E-Paper
Advertisement

Illu  Illalu Pillalu Today Episode: వేదవతి కన్నీళ్లు.. తండ్రి కోసం వచ్చిన అమూల్య.. విశ్వం ఇంట్లో దొంగతనానికి భాగ్యం ప్లాన్..

Illu  Illalu Pillalu Today Episode: వేదవతి కన్నీళ్లు.. తండ్రి కోసం వచ్చిన అమూల్య.. విశ్వం ఇంట్లో దొంగతనానికి భాగ్యం ప్లాన్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode February 5th: నిన్నటి ఎపిసోడ్ లో.. విశ్వం అమూల్యతో శోభనం జరగాలి అని అంటాడు కానీ.. అమూల్య మాత్రం నువ్వు ఇలాంటి దుర్మార్గుడు అని తెలిసి నీతో ఎవరైనా శోభనం చేసుకుంటారని కత్తితో బెదిరిస్తుంది.. ఆ తర్వాత అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇకపోతే రామరాజు పరిస్థితి ఇంకా క్రిటికల్ గా ఉంది అని డాక్టర్ చెప్పడంతో చందు సీరియస్ అవుతాడు.. ఈ పరిస్థితికి కారణం ఎవరో నాకు బాగా తెలుసు ఏం చేయాలి అది చేస్తాను అని చందు ఆవేశంగా అక్కడికి వెళ్తాడు. ప్రేమతో మాట్లాడుతున్న ధీరజ్ ని చూసి ప్రేమ తన గురించి ఎక్కడ బయటపడుతుంది అని భయపడుతూ ఉంటుంది.. ఇక ధీరజ్ వెళ్ళిపోవడం చూసి ప్రేమ షాక్ అవుతుంది. ఒకవైపు రామరాజుకి బాగలేదని అందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు. భాగ్యం ఆనందరావు ఇద్దరు కలిసి ఒకవైపు ఎదురుగా కూర్చుని క్యాంటీన్లో తింటూ ఉంటారు.. అక్కడున్న వెయిటర్ తో ఇడ్లీ గురించి మాట్లాడతారు.. వాళ్ళని చూసినా శ్రీవల్లి అక్కడికి వెళుతుంది.. నర్మదకు శ్రీవల్లికి దిమ్మతిరిగే క్లాస్ ఇస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. తన తండ్రికి ఇలా జరగడం పై చందు ఫీల్ అవుతాడు. అమూల్య దగ్గరకొచ్చిన చందు అమూల్య చంప పగలగొట్టి మా నాన్నకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఇదే అని సీరియస్ అవుతాడు.. మా ఇంట్లో అడుగు పెట్టడానికి నువ్వు ఎవరు రా నీకు భద్రం ఒకవైపు అంటున్న సరే చందు మాత్రం అమూల్యని కొడుతూ తన బాధని చెప్పుకుంటాడు. నాన్నకి హార్ట్ ఎటాక్ వచ్చిందని భద్ర పెద్దమ్మతో చెప్పడంతో ఆమె షాక్ అవుతుంది. కానీ భద్ర మాత్రం అలాంటి వాడికి హార్ట్ ఎటాక్ వచ్చిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది.. ఇక అమూల్య తన తండ్రిని చూడడానికి వెళ్తాను అని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంది.

Advertisement

కానీ విశ్వం మాత్రం అమూల్య నువ్వు పంపించడానికి అస్సలు ఒప్పుకోడు.. కానీ భద్ర మాత్రం తన తండ్రి చావు బతుకులో ఉన్నాడు కదరా వెళ్ళనివ్వు అని ఉంటుంది.. ఆ తర్వాత వేదవతి కన్నీళ్లు పెట్టుకొని బాధపడిపోతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్లారు రా ఇంట్లోని వాళ్ళందరూ మీ బావని చూస్తుంటే నాకు బాధేస్తుంది రా అని వేదవతి అంటుంది.. ఏం లేదు అక్క అందరూ బయటికి వెళ్లారు అని అమూల్య విషయాన్ని చెప్పకుండా ఉంటాడు తిరుపతి. అప్పుడే చందు వాళ్ళు హాస్పిటల్ కి వస్తారు. ప్రేమ ఏం జరిగింది అమూల్య ఏమైనా చెప్పిందా అని అడుగుతుంది. కానీ ప్రేమ మాత్రం ఎంత అడుగుతున్న సరే ధీరజ్ ఏమి చెప్పలేదు అని అంటాడు.

అప్పుడే అమూల్య హాస్పిటల్ కి వస్తుంది.. పరిగెత్తుకుంటూ వెళ్లి రామరాజు రూంలోకి వెళుతుంది అమూల్య.. అది చూసిన వేదవతి అమూల్య దగ్గరికి వెళ్లి బయటికి లాక్కొని వస్తుంది. నువ్వు చేసిన చండాలపు పని వల్లే ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఇలా మారిపోయారు ఉక్కు లాంటి మనిషిని వల్ల మంచన పడ్డారు.. దేవుడి దయవల్ల ఆయన ఇంకా ప్రాణాలతో ఉన్నారు. ఇప్పుడు నువ్వు చేసిన చండాలపు పని వల్ల మళ్ళీ ఆయన ప్రాణాలు తీయాలని అనుకుంటున్నారా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అమూల్యని బయటికి తీసుకొచ్చి తోసేస్తుంది.. అత్తయ్య మీరు చేస్తున్నది ఏంటి? అందరూ చూస్తున్నారు అని నర్మదా అంటున్నా సరే వేదవతి మాత్రం చాలా సీరియస్ గా చూడని అని లోపలికి వెళ్ళిపోతుంది.

Advertisement

ఇక అమూల్యని నర్మదా ప్రేమ ఇద్దరూ తీసుకుని బయటికి వెళ్తారు.. ఆనంద్ రావు భాగ్యం అమూల్య కాలవేలపడి మా గురించి చెప్పొద్దు అని చెప్పడానికి వెళ్దామని అనుకుంటారు.అయితే అన్ని గదులు వెతుకుతారు.. అక్కడ ఒక గదిలోకి వెళ్లి చీకటిగా ఉందని ఆనందరావు భయపడుతూ ఉంటారు ఎవరో దెయ్యం నాని కొడుతుంది అని కంగారు పడుతూ ఉంటాడు.. ఆ ఎపిసోడ్కి అదే హైలెట్ అవుతుంది.. ఇక లైట్లు వెలగగానే భద్రాసేన ఇద్దరు వస్తారు.. మీరు విశ్వంకి హెల్ప్ చేసినట్లు మా గురించి ఎక్కడా చెప్పకండి మా అమ్మాయి కాపురం కూలి పోతుంది అని అంటారు..

ఇక అమూల్య తన తండ్రి కి రావడానికి కారణం తనే అని బాధపడిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది.. నువ్వు ఆ విశ్వక్ చేసిన కుట్రకు మోసపోయవే తప్ప నువ్వు మీ నాన్నని కావాలని ఇలాంటి పరిస్థితుల్లోకి తీసుకురాలేదు కదా ఎందుకు బాధపడుతున్నావు అని నర్మద కూడా ఓదారుస్తుంది. ఇక తర్వాత అమూల్యని అడిగి విశ్వం దగ్గరికి ఎవరు తీసుకెళ్లారు అన్న విషయాన్ని తెలుసుకోవాలని ప్రేమ నర్మదా అనుకుంటారు.. విశ్వంతో మాట్లాడడానికి నువ్వు ఒక్కదానివి వెళ్ళావా? ఎవరైనా తీసుకుని వెళ్లారా అని అడుగుతారు. అవును వదిన శ్రీవల్లి వదిన నన్ను మాట్లాడడానికి బయటికి తీసుకుని వెళ్ళింది అని అనగానే నర్మదాప్రేమ ఇద్దరూ షాక్ అవుతారు..

Also Read : పల్లవి ప్లాన్ సక్సెస్.. అవనిని పై మరో నింద.. అక్షయ్ కు అవని నిజం చెప్తుందా..?

అవును అమూల్య నిన్ను విశ్వంతో మాట్లాడమని వల్లి ఎందుకు తీసుకొని వెళ్ళింది అని అడుగుతారు. అసలు విశ్వం నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పిందే వల్లి వదిన అని అసలు మ్యాటర్ ని వాళ్లకి చెప్పేస్తుంది అమూల్య.. ఇక అమూల్య చెప్పడంతో ప్రేమ సీరియస్ అవుతుంది. నాకు మొదటి నుంచే ఆ బల్లి మీద డౌట్ ఉంది అక్క చూసావా ఇప్పుడు ఎంతటికి తెగించిందో దాని సంగతి ఇప్పుడు తేలుస్తాను అని ప్రేమ అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Monday Movies in Tv : సోమవారం టీవీ సినిమాలు.. అస్సలు మిస్ చెయ్యొద్దు..

Big Stories

Advertisement
×