Ye Devi Varamo Neevu Hero: ఇటీవల కాలంలో సీరియల్ హీరోలు సినిమాలకు మించిన స్టంట్ లు చేస్తున్నారు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది సీరియల్ హీరోలు ఆసుపత్రిలో ఉన్న ఫోటోలను వీడియోలను షేర్ చేస్తున్నారు. అందుకు కారణం సీరియల్ కోసం వాళ్ళు చేస్తున్న రిస్కీ స్టంట్ లు అని గతంలో కొన్నిసార్లు వార్తలు వినిపించాయి. తాజాగా ఏ దేవి వరమో నీవు సీరియల్ హీరో కూడా ఆసుపత్రిలో ఉన్న వీడియోని షేర్ చేసారు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆ వీడియోలో అతను చేతికి కట్టుతో కనిపిస్తున్నాడు. మరి ఆ వీడియోలో కనిపిస్తున్నట్లు అతనికి ఏమైంది..? అసలు నిజంగానే ప్రమాదం జరిగిందా..? లేదా అన్నది ఒకసారి తెలుసుకుందాం..
ఏ దేవి వరమో నీవు సీరియల్లో హీరోగా నటించిన శ్రవణ్ కుమార్ తాజాగా తన ఇంస్టాగ్రామ్ లేదు కదా ఒక వీడియోని షేర్ చేసారు.. ఆ వీడియోలో ఆయన ఆసుపత్రిలో బెడ్ మీద ఉన్నట్లు కనిపిస్తుంది.. నడుముకి బెల్టు అలాగే చెయ్యికి కూడా బెల్ట్ పెట్టుకుని కనిపిస్తాడు. బ్లడ్ శాంపిల్స్ టాబ్లెట్స్ ఇలా అన్ని చూపిస్తూ అతని వీడియో ఉంటుంది. తన కుటుంబ సభ్యులు తను రికవరీ కోసం ఎంత కష్టపడ్డారు అన్నది ఆ వీడియోలో కనిపిస్తుంది.. ఫైనల్ గా అతను రికవరీ అయ్యే సీరియల్ షూటింగ్లో పాల్గొన్నట్లు కనిపిస్తుంది. అయితే నిజంగానే అతనికి ఏదైనా ప్రమాదం జరిగిందా లేదా సీరియల్ లో భాగంగా చూపించారా? అన్నది క్లారిటీ రాలేదు.. మీరు ఏమైనా కూడా హీరోకి ఆ పరిస్థితి రావడం పై పలువురు అభిమానులు బాధపడిపోతున్నారు. నిజంగానే హీరోకి ప్రమాదం జరిగిందా ? అదే కోణంలో గూగుల్లో ఎక్కిస్తున్నారు.. మరి ఏం జరిగింది అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.
?igsi=OTE1MWQ0YWdjMDZv
బుల్లితెర సీరియల్ హీరో శ్రావణ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈయన గతంలో అనేక సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను తన నటనతో మెప్పించాడు. మగువ ఓ మగువ, అత్తారింటికి దారేది, అమ్మకు ప్రేమతో, పల్లకిలో పెళ్లికూతురు వంటి సూపర్ హిట్ సీరియల్స్ లలో నటించారు. ఆ సీరియల్స్ అన్ని కూడా మంచి సక్సెస్ టాక్ ను అందుకున్నాయి.. ప్రస్తుతం ఏ దేవి వరమో నీవు సీరియల్ లో నటిస్తున్నాడు.. రెండు నెలల క్రితం ప్రారంభమైన ఈ సీరియల్ ప్రస్తుతం జనాలని విపరీతంగా కట్టుకుంటుంది. హీరో హీరోయిన్ల పాత్రలను పరిచయం చేస్తూ గతంలో రిలీజ్ అయిన వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రిచ్ ఫ్యామిలీ లో పుట్టిన అతను ఒక అనవసరంలో పెరిగిన అమ్మాయిని ప్రేమిస్తాడా పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడా అన్నది ఈ సీరియల్ స్టోరీ. మరి ప్రస్తుతం ఈ సీరియల్లో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకోవడంతో జనాలు సీరియల్ చూసేదానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అతి త్వరలోనే బిగ్ బాస్ రాబోతుంది కాబట్టి ఈ సీరియల్ టైమింగ్ లో మార్పులు ఏమైనా వస్తాయేమో చూడాలి..
Also Read : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..