలు ఎక్కువగా ఆదరించారు. గత నెల క్రితం ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించిన ఈ సీరియల్ ఈ మధ్య బోర్ కొడుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దాంతో సీరియల్ ను ఇక్కడితో ముగించేసి.. మళ్లీ కొత్తగా స్టోరీతో సీక్వెల్ చెయ్యనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అందులో నిజమేంత ఉందో త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.  బిగ్ బాస్ అయ్యాక కొన్ని సీరియల్స్ కు శుభం కార్డు వెయ్యనున్నారని టాక్.. స్టార్ రేటింగ్ దూసుకుపోతున్న సీరియల్స్ ను తీసేయ్యడం పై పలు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి..

Advertisement

ఇవే కాదు, స్టార్ మాలో యావరేజ్ టాక్ ను అందుకున్న కొన్ని సీరియల్స్ లలో పాపే మా జీవన జ్యోతి సీరియల్ కూడా ఒకటి. ఇది స్టోరీ పూర్తి కావొస్తుంది. శుభం కార్డు పడబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం స్టార్ మా ఛానెల్ లో బిగ్ బాస్ ప్రసారం అవుతుంది. ఇది పూర్తి అయ్యాక కొత్త సీరియల్స్ ప్రేక్షకులను పలకరించనున్నాయని టాక్..

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Big Stories

Advertisement
×