E-Paper
Advertisement

Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో మళ్లీ.. భారత్ హైకమిషన్ ఆఫీసు ముట్టడి, పత్రికా ఆఫీసులపై దాడులు

Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో మళ్లీ..  భారత్ హైకమిషన్ ఆఫీసు ముట్టడి, పత్రికా ఆఫీసులపై దాడులు
Advertisement

Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో మళ్లీ ఆందోళనలు ఊపందుకున్నాయా? అల్లరి మూకలు ఈసారి భారతీయులను టార్గెట్ చేశాయా? భారత్ హైకమిషనర్ ఆఫీసుని ఎందుకు ముట్టడించారు? దీని వెనుక ఎవరి ప్రమేయం ఉంది. ఇదే చర్చలో ఇటు బంగ్లాదేశ్.. అటు భారత్‌లో జోరందుకుంది. గతరాత్రి ఏం జరిగింది?

బంగ్లాదేశ్‌లో మళ్లీ ఆందోళనలు

Advertisement

కొన్నాళ్ల కిందట బంగ్లాదేశ్‌లో జరిగిన అల్లర్లలో గాయపడిన విద్యార్థి నాయకుడు షరీఫ్‌ ఉస్మాన్‌ బిన్‌ హైది చికిత్స పొందుతూ సింగపూర్‌లో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా సహా పలు ప్రాంతాల్లో నిరసనకారులు రెచ్చిపోయారు.

ముఖ్యంగా చత్తోగ్రామ్‌లోని భారత్ అసిస్టెంట్‌ హైకమిషన్‌ ఆఫీసుని అర్ధరాత్రి సమయంలో ఆందోళనకారులు ముట్టడించారు. అంతేకాదు రాళ్లు కూడా విసిరినట్టు తెలుస్తోంది. మరోవైపు అవామీలీగ్‌ పార్టీకి వ్యతిరేకంగా నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పలు మీడియా సంస్థలకు నిప్పుపెట్టారు. వారిని కంట్రోల్ చేయలేక పోలీసులు చేతులెత్తేశారు.

Advertisement

అర్థరాత్రి రెచ్చిపోయిన అల్లరిమూకలు, పత్రికా కార్యాలయం నిప్పు

గురువారం రాత్రి జాతినుద్దేశించి టెలివిజన్‌లో ప్రసంగించారు ఆదేశ ప్రధాన సలహాదారు యూనస్. హైది మరణాన్ని ప్రకటించారు. హంతకులను పట్టుకోవడానికి వేగంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ ప్రకటన తర్వాత ఢాకా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో వందలాది మంది విద్యార్థులు, ప్రజలు గుమిగూడారు. మృతి చెందిన నాయకుడికి అనుకూలంగా నినాదాలు చేశారు.

బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతల మధ్య అవామీ లీగ్ పార్టీ కార్యాలయాన్ని బుల్డోజర్‌తో కూల్చివేశారు ఆందోళనకారులు. శుక్రవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరగింది. అలాగే బంగ్లాదేశ్‌లోని డెయిలీ స్టార్‌ పత్రికా కార్యాలయంపై అల్లరిమూకలు విరుచుకుపడ్డారు.  రాళ్లతో దాడి చేశారు. ఢాకాలోని కవ్రాన్‌ బజార్‌లోని ఓ ఆఫీసుకు నిప్పుపెట్టారు.

ALSO READ: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. రన్ వేపై కూలింది

ఆందోళనకారులను అదుపు చేయడం పోలీసులు కష్టంగా మారింది. గంటల తరబడి శ్రమించి దాదాపు 25 మంది జర్నలిస్టులను ఆ భవనం నుంచి కాపాడారు. అందులో మహిళా జర్నలిస్టులు ఉన్నారు. బెంగాలీ పత్రిక ప్రోథోమ్‌ అలో కార్యాలయంపై దాడులు చేశారు ఆందోళనకారులు. న్యూఏజ్‌ పత్రిక ఎడిటర్‌ నూరుల్‌ కబీర్‌పై దాడి చేశారు. ఆందోళనకారులు హింస నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో ప్రధాన పత్రికలు శుక్రవారం తమ కార్యకలాపాలను సస్పెండ్‌ చేశాయి.

వారం ప్రారంభంలో భారత వ్యతిరేక నిరసనల నేపథ్యంలో అక్కడ నిరసనలు మొదలయ్యాయి. మాజీ ప్రధాని హసీనా ఢిల్లీకి పారిపోయినప్పటి నుండి పొరుగుదేశంలో భారత్‌తో డీలా పడ్డాయి. బుధవారం జూలై ఐక్యత బ్యానర్ కింద వందలాది మంది ప్రదర్శనకారులు ఢాకాలోని భారత హైకమిషన్ వైపు కవాతు చేశారు. భారత వ్యతిరేక నినాదాలు చేసి హసీనాను తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు.

 

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×