E-Paper
Advertisement

Comedy Movie OTT: మాయదారి మొగుడు… మాయాజాలం చేసే బావమరిది.. ఓటీటీలోకి వచ్చేస్తున్న కొత్త కామెడీ

Comedy Movie OTT: మాయదారి మొగుడు… మాయాజాలం చేసే బావమరిది.. ఓటీటీలోకి వచ్చేస్తున్న కొత్త కామెడీ
Advertisement

Comedy Movie OTT : థియేటర్లలో ఈ ఏడాది సందడి చేసిన ఒక పంజాబీ కామెడీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. సుమారు 1 గంట 56 నిమిషాల నిడివితో సినిమా మొత్తం పక్కా పంజాబీ ఫ్లేవర్ లో సాగుతుంది. స్టోరీ అంతా మన్మీత్ అనే ఒక కుర్రాడి చుట్టూ తిరుగుతుంది. ఫ్యామిలీ అంతా కలిసి సరదాగా చూసేలా ఉంటుంది ఈ సినిమా.

చౌపాల్ (Chaupal) ఓటీటీలో స్ట్రీమింగ్

ఈ పంజాబీ కామెడీ డ్రామా సినిమా పేరు ‘చోరన్ నల్ యారియన్’ (Choran Nal Yarian). నసీబ్ రంధావా, గుర్దియాల్ సింగ్ సిద్ధూ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. పంజాబీ సినిమాల్లో సీనియర్ నటుడైన ఆర్య బబ్బర్ ఈ సినిమాలో హీరోగా నటించారు. హీరోయిన్లుగా ప్రభ్ గ్రెవాల్, మన్రీత్ స్రాన్ సందడి చేశారు. వీళ్లతో పాటు సీనియర్ ఆర్టిస్టులు మల్కీత్ రౌనీ, గుర్ ప్రీత్ భాంగు తమ నటనతో సినిమాకు వెయిట్ పెంచారు. 2025 జనవరి 17న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా చౌపాల్ (Chaupal) ఓటీటీలో మార్చి 21నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలోని పాటలు చాలా క్యాచీగా ఉంటాయి. ‘డైమండ్ ఫింగర్’, ‘జైలాన్’ వంటి సాంగ్స్ యూట్యూబ్‌లో మంచి వ్యూస్ సాధించాయి కూడా.

స్టోరీ ఏమిటంటే

Advertisement

సినిమా అంతా మన్మీత్ అనే ఒక కుర్రాడి చుట్టూ తిరుగుతుంది. వీడు పనీపాటా లేకుండా జులాయిగా తిరిగే రకం కాదు కానీ, కాస్త అల్లరి ఎక్కువ. తన అక్క రాణి వాళ్ళ ఇంట్లోనే ఉంటూ, బావతో అప్పుడప్పుడు గొడవలు పడుతూ కాలం వెళ్లదీస్తుంటాడు. ఇంట్లో వాళ్లకి వీడంటే ఇష్టమే కానీ, వీడి అల్లరి పనులు చూసి అప్పుడప్పుడు తల పట్టుకుంటారు. వాళ్ళందరినీ మేనేజ్ చేస్తూ, తనదైన స్టైల్లో లైఫ్ ఎంజాయ్ చేయడం మన్మీత్ కి అలవాటు. కథలో అసలు మలుపు ఎప్పుడు వస్తుందంటే.. మనోడు తన మేనల్లుడి స్కూల్ టీచర్ మెహక్ (ప్రబ్జోత్ గ్రేవాల్)తో ప్రేమలో పడతాడు. అక్కడి నుంచి వీడి కష్టాలు మొదలవుతాయి.

ఇంతలోనే తన బావ బిక్రమ్ (మల్కీత్ రౌనీ), అతని సెక్రటరీ హీనాతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానం మన్మీత్‌కు కలుగుతుంది. తన సోదరి సంసారాన్ని కాపాడాలనే ఉద్దేశంతో, మన్మీత్ తన బావపై నిఘా పెడతాడు. ఈ క్రమంలో అతను చేసే ప్రయత్నాలు గందరగోళ పరిస్థితులకు దారితీస్తాయి. ఓ పక్క అక్క కాపురం ? మరో వైపు తన ప్రేమను ఎలా చక్కదిద్దాడన్నదే ఈ కథ.

Advertisement

Read Also : 30 సంవత్సరాల తరువాత ఓటీటీలోకి హాలీవుడ్ హిట్ మూవీ సీక్వెల్‌… ఫ్యామిలీ ఎమోషన్స్ తో

 

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×