E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవికి షాకిచ్చిన కమల్..రాజేంద్ర ప్రసాద్ షాకింగ్ నిర్ణయం.. పల్లెకు వెళ్తున్న కుటుంబం..

Intinti Ramayanam Today Episode: పల్లవికి షాకిచ్చిన కమల్..రాజేంద్ర ప్రసాద్ షాకింగ్ నిర్ణయం.. పల్లెకు వెళ్తున్న కుటుంబం..
Advertisement

Intinti Ramayanam Today Episode December 19th: నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీయ ఆస్తి వచ్చేసింది కదా ఇంక ఎవరు ఆస్తి వాళ్ళకి ఇస్తారా అని అడుగుతుంది. ఆస్తి గురించి ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు అని రాజేంద్రప్రసాద్ అంటాడు.. అలాగే పని కూడా మావయ్య గారి మాటకి ఎదురు చెప్పే అధికారం నీకు ఎవరు ఇచ్చారు అని అంటుంది.. పతికి ఆస్తి పత్రాలు ఇచ్చి దేవుడి దగ్గర పెట్టమని రాజేంద్రప్రసాద్ అంటాడు. పార్వతి డాక్యుమెంట్స్ తీసుకొచ్చి మన గదిలో పెట్టు అని అంటాడు. శ్రీయ మాత్రం ఆస్తి కోసం పెద్ద రచ్చ చేస్తుంది.. కానీ ఆస్తి ఎవరికి దక్కదు అని నేను ఎన్నోసార్లు చెప్పాను మళ్లీ మళ్లీ అదే పంచాయతీ పెడుతున్నారు అని రాజేంద్ర ప్రసాద్ అంటాడు. పార్వతికి డాక్యుమెంట్స్ ఇచ్చి వాటిని లోపల పెట్టమని చెప్తాడు. ఆస్తిని ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు ఇప్పుడు దాని గురించి ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు అని అంటాడు. ఇక భానుమతి ఆస్తి అవని అక్షయ్ పేర్లమీద మీ మామయ్య రాసిచ్చేలా ఉన్నాడు అని అంటుంది. శ్రియ లోపలికి శ్రీకర్ ను తీసుకుని వెళ్లి క్లాస్ పీకుతుంది. ఆస్తి రాకముందంటే ఇరుకింట్లో అడ్జస్ట్ అయి ఉన్నాము. ఫ్లాట్ కోసం డబ్బులు ఇవ్వమని అడిగిన శ్రీకర్ రాజేంద్రప్రసాద్ ని దారుణంగా అవమానిస్తాడు.. శ్రీకర్ కు దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది పార్వతి.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శ్రీకర్ ఇంకొద్ది రోజుల్లో ఆస్తి పంచక పోతే ఏం చేయాలో అది చేస్తాను అని అంటాడు. ఈ విషయాన్ని జైల్లో ఉన్న తన తండ్రితో చెప్తుంది పల్లవి. అవనికి ఆస్తి గురించి తెలియదు కదా ఆస్తిని ఎలాగైనా సరే మనమే సొంతం చేసుకోవాలని అంటుంది.. రాజేంద్రప్రసాద్ కూల్ గా ఉండడం చూసి పార్వతీ భానుమతి ఇద్దరూ కూడా ఏంటి మీరు ఇంత కూల్ గా ఉన్నారు ఆస్తి పంచొచ్చు కదా అని అంటారు. దాని గురించి నేను తర్వాత మాట్లాడుతానని అంటాడు. రాజేంద్ర ప్రసాద్ మాత్రం చాలా కూల్ గా ఉంటాడు. భానుమతి పార్వతిలో ఏమైందిరా ఇంత కూల్ గా ఉన్నావ్ అని అడుగుతారు. ఇప్పుడు నేను ఒక విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను అని అంటాడు.

Advertisement

పల్లవి కమల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది.. కమల్ రాగానే పల్లవి అతనిపై ప్రేమను కురిపిస్తుంది. నీకేం కావాలో చెప్పు నేను నీ కోరిక తీరుస్తాను అని పల్లవి అంటుంది.. ఏం కావాలి అని కమల్ ని అడుగుతుంది. దానికి కమల్ నాకు ముద్దు కావాలి అని అంటాడు. అయితే నీకు ముద్దు కావాలంటే నేను చెప్పినట్టు చేస్తావా అని పల్లవి అడుగుతుంది. నువ్వు చెప్పినట్టు ఏదైనా చేస్తాను చెప్పు ఏం చేయాలో అని అడుగుతాడు కమల్. ఆస్తికోసం నువ్వు కూడా శ్రియ శ్రీకర్ లాగే అడగాలి అని అడుగుతుంది. అలాగే మా నాన్నని విడిపించుకుని రమ్మని మీ అన్నయ్య వదినలకు చెప్పచ్చు కదా అని పల్లవి అంటుంది. మాట వినగానే కమల్ పల్లవి చేయని వదిలేస్తాడు. నేను మగాడిగా కోరికలు తీర్చుకోవాలి అనుకుంటున్నాను కానీ ఇలా చేసే అంత చీప్ క్యారెక్టర్ కాదు నాది అని అంటాడు. పల్లవి నీ చేత ఎలాగైనా సరే ఇవన్నీ చేయిస్తాను అని ఛాలెంజ్ చేస్తుంది..

రాజేంద్రప్రసాద్ బట్టల సర్దుకుంటూ ఉంటాడు. ఏంటండీ బట్టల సర్దుకుంటున్నారు ఎక్కడికైనా వెళ్తున్నారా అని అడుగుతుంది పార్వతి. నీ బట్టలు కూడా సర్దుకో నేను అందరికీ ఒక విషయం చెప్పాలి అని అంటాడు.. అది రాజేంద్రప్రసాద్ అందరిని పిలుస్తారు. నేను పుట్టి పెరిగిన ఊరు గురించి మీకు తెలియజేయాలి అని రాజేంద్ర ప్రసాద్ అంటాడు.. నేను చిన్నప్పటినుంచి కోటీశ్వరుల ఇంట్లో పుట్టలేదు రూపాయి కోసం ఎన్నో పాట్లు పడ్డాను. ఒక్క రూపాయి చూసి 100 కోరికలతో ఉండేవాణ్ణి. నేను పెరిగాను అని రాజేంద్రప్రసాద్ అంటాడు.. అయితే రాజేంద్రప్రసాద్ ఎందుకు అంటున్నాడు అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు.

Advertisement

ఆస్తి పంచాలని అడుగుతున్నారు కదా అందుకే నేను పుట్టి పెరిగిన ఊరు గురించి మీకు చూపించాలని అనుకుంటున్నాను.. అలా కష్టపడి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను అని మీరు తెలుసుకోవాలని నేను ఆ ఊరికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాను అని రాజేంద్రప్రసాద్ అంటాడు.. ఇప్పటికి ఇప్పుడు ఊరికంటే కష్టమని శ్రీకర్ అంటాడు. అక్షయ్ అవనీలు కూడా ఈ విషయం గురించి కష్టమని అంటారు. మీకు ఏమున్నా సరే ప్రస్తుతానికి అయితే సెలవులు పెట్టుకోండి.. మీకు జీవితం గురించి మరిన్ని విలువలు తెలియజేయాలి అని రాజేంద్రప్రసాద్ అంటాడు.. అవని అక్షయ్ ఎంత చెప్తున్నా సరే రాజేంద్ర మాత్రం వినకుండా మీరు అందరూ రెడీ అవ్వండి బట్టలు సర్దుకొండి అని చెప్తాడు.

ఆ తర్వాత మీనాక్షి మీరందరూ ఊరికి వెళ్తున్నారు కదా అక్కడికి వచ్చి నేనేం చేయాలి మీరు అందరూ వెళ్ళండి నేను భరత్ దగ్గరికి వెళ్ళిపోతాను అని అంటుంది.. అయితే భరత్ ఇప్పుడే పెళ్లయింది కదా తను ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో అర్థం కావడం లేదు.. వాడు పడుతున్న ఇబ్బందులు గురించి కూడా చెప్పట్లేదు అని అవని అంటుంది. ఇక్కడంటే ఓకే కానీ మీ ఊరికి వెళ్తే మీ వాళ్ళందరూ ఏదో ఒకటి అంటారు అందుకే నేను రాను అమ్మా అని మీనాక్షి.. నువ్వు ఒక్కదానివే వాడి దగ్గరికి వెళ్తే ఇబ్బంది పడతావ్ అమ్మ అని అవని చెప్తూ ఉంటుంది.. ఆ టైంలో అక్కడికొచ్చిన పార్వతి భానుమతి ఇద్దరు కూడా అవనిని తిడతారు..

ఇకపోతే మీ తమ్ముడు ఇబ్బంది పడతాడని మీ అమ్మని అక్కడికి కూడా తీసుకొని వెళ్తే అక్కడ వాళ్ళందరూ ఏమనుకుంటారో ఆలోచించవా అని అవని అంటారు.. అయితే పక్క ఫ్లాట్లో ఏం జరుగుతుందో కూడా పెద్దగా పట్టించుకోరు.. కానీ పల్లెటూర్లో మాత్రం ఎక్కడైనా ఏదైనా జరిగితే ఆ ఊరు మొత్తం తెలిసిపోతుంది అని పార్వతి అంటుంది.. ఆ తర్వాత మీ అమ్మ అక్కడికి రావడానికి వీల్లేదు అని చెప్పి వెళ్ళిపోతారు. శ్రియ శ్రీకర్లు, ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు.. మీరు పల్లెటూరికి వెళ్తున్నారు కదా నాకు అక్కడ వాతావరణం నచ్చదు నేను ఇక్కడే ఉంటాను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని శ్రియ అంటుంది.. శ్రీకర్ మాత్రం ఆస్తి కోసమే కదా మనం అక్కడికి వెళ్తున్నాం అక్కడ నువ్వు పూర్తిగా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అని అంటాడు..

Also Read : కన్నీళ్లు పెట్టుకున్న బాలు.. మనోజ్ ను తిట్టిన ప్రభావతి..బాలు పై రాజేష్ ప్రశంసలు..

ఆ మాట వినగానే శ్రియ ప్లేట్ మారుస్తుంది.. అయితే నేను అక్కడికి వస్తాను అని శ్రియ అంటుంది. ఆ తర్వాత అక్షయ్ అవని బట్టలు ఐరన్ చేస్తుంటే అక్కడికి వస్తాడు. ఇంట్లోని వాళ్లందరి బట్టలు ఐరన్ చేస్తున్నావంటే ఫ్యూచర్లో ఐరన్ షాప్ పెట్టుకోవచ్చని వెటకారంగా మాట్లాడుతాడు. మా అత్తయ్య గారి బట్టలు నేను ఐరన్ చేస్తాను అత్తయ్య అంటే అమ్మతో సమానం కదా నేను చూసుకుంటాను అని అక్షయ్ అంటాడు. మీనాక్షి బ్యాగులోంచి ఒక ఫోటో పడడం చూసి అక్షయ కేకలు వేస్తూ అవనీని పిలుస్తాడు.. చక్రధర్ తో మీ అమ్మ కలిసి ఉంది ఏంటి అని అడుగుతాడు. అందరూ కూడా దీని గురించి అవనిని అడుగుతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

 

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Big Stories

Advertisement
×