E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అవనికి దొరికిపోయిన పల్లవి.. పార్వతిని మార్చేసిన పల్లవి.. చక్రధర్ కు వార్నింగ్..

Intinti Ramayanam Today Episode: అవనికి దొరికిపోయిన పల్లవి.. పార్వతిని మార్చేసిన పల్లవి.. చక్రధర్ కు వార్నింగ్..
Advertisement

Intinti Ramayanam Today Episode December 3rd: నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి కమల్ ని ఎలాగైనా రెచ్చగొట్టి తనతో రొమాన్స్ చేయాలని అనుకుంటుంది.. తింగరోడుతో ఎలా నా బుట్టలోకి తెచ్చుకోవాలి అని ఆలోచిస్తుంది.. ఇక తన ప్లాన్ అనుకున్న విధంగా నడుము చూపిస్తూ నాకు ఇక్కడ చీమకుట్టింది బావ అంటూ నాజూగ్గా మాట్లాడుతుంది.. తనని అలా చూసిన కమల్ టెంప్ట్ అయిపోతాడు.. పల్లవి తన ముగ్గులోకి కమల్ ను తీసుకొస్తుంది. అలా వీళ్ళిద్దరి రొమాంటిక్ నైట్ కాస్త ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది.. మీనాక్షి శ్రీయా అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటుంది.

నేను ఇంట్లోంచి వెళ్ళిపోతేని ఇక్కడ సమస్యలన్నీ తగ్గిపోతాయని అనుకుంటుంది. తర్వాత రోజు ఉదయం ఎవరు లేవక ముందే వెళ్లిపోవాలని అనుకుంటుంది. మీనాక్షి గదిలోంచి బయటికి రాగానే అక్కడ అవని నిలబడుకుని ఉంటుంది. అవని నువ్వు ఇలాంటివి ఏదో చేస్తావని అనుకున్నాను.. ఇప్పుడు వెళితే ఈ సమస్యల్ని మరింత పెద్ద వి అవుతాయి తప్ప తగ్గవు అని అంటుంది. అక్షయ్ మా అత్తయ్య మా ఇంట్లోనే ఉంటుంది. ఎవరైన ఏదైన అంటే మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇస్తాడు. పల్లవి మాత్రం అవనీ గదిలో ఉన్న డాక్యుమెంట్స్ నీ కొట్టేయ్యడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

Advertisement

ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. పల్లవి అవని గదిలో ఉన్న డాక్యుమెంట్స్ ని వెతకాలని అనుకుంటుంది. ఈ రూమ్ లో ఎవరూ లేరని తెలుసుకొని ఆ గదిలోకి వెళ్లి ఒక డాక్యుమెంట్ ని తీసుకుంటుంది. ఇక్కడ అన్ని చూసి అక్షయ్ సర్టిఫికెట్లని షాక్ అవుతుంది. అప్పుడే ఆరాధ్య లోపలికి వస్తుంది. దొరికిపోతానేమో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అవని తన బుక్ కోసం వచ్చిందని తెలుసుకుందాం పల్లవి ఊపిరి పీల్చుకుంటుంది. తర్వాత వెంటనే అవని లోపలికి వచ్చి ఏం చేస్తున్నావని అడుగుతుంది.. నేను బుక్ కోసం వెతుక్కుంటూ లోపలికి వచ్చానమ్మా అని ఆరాధ్య అంటుంది.

గదిలో బీరువా తెరిచి ఉండడం చూసిన అవని ఎవరు తెరిచారు మీరు ఏమైనా తెరిచారా అని అక్షయ్ ని అడుగుతుంది.. నేనేమైనా తెలుస్తానా నేను ఇప్పుడే వచ్చాను అని అంటాడు.. నేను వెళ్ళాలి అని అక్షయ్ అంటాడు. మరి బీరువా ఎవరు తెరుచుంటారు అని అవని అనుమాన పడుతుంది. ఎవరు తెలిస్తే ఏమైంది అందులో ఏమైనా మనులు మాణిక్యాలు ఉన్నాయా అనేసి అక్షయ్ అంటాడు. ఎవరు తెరిచారో తెలుసుకోవాలని అవని అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతుంది..

Advertisement

అవని బయటికి వెళ్లిందని తెలుసుకుని పల్లవి కూడా మెల్లగా బయటకు వచ్చేస్తుంది. అది గమనించిన అవని పల్లవి నా గదిలోంచి ఎందుకు బయటకు వచ్చింది అని అనుకుంటుంది.. పల్లవి వెళ్ళిపోతుంటే ఆపి ఏంటి నువ్వు నా గదిలోంచి బయటికి వచ్చావు అని అవని అడుగుతుంది. నా శారీ ఒకటి కనిపించలేదు అక్క నీ గదిలో ఉందేమో అని వెతకడానికి వచ్చాను అని అవని తో పల్లవి అంటుంది. మీ అమ్మగారు పొరపాటున నా శారీ ని నీ శారి అనుకోని అక్కడ పెట్టారేమో అని చూడ్డానికి వచ్చాను అని పల్లవి చెప్తున్నా కూడా అవని నమ్మదు.

ఇప్పుడు అక్కడికి వచ్చిన భానుమతి ఏంటి నువ్వు ఏమంటున్నావ్ అనేసీ అవని పై సీరియస్ అవుతుంది. అదేం లేదు అమ్మమ్మ తను నా గది నుంచి బయటికి రావడం నేను చూశాను. ఎందుకు వెళ్ళింది అంటే ఏదో ఒక సాగు చెప్తుంది అని అవని అంటుంది.. అబద్ధం చెప్పాల్సిన అవసరం నా మనవరాలు ఏంటి అని భానుమతి అనగానే అవని షాక్ అవుతుంది. దొంగతనం చేయాల్సిన అవసరం నా మనవరాలకు ఏంటి అని పల్లవి తరుపున వక్కత పుచ్చుకొని భానుమతి మాట్లాడుతుంది. పల్లవి ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలని అనుకున్న అవనికి భానుమతి షాక్ ఇస్తుంది.. నాకేం దొంగతనం చేయాల్సిన అవసరం లేదు అనేసి పల్లవి ని తీసుకుని వస్తుంది భానుమతి..

Also Read :బయటపడ్డ మనోజ్ మోసం.. రెచ్చిపోయిన సత్యం.. బుక్కయిన రోహిణి..

పల్లవి పార్వతీ దగ్గర ఎలాగైనా సరే అవనిని చెడ్డదాన్ని చేయాలి అని ఏడుస్తూ నాటకాలు మొదలు పెడుతుంది.. ఏమైంది పల్లవి ఏమైంది అత్తయ్య అని ఎంతగా అడిగినా చెప్పరు. ఏంటి ఏమైంది అని అడుగుతుంది పార్వతి.. అవని వాళ్ళ అమ్మగారు బట్టలు ఉతకడం బట్టలు మడత పెడదాం లాంటివి చేస్తున్నారు కదా. చీర ఒకటి కనిపించలేదు. అందుకే అవని ఒక గదిలోకి వెళ్లి వెతికాను. దానికే అవని అక్క నన్ను చాలా దారుణంగా మాట్లాడింది అని పల్లవి ఏడుస్తుంది.. ఇప్పటివరకు అవని ఒకలా ఉంది ఇప్పుడు వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత మారిపోయింది అని భానుమతి అంటుంది. ఇక అవని పోలీస్ స్టేషన్కు వెళ్లి తన తండ్రి దగ్గర నిజం తెలుసుకోవాలని అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి.. నర్మదకు భద్రపై అనుమానం.. వేదవతి ఫుల్ హ్యాపీ..

Intinti Ramayanam Today Episode: పాపం మీనాక్షికి కన్నీళ్లు.. పల్లవి, కమల్ రొమాన్స్.. యోగా టీచర్ ఎంట్రీ అదుర్స్..

Brahmamudi Serial Today Episode July 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి వచ్చిన రాజు   

Actress Sirisha : నటి శిరీష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Godhavari Janu : ‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Telugu Serials : సీరియల్స్ కు పేమెంట్ ఎలా ఇస్తారు..? అర్రె ఇన్నాళ్లు ఇది మిస్ అయ్యామా..?

Tuesday Movies in Tv : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×