E-Paper
Advertisement

Minister Lokesh In US: అమెరికాలో బిజీగా మంత్రి నారాలోకేష్.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌తో భేటీ

Minister Lokesh In US:  అమెరికాలో బిజీగా మంత్రి నారాలోకేష్..  గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌తో భేటీ
Advertisement

Minister Lokesh In US: ఏపీకి పెట్టుబడులు రప్పించే లక్ష్యంతో అమెరికాలో పర్యటిస్తున్నారు మంత్రి నారా లోకేష్. వివిధ కంపెనీల సీఈఓలతో భేటీ అవుతున్నారు. తాజాగా శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో ఆయన భేటీ అయ్యారు. వివిధ అంశాలపై ఇరువురు చర్చించారు. అలాగే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ పనులపై చర్చించారు కూడా.

అమెరికాలో బిజీగా మంత్రి లోకేష్

Advertisement

అమెరికాలో బిజీబిజీగా ఉన్నారు మంత్రి లోకేష్. కేవలం ఐటీ కంపెనీలే కాకుండా ఫార్మా, వివిధ సంస్థల కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతున్నారు. తాజాగా శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్‌తో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఆయనతోపాటు గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్, వైస్ ప్రెసిడెంట్ బికాష్ కోలే ఈ భేటీలో పాల్గొన్నారు.

Advertisement

విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టినందుకు గూగుల్ ఉన్నతస్థాయి బృందానికి మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. విశాఖలో AI డేటా సెంటర్ ప్రాజెక్ట్ పనులు ఎప్పుడు ప్రారంభించాలనే దానిపై వీరి మధ్య చర్చ జరిగింది. ఆ సంస్థకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం భూములు కేటాయించింది. ఎప్పటి నుంచి అమలు చేయాలని అనేదానిపైనా చర్చించారు.

గూగుల్ సీఈఓ, అడోబ్ సీఈవో లోకేష్ సమావేశాలు

విస్ట్రాన్ న్యూ వెబ్ కార్పోరేషన్ ద్వారా డేటా సెంటర్సర్వర్ తయారీ ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా వారిని మంత్రి కోరారు. ఏపీలో డ్రోన్ సిటీ ప్రాజెక్టులో డ్రోన్ అసెంబ్లీ, కేలిబ్రేషన్, టెస్టింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.

భారత్‌లో క్లౌడ్ రీజియన్‌ల విస్తరణ, గూగుల్ ఫర్ స్టార్టప్స్ యాక్సిలరేటర్ ద్వారా స్టార్టప్‌లకు మద్దతు ఇస్తున్నట్లు ఈ సందర్భంగా సీఈవో సుందర్ పిచాయ్ వివరించారు. అమెరికా వెలుపల ఏర్పాటు చేస్తున్న గూగుల్ AI డేటా సెంటర్ అతిపెద్ద ఎఫ్‌డీఐగా పేర్కొన్నారు.

చెన్నైలో ఫాక్స్‌కాన్‌ సంస్థతో కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ ద్వారా గూగుల్ డ్రోన్లు వింగ్స్ తయారవుతున్నాయని వివరించారు. తమ కంపెనీ ఉత్పత్తులను ప్రతి నెలా 500 మిలియన్లకు పైగా ఇంటర్నెట్ యూజర్స్ ఉపయోగిస్తున్నారని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదనలపై సంస్థలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

అంతకు ముందు అడోబ్ సీఈవో శంతన్ నారాయణన్‌తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. విశాఖలో అడోబ్ జీసీసీ (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్) లేదా డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. అమెరికా టెక్ సంస్థలు ఇంటెల్, ఏఎండీ, అప్లైడ్ మెటీరియల్స్ వంటి వాటితో అనుసంధానించి ఫ్యాబ్‌లెస్ డిజైన్, పరిశోధన, తయారీ కేంద్రాల అభివృద్ధిని ప్రోత్సహించేలా చొరవ చూపాలని వివరించారు.

ALSO READ: బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. అసలు ప్రమాదం ఎలా జరిగింది?

నారాయణన్ డైరెక్టర్‌గా ఉన్న ఫైజర్ సంస్థ.. ఏపీలో ఔషధ పరిశ్రమ జోన్లలో (విశాఖపట్నం ఏఎంటీజడ్) వ్యాక్సిన్లు, చిన్న మాలిక్యూల్స్ లేదా బయోలాజిక్స్ తయారీ ప్లాంట్‌ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచన చేశారు. ఆంధ్రప్రదేశ్ పరిశోధనా సంస్థలతో కలిసి క్లినికల్ ట్రయల్స్, వ్యాధి వ్యాప్తి అధ్యయనాలు, డిజిటల్ హెల్త్ పైలట్ ప్రాజెక్టులలో భాగస్వామ్యం వహించేలా ప్రోత్సహించాలని తెలిపారు.

ఫార్మా జోన్లు, AMTZ-ఆంధ్రా మెడ్ టెక్ జోన్ సామర్థ్యాలను వినియోగించుకునేలా చొరవ చూపాలని, మీరు డైరెక్టర్‌గా ఉన్న మరో సంస్థ కెకెఆర్ ప్రధానంగా ఆరోగ్యం, ఔషధ పరిశోధన, బయో-ఫార్మాస్యూటికల్స్, ఎనర్జీ పైప్ లైన్లు మొదలైన రంగాల్లో ఉందన్నారు. కేకేఆర్ సంస్థ ఏపీలోని ఆరోగ్య రంగంలో పెట్టుబడులు పెట్టేలా సహకారం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అడోబ్ సీఈవో శంతను నారాయణన్ అన్నారు.

 

 

 

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×