E-Paper
Advertisement

University Reforms: తెలంగాణలో మారనున్న యూనివర్సిటీల రూపురేఖలు.. ప్రభుత్వం ప్లాన్ ఇదే..?

University Reforms: తెలంగాణలో మారనున్న యూనివర్సిటీల రూపురేఖలు.. ప్రభుత్వం ప్లాన్ ఇదే..?
Advertisement

University Reforms: స్వేఛ్చ బ్యూరో: రాష్ట్రంలో యూనివర్సిటీల రూపురేఖలు మార్చేందుకు, చదువులో క్వాలిటీ పెంచడంపై సర్కార్ ఫోకస్ పెట్టింది. ప్రభుత్వలక్ష్య​యాలకు అనుగుణంగా హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ 100 రోజుల యాక్షన్ ప్లాన్ ను తెరపైకి తెచ్చింది. మాసబ్ ట్యాంక్ లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో బుధవారం అన్ని వర్సిటీల వైస్ చాన్స్ లర్లతో విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా, మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, కళాశాల విద్యాశాఖ సెక్రటరీ శ్రీదేవసేన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీసీలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ముందుగా అన్ని యూనివర్సిటీలు తాము చేసే ప్లాన్​ ను ప్రజెంట్ చేశాయి.

ఈ 100 రోజుల ప్లాన్‌..

ఈ సందర్బంగా యోగితారాణా వందరోజుల ప్లాన్ పై వివరించారు. స్టూడెంట్లు గ్లోబల్ లెవెల్ కాంపిటీషన్‌ను తట్టుకునేలా ఉండాలని, అందుకే ఫ్యూచర్ రెడీ తెలంగాణ-2047 లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. దీనికోసం అందరం కలిసి పనిచేద్దామని తెలిపారు. కేవలం సిలబస్ పూర్తి చేయడం మాత్రమే కాదని, పిల్లల్లో సబ్జెక్ట్ నాలెడ్జ్ పెరగాలని స్పష్టం చేశారు. ఈ 100 రోజుల ప్లాన్‌ను ఒక మిషన్ మోడ్‌లో అమలు చేయాలని ఆదేశించారు. పాత కాలం పద్ధతులు పక్కనపెట్టి.. క్లాసుల్లో లేటెస్ట్ టెక్నాలజీ వాడాలని యోగితా రాణా సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్, హైబ్రిడ్ లెర్నింగ్ మెథడ్స్ వాడి పాఠాలు చెప్పాలని తెలిపారు. డిగ్రీ చదివే ప్రతి స్టూడెంట్ కచ్చితంగా ఇంటర్న్‌షిప్ చేసేలా ‘యూనిఫైడ్ ఇంటర్న్‌షిప్ గ్రిడ్’ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో చదువు అయిపోగానే ఈజీగా జాబ్ వస్తుందన్నారు.

Advertisement

Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అంశం.. ఛార్జిషీటులో కేసీఆర్ పేరు? రేపో మాపో అరెస్టులు

సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలను ఏర్పాటు

ఇదిలా ఉండగా ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. వచ్చే విద్యా సంవత్సరం నాటికి వర్సిటీల్లో అడ్మిషన్లు పెంచడం, స్టూడెంట్ల డ్రాపౌట్స్ తగ్గించడం పైనే ప్రధానంగా ఫోకస్ పెట్టామని తెలిపారు. రీసెర్చ్ కోసం సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు, కార్పొరేట్ కంపెనీల సాయం తీసుకునేలా ప్లాన్ చేస్తున్నామన్నారు. కాగా, అన్ని యూనివర్సిటీల్లో ఒకేసారి అడ్మిషన్లు, పరీక్షలు ఉండేలా కామన్ క్యాలెండర్ అమలు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ఇటిక్యాల పురుషోత్తం, ఎస్​కే మహమూద్, సెక్రెటరీ శ్రీరామ్ వెంకటేశ్, విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి వెంకటేశ్ ధోత్రే, పలువురు వీసీలు ఘంటా చక్రపాణి, ఉమేష్ కుమార్, సూర్యధనుంజయ్, కిషన్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: Sree Leela: తల్లికి స్పెషల్ బర్త్ డే విషెస్ చెప్పిన శ్రీలీల.. ఊహించని సర్ప్రైజ్ ఇస్తూ!

Related News

కొత్త క్యూర్ చట్టంతో.. మేయర్, కౌన్సిలర్ల అధికారాలకు కోత!

సీబీఐ, ఈడీ అధికారులమంటూ మోసం.. రిటైర్డ్ ఉద్యోగికి రూ.29 లక్షల టోకరా!

మీ వీధిలో ప్రమాదకరంగా కరెంట్ తీగలు ఉన్నాయా.. అయితే మీకో గుడ్ న్యూస్!

ఎల్ నినో ఎఫెక్ట్‌ను తట్టుకునేలా తెలంగాణ మాస్టర్ ప్లాన్.. డ్రోన్లతో సర్వే!

స్కూటీని ఢీకొన్న కారు.. అన్నాచెల్లెళ్లు దుర్మరణం!

నీళ్లు, నిధులు, నియామకాలు కేసీఆర్ ఇంట్లోనే : ఎంపీ చామల

దీపావళి తర్వాత ఆ పనులన్నీటికి మోక్షం.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై అవన్నీ ఆన్‌లైన్ లోనే..?

Big Stories

Advertisement
×