Bigg Boss 10:బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఎట్టకేలకు సెప్టెంబర్ 6వ తేదీన చాలా గ్రాండ్ గా లాంచ్ అయింది. 10 మంది సెలబ్రెటీలు, 6 మంది కామనర్స్ తో హోరాహోరీగా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందివ్వబోతోంది. ఇప్పటికే మొదటివారం ఎలిమినేషన్స్ కి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అటు సోషల్ మీడియా వేదికగా హౌస్ లో ఉన్న వారికి మద్దతుగా కొంతమంది సెలబ్రిటీలు తమ అధికారిక సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.సాధారణంగా బిగ్ బాస్ ప్రారంభం అయిన రోజు నుంచి చివరి రోజు వరకు కంటెస్టెంట్స్ కి అండగా నిలిచేవారు ఒక గ్రూప్ గా ఏర్పడతారు. తమ ఫేవరెట్ కంటెస్టెంట్ కోసం ఫ్యాన్ పేజీలు, ఓటింగ్ కోసం రిక్వెస్ట్లు క్యాంపెయినింగ్ లు అభిమానంతో చేస్తారు. వీటికి తోడు.. ఎవరికి వారు బయట సొంత పిఆర్ టీంలను కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు.
అభిమాన కంటెస్టెంట్ ను గెలిపించుకోవడానికి బయట జరిగే రచ్చ అంతా ఇంతా కాదు. నిజానికీ సెలబ్రిటీలు కావడంతో కొంతమందికి స్వతహాగా ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇతర సెలబ్రిటీల మద్దతు కూడా లభిస్తుంది. ఓటింగ్ జరిగేటప్పుడు కూడా ఈ సపోర్ట్ బాగా వర్కౌట్ అవుతుంది. అందుకే సెలబ్రిటీలు ఫలానా వారికి అండగా నిలుస్తున్నట్లు ప్రకటిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ టెన్ లోకి అడుగుపెట్టిన సెలబ్రిటీలకు, వారి స్నేహితులు అండగా నిలుస్తూ.. సోషల్ మీడియా వేదికగా తమ మద్దతు పలుకుతున్నారు. అలాంటి వారిలో హైపర్ ఆది(Hyper aadi) కూడా ఒకరు. ముఖ్యంగా ఈయన కొందరికి సపోర్ట్ చేస్తూ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరి హైపర్ ఆది బయట నుండి సపోర్ట్ చేస్తున్న ఆ ముగ్గురు ఎవరు అనే విషయానికి వస్తే.. జబర్దస్త్ లో తమదైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న పొట్టి నరేష్ , రామ్ ప్రసాద్, వర్షిణి లకు మద్దతు పలుకుతూ తన సపోర్టు ప్రకటిస్తూ ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఈ మేరకు ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ కూడా పెట్టారు . మొత్తానికి అయితే ఈ ముగ్గురికి తన మద్దతు పలకడంతో.. వీరికి ఆది అభిమానులు కూడా తోడవడం గ్యారెంటీ అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.
ALSO READ:మెగా ఫోన్ పట్టిన జయం రవి.. స్పందించిన కెనీషా!
హైపర్ ఆది విషయానికి వస్తే.. ఎక్కడో మారుమూల గ్రామం నుండి హైదరాబాదుకి వచ్చి.. తెలుగు వినోద రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు . ప్రతిభకు తోడు కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అని నిరూపిస్తున్నారు ఆది. జబర్దస్త్ లోకి అడుగు పెట్టిన తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ తోపాటు ఇతర షోలలో సందడి చేస్తున్నారు.
అంతేకాదు సినిమాలలో కీలకపాత్రను పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈయన.. జనసేన తో పాటు కూటమి అభ్యర్థుల తరఫున 2024 అసెంబ్లీ ఎన్నికలు సమయంలో విస్తృతంగా ప్రచారం చేశారు. దీనితో ఆదికి జబర్దస్త్ తో పాటు మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలలో కూడా మంచి గుర్తింపు ఉంది. అది ఒక మాట చెబితే వినే వారు కూడా చాలామంది ఉన్నారు. ఈ క్రమంలోనే ఆది తనకున్న క్రేజ్ కారణంగా రాంప్రసాద్, వర్షిణి , పొట్టి నరేష్ లకు బిగ్ బాస్ లో ఎంతవరకు ఓట్లు పడతాయో చూడాలి.
?utm_source=ig_web_copy_link&stkn=MzRlODBiNWFlZA==