Inzamam-ul-Haq On Asia cup 2026: మహిళ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (Women’s Asia Cup 2026 Tournament) ఆగస్టు 28వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ ఈ మెగా టోర్నమెంటులో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో టీమిండియా రెండు మ్యాచ్ లు ఫినిష్ చేసుకుంది. రెండింటిలో గెలిచి గ్రూప్-ఏ లో వాడి స్థానంలో నిలిచింది. ఇక నిన్న టీమిండియా మహిళల జట్టుతో హాంకాంగ్, చైనా మహిళల జట్టు తలపడింది. ఇందులో అద్భుతంగా రాణించిన మహిళల టీమిండియా ఏకంగా 137 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.
ఆసియా కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా నిన్న టీమిండియా వర్సెస్ హాంకాంగ్, చైనా మహిళల మధ్య ( India Women vs Hong Kong, China Women, Match 7, Group A, ) ఏడవ మ్యాచ్ జరిగింది. ఇందులో టీమిండియా అద్భుతంగా రాణించి 137 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్ లో ఓపెనర్ స్మృతి మందాన ( Smriti Mandhana) సెంచరీ చేసి దుమ్ము లేపారు. 64 బంతుల్లో 124 పరుగులు చేసి రఫ్ పాడించారు. ఇందులో ఏడు సిక్సులతో పాటు 14 బౌండరీలు ఉన్నాయి. 193.75 స్ట్రైక్ రేటు తో ఆమె చెడుగుడు వాడేసుకున్నారు. ఈ దెబ్బకు టీమిండియా అవలీలగా విజయం సాధించింది.
అయితే ఈ మ్యాచ్ లో స్మృతి మందాన సెంచరీ చేయడంపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్మృ తి మందాన బ్యాట్ లో అటు అర్టిఫీషియల్ ఇంటెలిజెంట్స్ చిప్స్ ఉన్నాయని… ఇప్పటికే ఈ విషయాన్ని తన్వీర్ అహ్మద్ గుర్తు చేశాడని తెలిపారు. చిప్స్ ఉండడం వల్లనే ఆమె అవలీలగా బ్యాటింగ్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు. దీనిపై వెంటనే ఐసీసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హాంకాంగ్, చైనా టీమ్ పై 137 పరుగులు తీయడంతో టీమిండియా విజయాన్ని అందుకుంది. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా మహిళల జట్టు 20 ఓవర్లు ఆడింది. ఈ క్రమంలో ఐదు వికెట్ నష్టపోయిన టీమ్ ఇండియా 193 పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. అట్ హాంకాంగ్, చైనా 16.2 ఓవర్లలో 56 పరుగులకు కుప్పకూలింది.