E-Paper
Advertisement

Euphoria Movie Review : రివ్యూ: యుఫోరియా.. “గుణశేఖర్ గారు ఈసారి డాక్యుమెంటరీ తీసిండా ? సినిమా తీసిండా ? అసలు ముచ్చట ఇగో ఇదీ!”

Euphoria Movie  Review : రివ్యూ: యుఫోరియా.. “గుణశేఖర్  గారు ఈసారి డాక్యుమెంటరీ తీసిండా ? సినిమా తీసిండా ? అసలు ముచ్చట ఇగో ఇదీ!”
Advertisement

Euphoria Movie Review : రివ్యూ: యుఫోరియా.. “గుణశేఖర్ గారు ఈసారి డాక్యుమెంటరీ తీసిండా ? సినిమా తీసిండా ?

అసలు ముచ్చట ఇగో ఇదీ!”

 

కథ ఏందంటే :

చైత్ర (సారా అర్జున్) అనే ఒక పద్దతి గల పిల్ల, పార్టీకి పోయి వికాస్ (విఘ్నేష్) అనే డ్రగ్స్ బ్యాచ్ చేతిలో చిక్కుకుంటుంది. మత్తులో ఉన్న ఆ ఐదుగురు దోస్తులు ఆమెపై దారుణంగా అత్యాచారం చేస్తారు. మరి ఈ కేసును పోలీస్ కమిషనర్ జయదేవ్ (గౌతమ్ మీనన్) ఎట్లా డీల్ చేసిండు? అసలు భూమిక కోర్టు మెట్లు ఎందుకు ఎక్కింది? తప్పు చేసిన కొడుకును ఒక తల్లిగా ఆమె ఎట్లా మార్చాలనుకుంది? అనేదే ఈ సినిమా పంచాయితీ.

విశ్లేషణ :

Advertisement

నిజ జీవితంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని తీసిన సినిమా ఇది. ట్రైలర్‌లోనే కథ ఏందో చెప్పేసిన్రు కాబట్టి, తెర మీద ఎట్లా చూపిస్తరా అని అందరూ ఎదురుచూసిన్రు. సినిమా కొంతసేపు సీరియస్ డ్రామాలాగా, ఇంకొంతసేపు డాక్యుమెంటరీలాగా సాగుతది.

ప్లస్ పాయింట్స్ :

భూమిక పర్ఫార్మెన్స్:
గౌతమ్ మీనన్: కమిషనర్‌గా ఆయన లుక్,
క్లైమాక్స్: సినిమా చివర్లో వచ్చే సీన్లు కచ్చితంగా అందరినీ ఆలోచింపజేస్తాయి.
మ్యూజిక్: కాల భైరవ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సీన్లను బాగా ఎలివేట్ చేసింది.

Advertisement

Read also-Yellamma: దేవీను ఢీ కొట్టడానికి సిద్ధమైన స్టార్ హీరో..వేణు ఆలోచనలు అదుర్స్!

మైనస్ పాయింట్స్ : 

తెలిసిన కథే పేపర్లలో, టీవీల్లో చూసిన వార్తల్నే మళ్లీ చూస్తున్నట్టు అనిపిస్తది.
కొత్తదనం తక్కువ.
ఎమోషన్స్: ఇంకాస్త బలంగా గుండెలకు హత్తుకునేలా తీసి ఉంటే బాగుండేది.
సెకండాఫ్‌లో కొన్ని సీన్లు సాగదీసినట్టు అనిపిస్తాయి.

అసలు ముచ్చటకు వస్తే :

డ్రగ్స్ వల్ల లైఫ్స్ ఎట్లా ఆగమైతాయో, ఆడపిల్లల మీద జరిగే అన్యాయాల వెనుక ఉన్న అసలు కారణాలేందో గుణశేఖర్ గారు గట్టిగానే చెప్పాలనుకున్నరు. డాక్యుమెంటరీ స్టైల్‌లో ఉన్నా కూడా.. ఇవాల్టి యువత, ముఖ్యంగా కన్నవాళ్లు కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. కమర్షియల్  గా ఏమో ?

 

బాటమ్ లైన్ : సందేశం బాగుంది.. కాకపోతే డ్రామా ఇంకాస్త దట్టించాల్సింది ఉండే !

 

Euphoria Movie Review -2/5

Related News

Romanchakam Review : ‘రోమాంచకం’.. నవ్వుల ప్రయాణం..

సుమంత్ ప్రభాస్ ‘రోమాంచకం’ ట్విట్టర్ రివ్యూ..

‘కికు చిరంజీవి’ మూవీ రివ్యూ.. గుండె కుడివైపు ఉంటే.. రహస్యం ఎటువైపు దారితీసింది?

టాక్సిక్’ రివ్యూ.. గీత దాటలేదు, కానీ ఓపిక మాత్రం దాటింది!”

ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?

అమీర్ లోగ్ మూవీ రివ్యూ.. పాతబస్తీ గల్లీ స్నేహం వర్కౌట్ అయ్యిందా?

రవితేజ ‘ఇరుముడి’ రివ్యూ.. అయ్యప్పమాల కలిసొచ్చిందా?

పళ్ళ బురుసు మూవీ రివ్యూ..చిన్న బ్రష్.. పెద్ద గొడవ.. అసలు కథ ఏంటంటే?

Big Stories

Advertisement
×