E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today December 5th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బేబీ మాటలు విన్న అమర్

Nindu Noorella Saavasam Serial Today December 5th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బేబీ మాటలు విన్న అమర్
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:   

ఊబిలోకి మిస్సమ్మను తోసేయబోతుంది మనోహరి. ఇంతలో మిస్సమ్మ పక్కకు జరగ్గానే.. మనోహరి ఊబిలోకి వెళ్లి పడుతుంది. వెంటనే మనోహరి భాగీ ఇది ఊబిలా ఉంది బయటకు రాలేకపోతున్నాను.. లోపలికి కూరుకుపోతున్నాను.. నన్ను ఎలాగైనా కాపాడు భాగీ ఫ్లీజ్‌ భాగీ దండం పెడతాన నన్ను ఎలాగైనా కాపాడు భాగీ.. అంటూ ఏడుస్తుంది. సరే సరే ఉండు ఎలాగైనా బయటకు లాగుతాను అంటూ తాడు కోసం మిస్సమ్మ వెతుకుతుంది. చాటు నుంచి అంతా గమనిస్తున్న చంభా తన స్వార్థం కోసం ఎంతో మందిని చంపింది. తన చావు తను చావనివ్వు.. ఇప్పుడు నేను కాపాడటానికి వెళితే నన్ను కూడా ఊబిలోకి లాగేస్తుంది. అమ్మో నేను వెళ్లకపోవడమే మంచిది అని మనసులో అనుకుంటుంది.

ఇంతలో అక్కడికి ఆరు, గుప్త వస్తారు. ఆరు కంగారు పడుతుంది. మిస్సమ్మ ఒక కర్ర తీసుకొచ్చి మనోహరికి ఇస్తూ.. ఇది పట్టుకో మనోహరి అంటూ అందిస్తుంది. అది మనోహరికి అందదు. దీంతో మనోహరి భయంగా భాగీ ఇంకొంచెం ముందుకు వెయ్‌.. ఇంకెంచెం వేయ్‌ నాకు అందడం లేదు.. అనగానే.. మిస్సమ్మ మాత్రం అయ్యో మనోహరి నా వల్ల కావడం లేదు.. అంటూ బాధపడుతుంది మిస్సమ్మ. మనోహరి మాత్రం ఏడుస్తూ.. నన్ను కాపాడు భాగీ ఫ్లీజ్‌ ఎలాగైనా కొంచెం గట్టిగా విసురు ఫ్లీజ్‌ అంటుంది.. మిస్సమ్మ కొంచెం గట్టిగా విసరగానే.. ఆ కర్రను మనోహరి పట్టుకుంటుంది. లాగు భాగీ అని మనోహరి చెప్పగానే.. నా వల్ల కావడం లేదు భాగీ కడుపులో తిప్పినట్టు అవుతుంది అని చెప్తుంది.

Advertisement

లాగు భాగీ లేదంటే లోపలికి కూరుకుపోతున్నాను అంటూ ఏడుస్తుంది మనోహరి. ఇంతలో అమర్‌ వచ్చి పట్టుకుంటాడు. అమర్‌ ను చూసిన మిస్సమ్మ ఏవండి టైంకు వచ్చారు త్వరగా మనోహరిని కాపాడండి అని చెప్తుంది. అమర్‌ను చూసిన మనోహరి ధైర్యంగా ఫీలవుతుంది. అమర్‌ కూడా మనోహరి టెన్షన్‌ పడకు నీకేం కాదు.. త్వరగా బయటకు వచ్చేయ్‌.. అంటూ అమర్‌, మనోహరిని బయటకు లాగేస్తాడు. బయటకు వచ్చిన మనోహరి థాంక్యూ అమర్‌ టైంకు నువ్వు రాకపోయి ఉంటే నేను చనిపోయి ఉండేదాన్ని అంటుంది. ఇట్స్‌ ఓకే ఈ ప్లేస్‌ లో ఎక్కువ  సేపు ఉండటం మంచిది కాదు.

మనోహరి అక్కడ సెలయేరు ఉంది నువ్వు వెళ్లి వాష్‌ చేసుకుని వచ్చేయ్‌ అని చెప్పగానే.. మనోహరి సరే అంటూ చంబాను కోపంగా చూస్తూ.. ఒసేయ్‌ చంభా నేను ఊబిలో కూరుకుపోయి చచ్చిపోయేలా ఉన్నా దగ్గరకు వచ్చి కాపాడలేదు కదా..? చెప్తా నీ సంగతి అని మనసులో అనుకుని వాష్‌ చేసుకోవడానికి వెళ్తుంది. అంతా చూస్తున్న గుప్త చూశావా బాలిక ఆ దుష్ట బాలికను దేవుడు శిక్షించాలని చూసినా నీ పతి దేవుడు.. నీ సహోదరి కలిసి రక్షించారు అని చెప్తాడు. దీంతో ఆరు పోనీలెండి గుప్త గారు ఆ మనోహరికి దేవుడు ఇంకా చావు రాయలేదేమో..? అంటుంది.

Advertisement

మరోవైపు కార్ల దగ్గర పిల్లలు, రామ్మూర్తి, మంగళ, రాథోడ్‌ వెయిట్‌ చేస్తుంటారు. రామ్మూర్తి కంగారుగా ఏంటి రాథోడ్‌ అల్లుడు గారు మనల్ని అందర్ని క్షేమంగా ఇక్కడికి పంపించారు. కానీ ఇంకా భాగీని తీసుకుని రాలేదేంటి..? అని అడుగుతాడు. దీంతో రాథోడ్‌ మీరేం కంగారు పడకండి సార్‌ మిస్సమ్మను సార్‌ క్షేమంగా తీసుకుని వస్తారు అని చెప్తాడు. ఇంతలో అమర్‌, మిస్సమ్మ, మనోహరి, చంభా వస్తారు. వాళ్లను చూసిన అందరూ ఊపిరి పీల్చుకుంటారు. రామ్మూర్తి ఎదురుగా వెళ్లి అమ్మా భాగీ నీకు ఏం కాలేదు కదా అమ్మా అని అడగ్గానే.. ఏం కాలేదు నాన్న అని మిస్సమ్మ చెప్తుంది. ఇందాకటి నుంచి మీ నాన్న తెగ కంగారు పడిపోతున్నారమ్మ.. నీకేమైందో.. ఎలా ఉన్నావో అని ఇప్పుడు మీ నాన్న మనసు శాంతించింది అని మంగళ చెప్తుంది. మీకు అందరికీ ఏమీ కాలేదు కదా అని మిస్సమ్మ అడగ్గానే.. ఎవ్వరికీ ఏమీ కాలేదు మిస్సమ్మ అందరూ సేఫ్‌గానే ఉన్నాం అని రాథోడ్‌ చెప్తాడు. అందరూ అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతారు.

ఇంటికి వెళ్లాక రూంలో మిస్సమ్మ బట్టలు సర్దుతుంటే.. అమర్‌ వెళ్లి ఫ్లీజ్‌ బేబీ మాట్లాడుతున్నట్టు నువ్వు ఊహించుకుంటున్నావు అలా ఊహించుకోకు అని చెప్తాడు. అయ్యో నేను చెప్పేది నిజమేనండి.. అని మిస్సమ్మ చెప్పినా అమర్‌ నమ్మడు. ఇంతలో మిస్సమ్మ కడుపులో ఉన్న బేబీ అమర్‌ను నాన్న అని పిలుస్తుంది. ఆ మాటలకు అమర్‌ షాక్‌ అవుతాడు. ఎమోషనల్‌ అవుతూ నువ్వు చెబితే అబద్దం అనుకున్నాను భాగీ అంటూ ఆశ్చర్యపోతాడు అమర్‌. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

త్వరలో పెళ్లి చేసుకోబోతున్న జబర్దస్త్ కమెడియన్..!

Intinti Ramayanam Kamal : అయ్యో.. కమల్ అవుట్.. ఇదేం ట్విస్ట్ మామా..

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మీనా చెల్లి అవుట్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లిని ఇంట్లోంచి గేంటేసిన వేదవతి.. భాగ్యంకు నర్మదా స్ట్రాంగ్ వార్నింగ్.. పాపం శ్రీవల్లి..

Intinti Ramayanam Today Episode: అవని పై భానుమతి సీరియస్.. అవనికి సీరియస్.. ప్రణతి కాపురంలో చిచ్చు..

Karthika Deepam 2 Serial Today Episode October 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్ దెబ్బకు టిపిన్ బండి ఎత్తేసిన మాలిని           

Podarillu Today Episode : నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్.. మహా పై సీరియస్.. కన్నా కన్నీళ్లు..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ మాటతో ప్రభా షాక్.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రభా.. బాలు రచ్చ రచ్చ..

Big Stories

Advertisement
×