E-Paper
Advertisement

Municipal Elections: మున్సిపల్ ఎన్నికలపై ముదురుతున్న రాజకీయం.. ఒక్కోక్కరిది ఓక్కో వ్యూహం..!

Municipal Elections: మున్సిపల్ ఎన్నికలపై ముదురుతున్న రాజకీయం.. ఒక్కోక్కరిది ఓక్కో వ్యూహం..!
Advertisement

Municipal Elections:స్వేఛ్చ బ్యూరో: మున్సిపాలిటీ ఎన్నికలను ప్రధాన పార్టీలైన కాంగ్రెస్​, బీఆర్​ఎస్​, బీజేపీలు సీరియస్గ తీసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే మున్సిపాలిటీల్లో కూడా హోరా హోరీగా ప్రచారం సాగిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో సైతం ఇంత హడావుడి లేదని నేతలు వాపోతున్నారు. పట్టణాల్లో తమ అధిపత్యం నిరూపించుకోవాలనే సరళితో పార్టీల నేతలు పనిచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏవిధంగా అయితే క్రీయశీలకంగా వ్యవహారించారో అదే పద్దతిని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీల నేతలు వ్యూహాలు చేస్తున్నారు. ఆర్ధికంగా బలమైన అభ్యర్ధులనే ఆయా పార్టీల నేతలు రంగంలోకి దింపినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీకి విదేయుడిగా పనిచేసిన నేతలున్నప్పటికి ఆర్ధికంగాలేకపోవడంతో నేతలు పట్టించుకోలేదనే ఆపవాదనలున్నాయి. అంతేకాకుండా పోటీ నుంచి తప్పించుకున్నప్పటికి ప్రాధాన్యత లేని పార్టలో ఉండలేనని స్పష్టంగా కార్యకర్తలు చేబుతున్నారు.ఈతంతు కాంగ్రెస్(Congress)​, బీజేపీ(BJP), బీఆర్​ఎస్(BRS)​ పార్టీలో కనిపిస్తోంది. పదువుల వ్యామోహాంతో పాటు నగదు ఆశతో రెబల్​ బరిలోకి దిగిన కార్యకర్తలను బుజ్జగింపులతో నామినేషన్లు విత్​ డ్రా చేశారు. వార్డులల్లో ప్రభావం చూపే కార్యకర్తలకే ఇంచార్జీలుగా ఇస్తూ బరువు బాధ్యతలను అప్పగిస్తూ అభ్యర్ధులతో కలిసి ప్రచారం చేస్తున్నారు. వీరితో పాటు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జీలు మున్సిపాలిటీలోని ప్రతి వార్డుల్లో ప్రతి రోజు ప్రచారం జరిగేలా షెడ్యూల్ ఖరారు చేసుకుంటున్నారు.

సంక్షేమ పథకాలతోనే కాంగ్రెస్​ ప్రచారం..

అధికారం చేపట్టిన రెండేండ్లల్లో కాంగ్రెస్​ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే లక్ష్యంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. ప్రతి మున్సిపాలిటిల్లో ప్రజల ఎదుర్కోనే సమస్యలను గుర్తించి ప్రభుత్వం పరిష్కారిస్తుందని ప్రజలకు వివరించేందుకు స్ధానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలు కష్టాలు పడుతున్నారు. గత ప్రభుత్వంలో మున్సిపాలిటిలను ఏవిధంగా విచ్చిన్నం చేశారు. ధీర్ఘా కాలిక సమస్యలను పదేండ్లు ప్రభుత్వంలోనున్న బీఆర్​ఎస్​ ఎందుకు పరిష్కారించలేదనే విమర్శలకు పదునెత్తింది. పట్టణాలభివృద్ధికి ప్రత్యేక కార్యచరణను రాష్ట్ర ప్రభుత్వం రూపోందిస్తుందని ప్రజలకు మున్సిపాలిటీ ఇంచార్జీలు వివరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని అమనగల్లు, షాద్​నగర్… వికారాబాద్​ జిల్లాలోని కొడంగల్, వికారాబాద్​ మున్సిపాలిటీల్లో వార్ వన్​ సైడ్​గా ఉన్నట్లు ప్రచార శైలిని బట్టి కనిపిస్తోంది. ఈ మున్సిపాలిటీల్లో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సీరియసగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా తాండూర్ మున్సిపాలిటీ నువ్వా నేనా అన్నట్లు నడుస్తుంది. ఇక్కడ కూడా తాండూర్​ ఎమ్మెల్యే కూడా క్షేత్రస్ధాయిలో ప్రచారం చేస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలపై వివరిస్తున్నారు. సర్పంచ్​ ఎన్నికల్లో కూడా అత్యధిక స్ధానాలను ఏకగ్రీవం చేసుకోవడంలో తాండూర్​ టాప్​ అని చెప్పక తప్పదు. కానీ నియోజకవర్గంలో ఏకైక మున్సిపాలిటీ తాండూర్​ నియోజకవర్గ కేంద్రాన్ని దక్కించుకోవాలని తపన పడుతున్నారు.

Advertisement

Also Read: Netflix OTT : ‘ఇక్కా’ నుండి ‘ఫ్యామిలీ బిజినెస్’ వరకు…. ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్‌ ను షేక్ చేయనున్న సినిమాలు, సిరీస్లు ఇవే

చాలెంజ్ గా తీసుకున్న బీఆర్​ఎస్​..

గత పదేండ్ల బీఆర్​ఎస్​ ప్రభుత్వంలో మున్సిపాలిటిలను పట్టణ ప్రగతి పేరుతో అభివృద్ధి చేశామనే ప్రచారంతో ప్రజల్లోకి పోతున్నారు. పంచాయతీలను పట్టణాలుగా ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులు కేటాయించిన చరిత్ర బీఆర్​ఎస్​ ప్రభుత్వనికే దక్కుతుందన్నారు. ప్రతి ఇంటికి సంక్షమం అందించిన నాయకుడు మాజీ సీఎం కేసీఆర్​ అని వివరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు 420 హామీలను ప్రజలకు ఇచ్చిందని, ఆ హామీలు అమలు చేయడంలో విఫలమైయ్యారనే విషయాన్ని ప్రజలకు పూసగుచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా యువతను, మహిళను, వృద్ధులే లక్ష్యంగా చేసుకొని ప్రచారం చేస్తున్నారు. ఏడాదిలో లక్ష ఉద్యోగులను భర్తీ చేస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చి మొసం చేస్తున్నారు. అదేవిధంగా చదువుకునే యువతకు స్కూటీలు, మహిళాలకు ప్రతి నెల నగదు, వృద్ధులకు పెంచే పెన్షన్​ కాంగ్రెస్​ అమలు చేయడం లేదనే విమర్శలతో మున్సిపాలిటి ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు ఇవే ప్రధాన ఆస్త్రాలుగా చేసుకోని బీఆర్​ఎస్​ పట్టణాల్లోని ప్రజల ముందుకు వెళ్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, మొయినాబాద్​, శంకర్పల్లి… వికారాబాద్​లో పరిగి, తాండూర్​… మేడ్చల్ లోని మూడు మున్సిపాలిటీలను దక్కించుకునేందుకు మాజీ మంత్రలైన సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డిలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

పట్టణాల అభివృద్ధిలో కేంద్రం భాగస్వామ్యం..

Advertisement

రాష్ట్రంలో ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమంలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉందని బీజేపీ నేతలు ప్రచారంలో ఉపయోగిస్తున్నారు. ఇందరిమ్మ ఇండ్లు, పేదలకు పంపిణీ చేసే రేషన్​ బియ్యం తోపాట రోడ్లు అభివృద్ధి, పట్టణాల్లో ప్రజలకు అందించే నీటి సరఫరాకు ప్రత్యేక నిధులు కేంద్ర కేటాయిస్తుందన్నారు. కేవలం కాంగ్రెస్​ ప్రభుత్వం మాత్రమే ప్రజలకు సంక్షేమం అందిస్తలేదని చెప్పే ప్రయాత్నం బీజేపీ చేస్తుంది. మరిన్ని నిధులు కేంద్రం కేటాయించాలంటే బీజేపీతోనే సాధ్యమైతుందని ఆయా ఎంపీలు వివరిస్తున్నారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని వికారాబాద్​, పరిగి, చేవెళ్ల, మొయినాబాద్​, తాండూర్​ మున్సిపాలిటీలో సత్తా చాటేందుకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాల్కజిగిరి పార్లమెంట్ పరిధిలోని ఎల్లంపేట్, మూడు చింతలపల్లి, అలియాబాద్ మున్సిపాలిటీలను దక్కించుకవాలని ఎంపీ ఈటేల రాజేందర్​ తీవ్రంగా కృషి చేస్తున్నారు. బీఆర్​ఎస్, కాంగ్రెస్​ పార్టీలతో హోరా హోరీగా పోటీ పడుతూ ఎంపీ ఈటేల ప్రచారం చేస్తున్నారు. అమన్గల్ పట్టణంలో బీసీ కమీషన మాజీ సభ్యులు అచారీ కూడా బీజేపీని గెలిపించుకునేందుకు కాంగ్రెస్​, బీఆర్ఎస్​తో పోటీ పడుతున్నారు. షాద్​నగర్​, కొడంగల్ పట్టణాల్లో బీజేపీ పెద్దగా దృష్టి పెట్టలేదని తెలుస్తోంది. ​

Also Read: Traffic Jam: ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేపై ఆగని ట్రాఫిక్ నరకం.. 40 గంటలుగా నిలిచిపోయిన వాహనాలు!

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×