E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అవనిని అవమానించిన భానుమతి.. పల్లవికి వార్నింగ్.. దిమ్మతిరిగే న్యూస్ చెప్పిన అభి..

Intinti Ramayanam Today Episode: అవనిని  అవమానించిన భానుమతి.. పల్లవికి వార్నింగ్.. దిమ్మతిరిగే న్యూస్ చెప్పిన అభి..
Advertisement

Intinti Ramayanam Today Episode February 6th: నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ అవని ఇంటికి రావడంతో ఏంట్రా నువ్వు హాస్పిటల్ లో ఉండకుండా ఇంటికి వచ్చావు అని అడుగుతుంది. పోలీసులు రమ్మని పిలిచారు అందుకే నేను పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సి వచ్చింది అని అక్షయ్ అంటాడు. ఆ తర్వాత పోలీసులు ఎందుకు రమ్మన్నారు అని పార్వతి అడుగుతుంది.. నాన్నది సూసైడ్ కాదంటమ్మా ఎవరో చంపాలని ప్లాన్ చేశారంట అని చెప్పగానే పల్లవి షాక్ అవుతుంది.. ఏంటి మావయ్య ను ఎవరో చంపాలి అనుకున్నారా అని పల్లవి సీన్లోకి ఎంట్రీ ఇస్తుంది..  ఏంటి మావయ్య గాని ఎవరో చంపాలి అనుకున్నారా ఎవరు అంత ధైర్యం ఎవరు చేశారు అని పల్లవి అంటుంది. అదే గనక నిజమైతే వాళ్ళు ఎవరో తెలియాలి ముక్కలు ముక్కలు నరికేస్తాను అని కమల్ అంటాడు.

అది విన్న పల్లవి షాక్ అవుతుంది. అయినా దేవుడిగారి లాంటి మామయ్యని ఎవరు చంపాలనుకుంటారు అని పల్లవి అంటుంది.. వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగా ఒకతను వచ్చి డాక్యుమెంట్స్ దొరికాయి అని చెప్పడంతో అందరూ ఏంటా డాక్యుమెంట్స్ అని అనుకుంటారు.. అందులో ఆస్తి 81% అవని పేరు మీద ఉండడంతో షాక్ అవుతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. డాక్యుమెంట్స్ ఒరిజినలా కాదా అన్నది తెలుసుకోవాలి అని అంటాడు.. ఇది ఎలాగైనా సరే అవి చెప్పి అసలు నిజాలని కనిపెట్టాలని అక్షయ్ అనుకుంటాడు. అభి కి ఫోన్ చేసి అక్షయ్ రమ్మని పిలుస్తాడు. కామెంట్స్ గురించి చెప్పగానే వాటి గురించి నేను కనుక్కుంటాను అని అభి అంటాడు.. ఆ తర్వాత శ్రియ భానుమతి ఇద్దరు కూడా అవనీని దారుణంగా తిడతారు.. భానుమతి పల్లవి శ్రీయ ఆ ముగ్గురు కూడా అవని కావాలనే ఆస్తి రాయించుకుంది అంటూ దారుణంగా అవమానించేలా మాట్లాడుతారు… అవని ఇలాంటి తప్పు చేస్తుందని అసలు అనుకోలేదు అంటూ భానుమతి అనుకుంటుంది.. భానుమతికి సపోర్టుగా పల్లవి నిలవడంతో ఇంకాస్త రెచ్చిపోయి అందరూ కూడా అవనీని అవమానిస్తారు.

అప్పుడే అక్కడికి వచ్చిన అక్షయ్ మీరు నా భార్య గురించి ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు అని అక్షయ్ అంటాడు. అసలు అవనీయ చేసిందని రుజువు ఎక్కడ మీరు ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అని అక్షయ్ అంటాడు.. ఇప్పటికీ నువ్వు నీ భార్యని వెనకేసుకుని వస్తున్నావా ఇంత జరిగినా కూడా నీకు బుద్ధి లేదా అని భానుమతి అంటుంది.. నా భార్య గురించి నాకు బాగా తెలుసు మీరు ఎవరు అనాల్సిన అవసరం లేదు అని అక్షయ అవనీని తీసుకొని వెళ్తాడు. ఇక రాత్రి అవగానే ఆ డాక్యుమెంట్స్ మీద సంతకాలు ఎవరు చేయించారు అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే పల్లవి అనుమానంగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది..

Advertisement

పల్లవి ఇదంతా చేసి ఉంటుందా అని అవనికి అనుమానం వస్తుంది. పల్లవి దగ్గరికి వెళ్లి నీతో మాట్లాడాలి అని అనుకుంటుంది. ఇదంతా నువ్వు చేసావని నీలాంటి కుట్రలు చేసే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి… నువ్వే ఇదంతా చేసావని నా అనుమానం అంటూ పల్లవిని అడుగుతుంది అవని.. అయితే నా మీద నీకెందుకు అనుమానం వచ్చింది ఇదంతా నువ్వే చేసావు అని అందరూ అంటున్నారు కదా అని పల్లవి అంటుంది.. అసలు ద్రోహి ఎవరో తెలిస్తే మాత్రం అస్సలు ఊరుకోను అని అంటుంది అంటుంది.. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం విన్నా కమల్ పల్లవి నీదంతా చేసిందని అనుమాన పడతాడు.. మొత్తం చేసింది ఎవరో తెలియాలి ఆ తర్వాత వాళ్లకు ఇవ్వాల్సింది ఇస్తాను అని కమల్ ఇండైరెక్టుగా పల్లవికి వార్నింగ్ ఇస్తాడు..

Also Read :మహాను అర్థం చేసుకున్న మాధవ్.. తాయారు శాపం నిజమైందా..?చివరిలో ట్విస్ట్..

ఉదయం లేవగానే అందరూ హాస్పిటల్ కి వెళ్లాలని అనుకుంటారు. కానీ అప్పుడే అభి లోపలికి రావడంతో ఏంటి సార్ ఎందుకు వచ్చారు ఏమైనా పని పడిందా అని కమల్ అడుగుతాడు.. అయితే చే తో మాట్లాడడానికి వచ్చాను అని అవి అంటాడు. ఈ సంతకాలు అవని చేయించలేదు.. రాజేంద్రప్రసాద్ సంతకాలు ఇవి కావు ఫ్లోరెన్స్ క్లబ్ కి పంపిస్తే అవి కావు అని తేల్చేశారు అని అక్షయతో చెప్తారు.. అయితే ఎవరు ఇది చేశారో తెలుసుకోవాలంటే మీరందరూ సంతకాలు పెట్టాలి అని అంటారు.. ఈ రెండిటిని మ్యాచెస్ చూస్తే ఎవరు ఫోర్జరీ చేశారో తెలిసిపోతుంది అని అభి అంటాడు కానీ అక్షయ్ మాత్రం నా భార్య చేయలేదని తెలిసిపోయింది కదా.. నా భార్య ఎప్పుడూ ఏ తప్పు చేయదు అని అక్షయ్ అంటాడు అందరూ కూడా అవన్నీ తప్పేమీ లేదని తెలుసుకొని మౌనంగా ఉండిపోతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×