E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: అయ్యో.. రైమ్ చెప్పి దొరికిపోయిందే.. పార్క్ లో విశ్వం, అమూల్య.. ఒక్క లెటర్ వల్ల ఎపిసోడ్ మొత్తం నవ్వులే..

Illu Illalu Pillalu Today Episode: అయ్యో.. రైమ్ చెప్పి దొరికిపోయిందే.. పార్క్ లో విశ్వం, అమూల్య.. ఒక్క లెటర్ వల్ల ఎపిసోడ్ మొత్తం నవ్వులే..
Advertisement

Illu Illalu Pillalu Today Episode December 10th: నిన్నటి ఎపిసోడ్ లో.. భోజనానికి ఇంటికి వచ్చిన రామరాజుకు ఒక ఫోన్ వస్తుంది.. అతను ఇంగ్లీషులో మాట్లాడటంతో నాకు తెలుగు తప్ప ఏది రాదు అని రామరాజు అంటాడు.. అక్కడే ఉన్న శ్రీవల్లిని చూసిన రామరాజు అమ్మ శ్రీవల్లి ఇటు రా.. మా కోడలు ఎం ఏ ఇంగ్లీషు బాగా మాట్లాడుతుంది ఒక నిమిషం లైన్లో ఉండండి ఇస్తాను అని అంటాడు.. ఆ మాట వినగానే శ్రీవల్లి ఓరి నాయనో అడ్డంగా దొరికిపోయిన సత్య దేవుడా అని అనుకుంటుంది.. మా కోడలు బాగా మాట్లాడుతుంది ఆమెకి ఇస్తాను ఒకసారి మాట్లాడండి అని రామరాజు అంటాడు.. శ్రీవల్లి బాబోయ్ అడ్డంగా ఇరుక్కున్నానే అంటూ అక్కడికి వెళ్లి అతనితో ఫోన్ మాట్లాడుతుంది. ఎంతసేపు మాట్లాడినా ఎస్ యా యా అంటూ మాట్లాడడంతో తిరుపతికి అనుమానం వస్తుంది.. ఏంటి బావ ఎం ఏ ఇంగ్లీష్ అన్నావ్ గడగడ మాట్లాడాలి కదా ఈ అమ్మాయి ఏంటి అని యరలవా అని చదువుతుంది తప్ప కొత్తగా ఏమీ మాట్లాడలేదు.. అందరిని అనుమానం వస్తుంది. ఎలాగైనా శ్రీవల్లి చదువును బయటపెట్టించాలని ప్రేమ, నర్మద అనుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. శ్రీవల్లి తలుపు తీయగానే ఎదురుగా నర్మదాప్రేమ కనిపిస్తారు.. పొద్దున్నే లేవగానే వీళ్లకు చిక్కని ఏంట్రా బాబు అనుకుంటుంది శ్రీవల్లి.. ప్రేమ నర్మదా ఇద్దరు కూడా తిరుపతి బాబాయ్ కి నీ ఇంగ్లీష్ మీద డౌట్ ఉందంట అక్క అందుకే రాత్రంతా నిద్రపోకుండా ఆలోచించాడు. నువ్వు గడగడ ఒకసారి ఇంగ్లీష్ లో మాట్లాడు అని అంటుంది.. శ్రీవల్లి నేను మాట్లాడుతాను ఆగండి అని జానీ జానీ ఎస్ పాపా పాడుతుంది.. ఇదేంటి ఇంగ్లీషులో మాట్లాడమంటే చిన్న పిల్లల రైమ్స్ చెప్తుంది అని వాళ్ళందరూ కూడా అనుకుంటారు…

Advertisement

తర్వాత రోజు ఉదయం విశ్వం తియ్యగా నాలుగు తేనె పూసిన కత్తిలాంటి మాటలు మాట్లాడి అమూల్యతో ఈరోజు ఎలాగైనా సరే పెళ్లికొప్పించాలి అని విశ్వం అనుకుంటాడు. అమూల్యతో మాట్లాడ్డానికి పిలుస్తాడు కానీ అమూల్యకు అర్థం కాకపోవడంతో ఒక లెటర్ రాసి సాయంత్రం నాలుగు గంటలకు పార్కులో కలుద్దామని అంటాడు. లెటర్ చూసినా అమూల్య అలాగే కలుద్దామని అంటుంది.. ఇంట్లో నుంచి నర్మదా పిలవడంతో అమూల్య లెటర్ ని పడేస్తుంది. ఇది చూసిన చందు వల్లి నాకోసం లెటర్ రాసినట్టు ఉంది అని మళ్లీ చందు వల్లి క్యా లెటర్ ని పంపిస్తాడు. వల్లి మా ఆయన ఇంట్లో నాతో మాట్లాడటం కుదరలేదని పార్కు తీసుకెళుతున్నట్టు ఉన్నాడు. మా ఆయనను ఇంత మార్పు ఏంటో అని చాలా సంతోషంగా ఉంటుంది.

సంతోషంలో ఆ పేపర్ ని విసిరేస్తుంది. అది కాస్త ప్రేమ తీసుకెళ్తున్న పూల ప్లేట్లో పడిపోతుంది.. ధీరజ్ మధ్యలో గుద్దుకోవడంతో ఆ పూలన్నీ కింద పడిపోతాయి.. దాన్ని తీసి అన్ని ప్లేట్లో పెడుతుండగా ఆ లెటర్ ని చూసిన ప్రేమ సిగ్గుపడి నాకు కుదరదు రా అని అంటుంది.. ఏం కుదరదు దీనికి లూజ్ అనుకున్నాను స్క్రూ లూజ్ బాగానే ఉందే అని అనుకుంటాడు.. మొదటిసారి వెళ్దామని అడిగావు కదా పార్కుకి వెళ్దాం అనేసి అంటుంది ప్రేమ. ఆ లెటర్ని ధీరజ్ చూసి సాయంత్రం పార్కుకి తీసుకెళ్ళమని అడగొచ్చు కదా ఇవన్నీ ఎందుకు అని లెటర్ ని పక్కన పడేస్తాడు.

Advertisement

అది కాస్త నర్మదా దగ్గర పడిపోతుంది.. నర్మదా మా ఆయనకు ఇన్ని మంచి బుద్ధులు ఎప్పటినుంచి వచ్చాయో భార్యని బయటకు తీసుకెళ్లాలని పార్కుకి రమ్మని చెప్తున్నాడు అని అనుకుంటుంది.. ఆ లెటర్ కాస్త వెళ్లి మళ్లీ సాగర్ చేతిలో పడుతుంది. నర్మదా నన్ను చాలా మిస్ అవుతున్నట్లు ఉంది పార్కుకి వెళ్దామని ఇలా చెప్తుంది అన్నమాట అని సాగర్ అనుకుంటాడు. ఆ లెటర్ కాస్త సాగర్ వెళ్తూ వెళ్తూ తిరుపతి చేతిలో పడేలా చేస్తాడు.. గర్ల్ ఫ్రెండ్ కోసం దేవుని ప్రార్థిస్తున్న తిరుపతి చేతిలో ఆ లెటర్ పడుతుంది.

అది చూసినా తిరుపతి నాకోసం సౌందర్య లహరి ఎదురుచూస్తున్నట్లు ఉంది ఇవాళ కచ్చితంగా నేను పార్కుకి వెళ్లి ఆమె ఎవరో తెలుసుకోవాలి అని అనుకుంటాడు.. వీళ్ళందరూ కలిసి ఆ ఒక్క లెటర్ తో పార్కుకి వెళ్తారు. ముందుగా అమూల్య పార్కుకి వెళ్తారు కానీ అక్కడ అమూల్య భయపడుతూ స్కార్ఫ్ ని కట్టుకుంటుంది.. నువ్వు ఇలా భయపడుతూ ఉండొద్దు మనం ఏదో ఒకటి ఆలోచించాలి అంతేకానీ నీకేం కాదు ఏం కాకుండా నేను చూసుకుంటాను అని విశ్వం అంటాడు.. ఆ తర్వాత శ్రీవల్లి చందు ఇద్దరు కూడా పార్కు కొస్తారు.

Also Read :‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సాగర్ రియల్ లైఫ్ లో అన్నీ కష్టాలే.. కన్నీళ్లు ఆగవు..!

ఇలా పార్కు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది శ్రీవల్లి.. ఆ తర్వాత సాగర్ నర్మదా పార్కుకొస్తారు. వాళ్ళిద్దరూ పార్క్ లో సరదాగా సరసాలు ఆడతారు. వీరిద్దరు వచ్చిన తర్వాత ప్రేమ ధీరజ్ కూడా పార్కు కొస్తారు.. పార్క్ మేటర్ గురించి అక్కడ కూడా గొడవ పడతారు. అలాగే తిరుపతి కూడా నా సౌందర్యలహరి ఎక్కడ ఎక్కడ అంటూ పార్కులో తెగ హడావిడి చేస్తాడు.. విశ్వం ఇలా నువ్వు కట్టుకొని ఉంటే నాకు ఎలా మాట్లాడాలి అనిపిస్తుంది నీతో మాట్లాడకుండా చూడకుండా ఉండలేకపోతున్నానని అంటాడు.. ముఖానికి ఉన్న చున్నీని అమూల్య తీసేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్లో అమూల్య విశ్వం ఈ మూడు జంటలకి దొరికిపోతారా? శ్రీవల్లిని అమూల్య ఇరికిస్తుందా? చూడాలి..

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×