E-Paper
Advertisement

Car Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. వేగానికి నుజ్జయిన కారు, సీసీటీవీ ఫుటేజ్‌లో

Car Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. వేగానికి నుజ్జయిన కారు, సీసీటీవీ ఫుటేజ్‌లో
Advertisement

Car Accident: అతివేగం ప్రమాదకరం.. రోడ్ల మీద సొంత వాహనాలతో ట్రావెల్ చేసేవారు జాగ్రత్త అంటూ పదే పదే హెచ్చరిస్తున్నారు పోలీసులు. రోడ్లు ఖాళీగా ఉన్నాయని స్పీడ్ పెంచి ఈ లోకాన్ని విడిచిపెట్టేవారు చాలామంది ఉన్నారు. తాజాగా రాత్రి పల్నాడు జిల్లాలో కారు ప్రమదానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది.

పల్నాడు జిల్లాలో కారు ప్రమాదంలో సీసీటీవీ ఫుటేజ్

Advertisement

గురువారం రాత్రి పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీనికి గురించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. తప్పంతా కారు డ్రైవర్ దేనని అంటున్నారు.

గుంటూరు నుంచి ఒంగోలు వైపు కొత్త ట్రాక్టర్లను తీసుకెళ్తోంది కంటెయినర్ లారీ. అతివేగంగా వస్తున్న కారు.. కంటెయినర్ దాని వెనుక భాగంలో బలంగా ఢీకొట్టింది. వేగానికి కంటెయినర్‌ లోపలికి చొచ్చుకుపోయి నుజ్జునుజ్జయింది కారు. ఘటన సమయంలో కారులో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. స్పాట్‌లో ఐదురుగు మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి.

Advertisement

వేగానికి నుజ్జు నుజ్జు అయిన కారు, మృతులంతా 22 ఏళ్ల లోపువారే

అందులో ప్రయాణిస్తున్న యువకుల వయస్సు 20 నుంచి 22 ఏళ్ల మధ్యవారు. మృతుల్లో డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారు. మృతుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మేడగం రామిరెడ్డి – తాళ్లూరు గ్రామం అద్దంకి మండలానికి చెందినవాడు. శివరాత్రి మహేశ్ – పిడుగురాళ్ల టౌన్‌ వాసి కాగా, మెరుపు శ్రీకాంత్ – శివాపురం వినుకొండ ప్రాంతానికి చెందినవాడు.

అలాగే వంగవోలు వాసు – వినుకొండ, గొడవర్తి యశ్వంత్ సాయి – ములకలూరు గ్రామం వినుకొండ మండలానికి చెందినవాడు. శ్రీకాంత్‌.. గుంటూరు జిల్లా వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీలో సెకండియర్ చదువుతున్నాడు. విజ్ఞాన్‌ లో ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు రామిరెడ్. గాయపడినవారిలో వినుకొండ మండలం దొండపాడుకు చెందిన మద్దుకూరి కార్తిక్‌ ఉన్నాడు.

ALSO READ: బర్త్ డే పార్టీలో బ్లేడ్ బ్యాచ్.. రౌడీ షీటర్ దారుణహత్య

అతడు చలపతి ఇంజినీరింగ్‌ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ప్రస్తుతం అతడ్ని గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో నలుగురు విద్యార్థులు అయ్యప్ప దీక్షలో ఉన్నారు. వీరంతా వినుకొండ మండలం విఠంరాజుపల్లెలో అయ్యప్పదేవాలయానికి భజన కోసం బయలు దేరారు. అంతలోనే ఈ లోకాన్ని విడిచిపెట్టారు. ఎదిగిక కొడుకులు కళ్ల ముందు చనిపోవడాన్ని వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.  పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×