E-Paper
Advertisement

Illu illaalu pillalu Narmada : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ నర్మద షాకింగ్ నిర్ణయం.. జీవితంలో ఆ తప్పు చెయ్యను..

Illu illaalu pillalu Narmada : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ నర్మద షాకింగ్ నిర్ణయం.. జీవితంలో ఆ తప్పు చెయ్యను..
Advertisement

Illu illaalu pillalu Narmada: తెలుగు ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ సీరియల్స్లలో స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకటి.. ఒక కుటుంబంలోని తండ్రి తన పిల్లలు తనతోనే ఉండాలి తను చెప్పినట్టే వినాలి అనే స్వార్థంతో ఉంటాడు.. కానీ అలాంటివి తన పిల్లలకు అస్సలు నచ్చవు. తండ్రి కంట్రోల్ చేస్తున్నాడు అని ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎంతగా తాను తన పిల్లల్ని కేర్ తీసుకుంటూ చూసుకున్నా సరే అది మాత్రం వాళ్లకి బరువుగా మారుతుంది.. తన తండ్రి ఏం చెప్తే అది చెయ్యాలా అంటూ అందరూ కూడా అనుకుంటారు. ఒక కొడుకు ఏకంగా తండ్రిని ఎదిరించి ఉద్యోగంలో చేరతాడు.. ఆ కొడుకు భార్య పాత్రలో నటించింది నర్మదా. ఆ ఇంటి పెద్ద రామరాజు రెండవ కోడలు పాత్రలో ఈమె నటించింది. ఈమె అసలు పేరు అన్షు రెడ్డి. గతంలో ఎన్నో సీరియల్స్ తో బాగా ఫేమస్ అయ్యింది. ఇప్పటివరకు ఈమె నటించిన ప్రతి సీరియల్ కూడా ఆమెకు మంచి క్రేజ్ ను సంపాదించి పెట్టాయి.. ఇదిలా ఉండగా నర్మదా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇది మాత్రం సోషల్ మీడియాలో ఊపేస్తుంది. అసలు అదేంటో ఇప్పుడు ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

నర్మద షాకింగ్ నిర్ణయం..? 

‘ఇల్లు ఇల్లు పిల్లలు’ సీరియల్ ప్రస్తుతం టాప్ రేటింగ్ లో కొనసాగుతున్న వాటిల్లో ఒకటి.. ఈ సీరియల్ గురించి ఎంత చెప్పిన తక్కువే.. తండ్రీ కొడుకుల మధ్య బంధం ఎంత గొప్పది అని ఈ సీరియల్లో చూపించారు. ఇందులో రెండవ కొడుకు భార్యగా నర్మద పాత్రలో నటించింది అన్షు రెడ్డి.. ఈమె గతంలో ఎన్నో సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. సీరియల్స్ విషయం పక్కన పెడితే నర్మదకు ఇంకా పెళ్లి కాలేదు అన్న విషయం తెలిసిందే. గతంలో ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి పీటల వరకు తీసుకెళ్లింది. కానీ ఆ వ్యక్తి గురించి ఏం తెలిసిందో ఏమో కానీ క్యాన్సల్ చేసుకుంది. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు ఆమె పెళ్లి గురించి ఎత్తలేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నర్మదా ఇక జీవితంలో పెళ్లి చేసుకొని అని చెప్పినట్లు తెలుస్తుంది. అంటే ఇక ఫ్యూచర్లో ఎప్పటికీ పెళ్లి చేసుకోదా అని సోషల్ మీడియాలో నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. నిజంగానే నర్మదా ఇక పెళ్లి చేసుకో అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది..

Advertisement

Also Read : ఇదేం ట్విస్ట్ మావా.. అవని ఇక కనిపించదా..?

అన్షు రెడ్డి..

తెలుగు ముద్దుగుమ్మ అన్షు రెడ్డి భార్యామణి సీరియల్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత చాలా సీరియల్స్‌లో నటించింది. దాదాపు 15 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతుంది.. గతంలో ఈమె చేసిన ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. సీరియల్స్ ఎంత క్రేజ్ ని తెచ్చి పెట్టాయో సోషల్ మీడియాలో కూడా అంతకుమించి క్రేజ్ ని సంపాదించుకుంది అన్షు.. ఆమెకి సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఉంది అన్న విషయం తెలిసిందే. తన ఫ్రెండ్ తో కలిసి వీడియోలు చేస్తూ అందులో బాగా పాపులారిటీని సంపాదించుకుంది. దాని ఆదాయం లక్షల్లో ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమయ్యే సీరియల్స్లలో ఆమె కనిపిస్తుంది. గతంలో వచ్చిన సీరియల్స్ తో పోలిస్తే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియలు ఆమెకు మంచి క్రేజ్ ను సంపాదించి పెట్టింది. ఇకముందు ఎలాంటి ప్రాజెక్టులతో ప్రేక్షకులు ముందుకు రాబోతుందో చూడాలి.

Related News

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Podarillu Today Episode : మహా మాటతో ఆది షాక్.. చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ నిజం చెప్తాడా..?

Karthika Deepam 2 Serial Today Episode September 2nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీప, కార్తీక్ లను వెనకేసుకొచ్చిన జ్యోత్స్న       

Illu illaalu Pillalu Prema : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. ప్రేమను తొలగించారా?

Illu Illalu Pillalu Today Episodes: నిజం చెప్పిన అమూల్య.. తిరుపతి ఎమోషనల్.. నిజం చెప్పిన వేదవతి..

Big Stories

Advertisement
×