E-Paper
Advertisement

Rangareddy News: పంచాయతీ పోరు.. ఏకంగా అభ్యర్థి ప్రాణాలే పోయాయ్, ఎక్కడంటే..

Rangareddy News: పంచాయతీ పోరు.. ఏకంగా అభ్యర్థి ప్రాణాలే పోయాయ్, ఎక్కడంటే..
Advertisement

Rangareddy News: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు క్రమంగా వేడి రాజుకుంటోంది. విత్ డ్రాలకు సమయం దగ్గరపడుతుండడంతో ప్రత్యర్థుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఈ క్రమంలో అభ్యర్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి రంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది.

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వేడి

Advertisement

పంచాయతీ ఎన్నికలంటే ఆ వేడి మామూలుగా ఉండదు. గ్రామాల్లో అభ్యర్థులు బలాబలాలను ప్రదర్శించుకునేందుకు ప్రయత్నం చేశారు.. చేస్తుంటారు. ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటారు. రంగారెడ్డి జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. సదరు వ్యక్తి ఆత్మహత్య వెనుక ప్రత్యర్థుల బెదిరింపులు కారణమనే వాదలు లేకపోలేదు.

రంగారెడ్డి జిల్లాలో ఫరూక్‌ నగర్‌ మండలం కంసాన్‌పల్లి గ్రామానికి చెందినవాడు 25 ఏళ్ల అవ శేఖర్‌. మంగళవారం అర్థరాత్రి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంచాయతీ ఎన్నికల్లో తన గ్రామం నుంచి వార్డు మెంటర్‌గా పోటీ చేస్తున్నాడు. అయితే ఎన్నికల నుంచి తప్పుకోవాలంటూ ప్రత్యర్థుల నుంచి బెదిరింపులు వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు.

Advertisement

ప్రత్యర్థుల వేధింపులకు ఓ అభ్యర్థి ఆత్మహత్య

గడిచిన రెండు మూడురోజులుగా ప్రత్యర్థుల నుంచి పదే పదే వేధింపులు తీవ్రమయ్యాయి. మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శేఖర్ ఆత్మహత్య తెలియగానే ఘటనా స్థలానికి వచ్చారు శేఖర్‌ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు. అతడి మృతి దేహాన్ని బోరున విలపించారు. శేఖర్‌ ఆత్మహత్యకు కారణమైన వారిని అరెస్ట్‌ చేయాలని ఆందోళనకు దిగారు.

ఆధార్ కార్డు ఆధారంగా మృతుడిని శేఖర్‌గా గుర్తించారు రైల్వే పోలీసులు. పోస్టుమార్టం కోసం శేఖర్‌ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదిలావుండగా కంసాన్‌పల్లి గ్రామ ప్రజలు పెద్దఎత్తున గుమ్మిగూడి ఆందోళనకు దిగారు.

ALSO READ: పాఠశాలలో ర్యాగింగ్ దుమారం.. పలువురు స్టూడెంట్స్ సస్పెండ్

శేఖర్‌ ఆత్మహత్యకు కొందరి బెదిరింపులు కారణమని బలంగా చెబుతున్నారు. వారిని కచ్చితంగా అరెస్టు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగారు. ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×