E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: నర్మదను ఇరికించిన శ్రీవల్లి..పెళ్లి చేసుకోబోతున్న విశ్వ.. ప్రేమ కాపురంలో చిచ్చు…

Illu Illalu Pillalu Today Episode: నర్మదను ఇరికించిన శ్రీవల్లి..పెళ్లి చేసుకోబోతున్న విశ్వ.. ప్రేమ కాపురంలో చిచ్చు…

Illu Illalu Pillalu Today Episode December 19th: నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీవల్లిని ఏంఏ సర్టిఫికెట్ ఎక్కడ అని అడుగుతుంది ప్రేమ.. ఆ సర్టిఫికెట్ రావడానికి కాస్త టైం పడుతున్నట్టు ఉంది అందుకే ఇంకా రాలేదు అని శ్రీవల్లి అంటుంది. ఇంతకీ సర్టిఫికెట్ రావడానికి ఎక్కువ సమయం పట్టదు కదా నువ్వు ఎం ఏ చదివావా లేదా అని అడుగుతారు.. అదే మాట ఎంఏ బీభత్సంగా చదివేస్తేను అని శ్రీవల్లి అంటుంది.. అవునమ్మా మరి నీ ఎం ఏ సర్టిఫికెట్ ఏది అని రామరాజు అడుగుతాడు.. వాళ్లు చెప్పినట్లు నాకు కూడా అనుమానం వస్తుంది.. ఓ నిజంగానే ఎంఏ చదివావా లేదా? మరి సర్టిఫికెట్ ఎక్కడ అని రామరాజు అడుగుతాడు. ఇంగ్లీష్ లో మాట్లాడమంటే యా యా అనడం తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు.. భాగ్యం వచ్చి సర్టిఫికెట్లు ఇవిగోండి అన్నయ్యగారు అని చేతికిస్తుంది. ఆ సర్టిఫికెట్ల గురించి తెలుసుకోమని ప్రేమకు చెప్తాడు రామరాజు.

అయితే అవి చూసిన ప్రేమ మీకు ఒక ప్రిన్సిపల్ గారు తెలుసు కదా మామయ్య గారు అని అంటుంది. రామరాజు అవును అమ్మ నువ్వు చెప్పింది నిజమే. నేను వెంటనే ఫోన్ చేసి అతన్ని కనుక్కుంటాను అని అంటాడు. ఆ మాట వినగానే శ్రీవల్లి తుమ్ముతుంది. అయ్యో తుమ్ము మంచిది కాదు మావయ్య గారు అని అంటుంది. భాగ్యం కూడా కూతురు ఏదంటే అది అంటుంది. కానీ నర్మద మాత్రం ఇది చాలా మంచి సమయం అని రామరాజు ని ఫోన్ చేయమని చెప్తుంది. అతనికి జాబ్ వచ్చినట్లు రామరాజు చెప్పగానే వల్లి అడ్డంగా ఇరుక్కుపోయినురోయ్ దేవుడు అని అనుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే..సాగర్ తో చిన్న మాటంటేనే నువ్వు ఇంత బాధ పడిపోతున్నావు నర్మద మనసులో మా బాధ గురించి తెలిస్తే నువ్వు ఎంత బాధ పడిపోతావు అని అంటుంది. నర్మదా మనసులో బాధ ఏంటి వదిన అని అడుగుతాడు సాగర్.. వద్దులేండి మరిది గారు భార్య భర్తల మధ్య మనస్పర్ధలు వచ్చేలా చేయడం నా ఉద్దేశం కాదు.. మరిది గారు అని కావాలని పుల్లలు పెట్టేస్తుంది శ్రీవల్లి. ఏం లేదు మరిది గారు తన భర్త రైస్ మిల్లులో మూటలు మోసే పని చేస్తున్నాడని పాపం నర్మద కూడా చాలా బాధపడిపోతుంది అని అంటుంది శ్రీవల్లి. నర్మదా అలాంటిది కాదు అసలు ఫీల్ అవ్వదు అని సాగర్ చెప్తాడు. నా భర్త మూటలు మోస్తున్నాడు అని చెప్పుకోడానికి నర్మద కూడా బాధపడుతుంది.ఏ రోజున మీరు నర్మద మనసులోని బాధని అర్థం చేసుకున్నారా అని శ్రీవల్లి అడుగుతుంది.. సాగర్ ఆలోచిస్తూ ఉంటాడు.

ఆ తర్వాత శ్రీవల్లి నాకు కొంపలోని నిప్పులు పుట్టించారు కదా ఇప్పుడు నర్మద కాపురంలో చిచ్చు పెట్టేసాను అది కాస్త రాసుకుంది.. ఇంక ఏం జరుగుతుందో చూడాలి.. లేకుంటే ఈ శ్రీ వల్లిని దెబ్బ కొట్టాలని చూస్తావా నీకు ఎంత ధైర్యం అని శ్రీవల్లి సంతోష్ పడిపోతూ ఉంటుంది.. చందు అమూల్యను తీసుకొని కాలేజీకి వెళుతూ ఉంటాడు. అక్కడ అమూల్య కోసం వెయిట్ చేస్తున్న విశ్వం చందు బైక్ మీద అమూల్యను చూసి షాక్ అవుతాడు. ఈ చందు కి అనుమానం వచ్చినట్లుంది. అందుకే ఎప్పుడూ లేనిది అమూల్యను తన బండి మీద ఏ కాలేజీకి డ్రాప్ చేస్తున్నాడు అని అనుకుంటాడు..

అమూల్యనీ కాలేజీలో డ్రాప్ చేసిన తర్వాత చందు నువ్వు ప్రేమకి మా లాంటివి ఏమైనా ఉంటే ఇప్పుడే దాన్ని తుడిచేయి అని సలహా ఇస్తాడు. కొన్ని విషయాలకు ఎంత దూరంగా ఉంటే కుటుంబాలకు అంత మంచిది అని చందు చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన విశ్వం ఏంటి ఎప్పుడు లెండి మీ అన్నయ్యతో కాలేజీకి వచ్చావు అని అంటాడు. మా అన్నయ్యకి మన మీద అనుమానం వచ్చింది అందుకే కాలేజ్ దగ్గరికి వచ్చి డ్రాప్ చేసి వెళ్ళాడు అని అంటుంది. అంతేకాదు ప్రేమ గీమా లాంటివి ఏమైనా ఉంటే పక్కన పెట్టేసేయ్ అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు.. ఇక తర్వాత విశ్వం మనమిద్దరం ఈ విషయం గురించి ఆలోచిద్దాం నువ్వు ముందు కాలేజీకి వెళ్లి రా అని అంటాడు.

ఏంటి ఈ చందు గాడికి మా మీద అనుమానం ఏమైనా వచ్చిందేమో అని అనుకుంటాడు. అయితే వీడికి అనుమానం పోయేలా ఏదో ఒకటి చేయాలి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని శ్రీవల్లికి ఫోన్ చేస్తాడు.. ఏంటి మీ ఆయన అమూల్యను కాలేజీకి తీసుకొని వచ్చాడు ఎప్పుడు లేంది ఇలా చేశాడేంటి అని అడుగుతాడు.. ఒరేయ్ బండ సచ్చినోడా అనుమానం కాదు మిమ్మల్నిద్దర్నీ చూసేసాడు అందుకే ఈ విషయాన్ని ఇంట్లో చెప్పకుండా ఆపేందుకు నేను నానా తంతాలు పడుతున్నాను అని శ్రీవల్లి అంటుంది. ఇవన్నీ వెళ్లిపోవాలంటే కచ్చితంగా మేమిద్దరం పెళ్లి చేసుకోవాలి ఇక ఆలస్యం చేస్తే మీ ఆయన ఇంట్లో చెప్పేస్తాడు అని అంటాడు విశ్వం.

ఆ మాట వినగానే శ్రీవల్లి షాక్ అయిపోతుంది. ఏంటి మీ ఇద్దరూ లేచిపోయి పెళ్లి చేసుకుంటారా ఈ విషయం గనుక ఇంట్లో తెలిస్తే నాకు సమాధి కట్టేస్తారు.. కొంచమైనా మీకు బుద్ధుందా అని అంటుంది శ్రీవల్లి.. ఇలాంటి ప్లాన్ లన్నీ చేయకురా బాబు ఇప్పటికే నేను టెన్షన్ లతో చచ్చిపోతున్నాను ఇప్పుడు నువ్వు ఇలాంటి బాంబులు పేలిస్తే ఖచ్చితంగా నేను చచ్చిపోతాను అని వార్నింగ్ ఇస్తుంది శ్రీవల్లి. కానీ విశ్వం మాత్రం నేను కచ్చితంగా చెప్తాను అని అంటాడు.. మేమిద్దరం పెళ్లి చేసుకొని ఆ తర్వాత రామరాజు ఇంట్లో చెప్తాము అని అనగానే శ్రీవల్లి భయంతో వనికి పోతూ ఉంటుంది.

Also Read : పల్లవికి షాకిచ్చిన కమల్..రాజేంద్ర ప్రసాద్ షాకింగ్ నిర్ణయం.. పల్లెకు వెళ్తున్న కుటుంబం..

ఇక రాత్రి సేనాపతి ఇంటికి రాలేదని రేవతి ఇంటి ముందర నిలబడుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది. అది చూసిన ప్రేమ ఏమైంది అమ్మ నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అడుగుతుంది. మీ నాన్న ఈమధ్య ఇంటికి రాలేదమ్మా అని అనగానే.. ఎక్కడికి వెళ్లడం మా నాన్న అని అంటాడు.. ఏమోనే ఈ మధ్య తాగేసి ఇంటికి వస్తున్నాడు కానీ ఆలస్యంగా వస్తున్నాడు. ఇవాళ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది ఎక్కడికి వెళ్ళాడు అని నాకు టెన్షన్ గా ఉంది.. ప్రేమ వాళ్ళ నాన్నని వెతుక్కుంటూ వెళ్లి ఇంటికి తీసుకుని తిరిగి వస్తుంది. శ్రీవల్లి అది చూసి ధీరజ్ కి చెప్తుంది. చూసావా ఇది మళ్ళీ మావయ్య గారికి మీదికి ఏ గొడవను తీసుకొని వస్తుందో తెలియట్లేదు అని కాపురంలో చిచ్చు పెడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ ఏం జరుగుతుందో చూడాలి.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

ఇన్నాళ్లకు నిజాన్ని బయటపెట్టిన హమీద.. బొట్టు పెట్టుకోవడానికి కారణం ఇదే..?

Nindu Noorella Saavasam Serial Today Episode June 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రణవీర్‌ను బెదిరించిన బుజ్జమ్మ

Intinti Ramayanam Today Episode: అవని పై పల్లవి రివేంజ్.. అవనిపై పోలీస్ కంప్లైంట్.. మీనాక్షి అరెస్ట్..?

Podarillu Today Episode : చక్రీని కొట్టిన ఆది..చక్రీ కోసం వెతుకుతున్న అన్నదమ్ములు.. మహాకు మళ్ళీ పెళ్లి..

Karthika Deepam 2 Serial Today Episode June 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీప వేసిన డ్రాయింగ్ చూసి భయంతో వణికిపోయిన పారిజాతం  

వైజాగ్‌లో ‘ఢి’ షో పండు మాస్టర్‌కు కారుకు ప్రమాదం.. కాళ్లు విరిగి, హాస్పిటల్‌లో..

Gundeninda GudiGantalu Today episode: మీనాకు షాకివ్వబోతున్న చింతామణి.. మీనాకు అడ్డంగా దొరికిపోయిన రోహిణి.. చివరిలో ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode June 3rd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖకు షాక్ ఇచ్చిన రాజు  

Big Stories

×