E-Paper
Advertisement

Illu Illaalu Pillalu Sagar : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సాగర్ రియల్ లైఫ్ లో అన్నీ కష్టాలే.. కన్నీళ్లు ఆగవు..!

Illu Illaalu Pillalu Sagar : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సాగర్ రియల్ లైఫ్ లో అన్నీ కష్టాలే.. కన్నీళ్లు ఆగవు..!
Advertisement

Illu Illaalu Pillalu Sagar : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకటి.. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ఈ సీరియల్ ప్రసారమవుతుంది. స్టార్ మా లో టాప్ రేటింగ్ లో దూసుకుపోతున్న సీరియల్స్లలో రెండవ స్థానంలో ఇదే ఉంటుంది.. ఇటీవలే ప్రారంభమైన ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఒక కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని ఎంతో చక్కగా చూపించారు. తండ్రి బాధను కొడుకులు అర్థం చేసుకోవడం? కొడుకులకు ఎటువంటి కష్టాలు రాకుండా తండ్రి చూసుకోవడం? ఇంటికొచ్చిన కోడళ్లను కూతురు లాగా చూసుకునే మావయ్య ఉండడం.. ఇవన్నీ ఈ సీరియల్లో కనిపిస్తాయి. ప్రేక్షకులు ఈ సీరియల్ స్టోరీ కి ఫిదా అవుతున్నారు. ఇందులో సెటైర్లు వేస్తూ కామెడీని పండించే పాత్రలో సాగర్ కనిపిస్తాడు. అతని అసలు పేరు రఫీక్ష.. ఈయన రియల్ లైఫ్ లో ఎన్నో కష్టాలను అనుభవించినట్లు ఓ ఇంటర్వ్యూ లో బయటపెట్టాడు. అతని రియల్ లైఫ్? ప్రస్తుతం ఒక్కో సీరియల్ కు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసుకుందాం..

సాగర్ రియల్ లైఫ్ లో కన్నీళ్లు..

స్టార్ మా లో సక్సెస్ఫుల్గా ప్రసారమవుతున్న సీరియల్స్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకటి.. ఇందులో సాగర్ పాత్రలో రఫిక్ష నటిస్తున్నారు.. ఈయన చిన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పాడు.. అప్పటిలో పేరెంట్స్ పడ్డ కష్టాల గురించి ఓ ఇంటర్వ్యూ లో పంచుకోవడంతో పాటుగా ఎమోషనల్ అయ్యాడు.. ఇప్పుడు తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నట్లు చెప్పాడు. ఈయనకు ఆల్రెడీ పెళ్లయింది. ఒక బేబీ కూడా ఉన్నారు. చిన్నప్పుడు బాగా చదివినా కూడా ఆ తర్వాత నటనపై ఆసక్తితో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చినట్లు చెప్పారు.. ఎన్నో ఆడిషన్స్ కి వెళ్ళిన తర్వాత సీరియల్స్ కి సెలెక్ట్ అయినట్లు ఆయన అన్నారు. ప్రస్తుతం వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు.

Advertisement

Also Read : ‘గుండెనిండా గుడిగంటలు’ రవి రియల్ లైఫ్.. రెమ్యూనరేషన్..?

‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సాగర్ రెమ్యూనరేషన్..? 

బుల్లితెర నటుడు సాగర్ అలియాస్ రఫీక్ష గతంలో ఎన్నో సీరియల్స్ లలో నటించాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, సాధన, ఊహలు గుసగుసలాడేనే, సూర్య కాంతం వంటి సూపర్ హిట్ సీరియల్స్ లో నటించాడు. ఆ సీరియస్ లో తన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో నటించే అవకాశాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం స్టార్ మా చానల్లో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఈ సీరియల్ లో సాగర్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. కాస్త రొమాంటిక్గా మరి కాస్త కామెడీగా అతని క్యారెక్టర్ ఉండడంతో ప్రేక్షకులు బాగా ఆదరించారు.. ప్రస్తుతం ఈయన రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. రఫీక్ష ఒక్కరోజుకు దాదాపుగా 20 వేలు తీసుకుంటున్నాడని టాక్.. నెలలో 25 రోజులు సీరియల్ షూటింగ్ ఉండటంతో లక్షల్లో సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో నటిస్తున్నాడు. అలాగే కొన్ని సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చినట్లు తెలుస్తుంది. ఈయన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తన ఫ్యామిలీ ఫోటోలతో పాటుగా సీరియల్స్ లో ఫోటోలను కూడా షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×