E-Paper
Advertisement

OTT Movie : ఒంటరి అమ్మాయి కనపడితే ఈ సైకో ఆగలేడు… స్టేట్ ని కుదిపేసిన కేసు… మస్ట్ వాచ్ సిరీస్

OTT Movie : ఒంటరి అమ్మాయి కనపడితే ఈ సైకో ఆగలేడు… స్టేట్ ని కుదిపేసిన కేసు… మస్ట్ వాచ్ సిరీస్
Advertisement

OTT Movie : దెయ్యాలకు మనుషుల్ని భయపెడతారో లేదో తెలియదు గాని, సీరియల్ కిల్లర్స్ ని చుస్తే కచ్చితంగా భయపడతారు. వాళ్ళు చేసే వయలెన్స్ నరకంలో కూడా ఉండవేమో అనిపిస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే డాక్యుమెంటరీ సిరీస్ ను చుస్తే మీరు కూడా అవుననే అంటారు. బెంగళూరులో 1990ల కాలం నాటి భయంకరమైన కిల్లర్ వల్ల, అప్పట్లో నగరవాసులు వణికిపోయారు. కిల్లర్ మహిళలపై అఘాయిత్యాలు చేసి, చంపి వాళ్ళ లోదుస్తులను తీసుకెళ్ళేవాడు. అతని ఇంట్లో మూడు వందల ఇన్నర్ వేర్లు దొరికాయంటే కిల్లర్ ఏ రేంజ్ లో అరాచకం సృష్టించాడో తెలిసిపోతుంది. ఇప్పుడు డాక్యుమెంటరీగా, ఈ రియల్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలో అందుబాటులో ఉంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

2022లో రిలీజ్ అయిన ఈ రియల్ లైఫ్ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్ పేరు ‘Indian Predator: The Beast of Bangalore’. అశ్విన్ రాయ్ షెట్టి దర్శకత్వంలో సుమిత్ రాయ్ దీనిని నిర్మించారు. మొత్తం 3 ఎపిసోడ్లతో 2022 డిసెంబర్ 16నుంచి Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also : ఈ ఫ్యామిలిలో అందరూ తోపులే… టచ్ చేస్తే తోలు తీసుడే… ఈ కొరియన్ సినిమాను తెలుగులోనూ చూడొచ్చు

స్టోరీ ఏమిటంటే

1996-98 మధ్య బెంగళూరులో ఉమేష్ రెడ్డి అనే ఒక సీరియల్ కిల్లర్ ఆరాచకాలు సృష్టించాడు. స్కూల్ టీచర్‌గా, పోలీస్ కానిస్టేబుల్‌గా, బస్ కండక్టర్‌గా ఉద్యోగాలు మార్చుకుంటూ, రాత్రి సమయంలో ఒంటరిగా ఉండే ఇంట్లోకి చొరబడి మహిళలపై అఘాయిత్యాలు చేసి, చాలామందిని హత్య చేసేవాడు. హత్యలు చేసిన తరువాత బాధితుల లో దుస్తులను తనతోపాటు తెసుకెళ్ళేవాడు. ఇదే అతన్ని పట్టుకోవడానికి కీలకమైన క్లూ అవుతుంది. 1996లో మొదటి సారిగా 16 ఏళ్ల టీనేజ్ బాలికపై అఘాయిత్యం చేసి చంపడంతో మొత్తం బెంగళూరు నగరం భయపడిపోతుంది. CID ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. ఉమేష్ రెడ్డి మీద అనుమానంతో అరెస్ట్ చేస్తారు. అయితే అతను తెలివిగా ఎస్కేప్ అవుతాడు. మళ్లీ మరిన్ని క్రైమ్స్ చేస్తాడు.

Advertisement

చివరగా1998లో జరిగిన ఒక మర్డర్ మరింత సంచలనంగా మారుతుంది. జయశ్రీ అనే ఒక మార్వాడి హౌస్‌వైఫ్ పై అఘాయిత్యం చేసి, తల నరికి, ఆమె ఇన్నర్‌వేర్ తెసుకెళ్తాడు. ఇదే అతన్ని పట్టుకోవడానికి టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఆ ఇంట్లో ఇన్నర్‌వేర్‌పై ఉన్న ఒక గుర్తు, ఉమేష్ రెడ్డి వద్ద ఉన్న ఇన్నర్ వేర్ తో మ్యాచ్ అవుతుంది. అంతేకాదు అతని దగ్గర 300లకు పైగా ఇన్నర్‌వేర్లు దొరుకుతాయి. ప్రతి ఒక్కటి ఒక బాధితురాలిది. అయితే 9 మర్డర్లను, 20కి పైగా రేప్ కేసులకు మాత్రమే పోలీసులు గుర్తించడం జరిగింది. అతను ఇప్పటికీ జైల్లో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు.

 

 

 

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×