E-Paper
Advertisement

OTT Movie : ఓటీటీలో భయపెట్టబోతున్న పారానార్మల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

OTT Movie : ఓటీటీలో భయపెట్టబోతున్న పారానార్మల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?
Advertisement

OTT Movie : భారతదేశపు మొట్టమొదటి పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ గౌరవ్ తివారీ జీవితం, అతని మిస్టరీ డెత్ ఆధారంగా ఓ థ్రిల్లర్ సిరీస్ రూపొందింది. ఈ థ్రిల్లర్ సిరీస్ మరి కొద్ది గంటల్లోనే ఓటీటీలోకి అడుగు పెట్టబోతోంది. గౌరవ్ మరణం చుట్టూ ఉన్న వివాదాలతో ఈ సిరీస్ ఉత్కంఠంగా ముందుకు వెళ్తుంది. అతని జీవితంలో అతని పారానార్మల్ ప్రయాణం, మరణం మధ్య ఉన్న సీక్రెట్స్ ని ఇది విశ్లేసిస్తుంది. థ్రిల్లర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సిరీస్ ఇది. ట్రైలర్ లోనే ఈ సిరీస్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఇక మొత్తం సిరీస్ చూస్తే అంతే సంగతులు. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలోకి వస్తుంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ సూపర్ నేచురల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘భయ్’ (Bhay). దీనికి రాబీ గ్రెవాల్ దర్శకత్వం వహించారు. ఇందులో కరణ్ టాకర్, కల్కి కోచ్లిన్, డానిష్ సూద్, సలోని బాత్రా లీడ్ రోల్స్ లో నటించారు. ఇది 2025 డిసెంబర్ 12 నుంచి Amazon MX Playerలో ప్రసారం అవుతుంది. తెలుగులో కూడా అందుబాటులోకి వస్తోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

గౌరవ్ తివారీ తన పైలట్ వృత్తిని వదులుకుని, దెయ్యాలు, ఆత్మల ఉనికిని శాస్త్రీయంగా పరిశోధించే పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ అవతారం ఎత్తుతాడు. అతని జీవితంలో ఎదురైన భయంకరమైన కేసులను ఈ సిరీస్ వివరిస్తుంది. అతని వింత నిర్ణయాల కారణంగా కుటుంబ సభ్యులు పడిన ఆందోళనలు, అతనికి ఎదురైన ప్రమాదకరమైన పరిస్థితులను సిరీస్ మొదటి భాగంలో చూపించడం జరిగింది. ఈ కథలోకి ఐరీన్ వెంకట్ అనే జర్నలిస్ట్ ఎంట్రీ ఇస్తుంది. ఐరీన్ మొదట్లో గౌరవ్ చేసే పరిశోధనలను మూఢనమ్మకాలుగా కొట్టిపారేస్తుంది. కానీ 2016లో కేవలం 32 ఏళ్ల వయసులో గౌరవ్ తన ఇంట్లోనే మర్మమైన పరిస్థితులలో చనిపోతాడు. అతని మరణం ఆత్మహత్యగా అందరూ నిర్ధారిస్తారు.

Read Also :  వేశ్య వెంట పడే బిజినెస్‌మ్యాన్… రాత్రికి మాత్రమే ఛాన్స్ అంటూ… సింగిల్స్ కు పండగే

అయితే  అతని మరణానికి, అతను పరిశోధించిన కేసులకు ఏమైనా సంబంధం ఉందా అనే అనుమానాలు కలుగుతాయి. ఈ మిస్టరీ మరణం ఐరీన్‌ను కదిలిస్తుంది. ఆమె గౌరవ్ డెత్ వెనుక ఉన్న నిజాలను వెలికితీసే పనిలో పడుతుంది. ఆమె గౌరవ్ డైరీలు, రికార్డింగ్‌లు పరిశీలిస్తుంది. చివరికి ఆమె గౌరవ్ మరణం వెనుక అసలు సీక్రెట్స్ కనిపెడుతుందా ? గౌరవ్ ఎలా చనిపోయాడు ? ఈ సిరీస్ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలు తెలియాలంటే, ఈ థ్రిల్లర్ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.
Advertisement

 

 

 

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×