E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: ఎంగేజ్మెంట్ ఆపేందుకు భాగ్యం ప్లాన్.. ఫోటోల ప్లాన్ వర్కౌట్ అవుతుందా..? హమ్మయ్య ప్రేమ సేఫ్..

Illu Illalu Pillalu Today Episode: ఎంగేజ్మెంట్ ఆపేందుకు భాగ్యం ప్లాన్.. ఫోటోల ప్లాన్ వర్కౌట్ అవుతుందా..? హమ్మయ్య ప్రేమ సేఫ్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode January 19th: నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీవల్లి మాత్రం ఎలాగైనా సరే అమూల్య ఎంగేజ్మెంట్ ని చెడగొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. శ్రీవల్లి భాగ్యం ఇద్దరూ కూడా పెళ్లి కొడుకు ఇవ్వాల్సిన బట్టలు ఎక్కడున్నాయో వెతుకుతారు. అయితే ఈ ఫోటోలు పెట్టింది నేనే అని తెలిస్తే నా బతుకు నాశనం అవుతుంది అని శ్రీవల్లి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఆ బట్టలలో విశ్వక్, అమూల్య ఫోటోలను పెట్టేందుకు ప్రయత్నిస్తుంది శ్రీవల్లి.. ఆ బట్టలను తీసుకొని రమ్మని చెప్పగానే నర్మదా వస్తుంది. జస్ట్ శ్రీవల్లి తప్పించుకుంటుంది. నర్మదకు మాత్రం శ్రీవల్లి మీద అనుమానం మొదలవుతుంది.. శ్రీవల్లి మాత్రం తను బతికిపోయాను అని అనుకుంటుంది. ప్రేమ ఎంగేజ్మెంట్ ఉంగరాల కోసం అని లోపలికి వస్తుంది. అక్కడ భాగ్యం ఉండడంతో ఏం జరిగిందని అనుకుంటుంది. ఇంట్లోని ప్రతి ఒక్కరికి నేను చెప్పలేకపోతున్నాను నాకు జలుబు చేసింది తుమ్ములు వస్తున్నాయి అందుకే ఇక్కడ ఉన్నాను అని భాగ్యం అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ప్రేమ నర్మదలకు మాత్రం ఇక్కడ అందరూ ఉన్నారు ఆ శ్రీవల్లి మాత్రం లేదు అని అనుమాన పడుతుంది. వీళ్ళిద్దరూ కలిసి ఈ పెళ్లిని ఆపేందుకు ఏవో ప్రయత్నాలు చేస్తున్నట్లు నాకు అనిపిస్తుంది అని ప్రేమ అంటుంది. అవును ప్రేమ నువ్వు చెప్పింది కూడా నిజమే.. వాళ్ళిద్దరూ ఏదో చేస్తున్నారని అర్థమవుతుంది.. ఇక వాళ్ళిద్దరి ఆట కట్టించడానికి మనం ఏదో ఒకటి చేయాలి. ఎంగేజ్మెంట్ ని ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయాలి అని ప్రేమ అంటుంది. వాళ్ళు ఎలాంటి ప్లాన్ చేసినా మనం తిప్పి కొట్టి ఈ నిశ్చితార్థాన్ని పూర్తి చేస్తే అమూల్య పెళ్లి సజావుగా సాగిపోతుంది అని నర్మదా అనుకుంటుంది.. బల్లి అక్క ఎక్కడుందో ఒకసారి తెలుసుకోవాలి అని ఇద్దరు కలిసి వెతుకుతూ ఉంటారు.

Advertisement

భాగ్యం దగ్గరికి ఆనందరావు వస్తాడు. అతను ఏమైంది భాగ్యం చెప్పు ఏం చేయమన్న నేను ఇట్లే చేసేస్తాను అని అంటాడు. నువ్వు చేయాలి అంటే నీకు కొంచెం బుర్ర ఉండాలి ఎలాగో నీకు అది లేదు కదా అందుకే నీకు ఏది చెప్పట్లేదు అని భాగ్యం అంటుంది. ఈ ఫోటోలను మనం పెట్టినట్టు కాకుండా ఎవరికి తెలియకుండా అక్కడ పెట్టాలి అని భాగ్యం అంటుంది. అయితే అప్పుడే కామాక్షి బ్రీఫ్ కేస్ ని చూసిన తిరుపతి అందులోని సామాన్లు అన్నిటిని బయటపెట్టి దాన్ని విసిరేస్తాడు. అది నేరుగా వచ్చి ఆనంద్ రావు ని గుద్దుకుంటుంది. దాంతో అతను ఎక్కడ తగిలిందో తెలియట్లేదు అని బాధపడిపోతూ ఉంటాడు. ఆ ఫోటోలు కాస్త కింద పడిపోవడంతో అక్కడున్న పిల్లలు వాటిని తీసుకుంటారు.

ఆ పిల్లలు ఆ ఫోటోలను తీసుకొని బయట పరిగెడుతూ ఉంటారు. ఆ ఫోటోలను చూసిన ప్రేమ విశ్వబ్ అమూల్య ఫోటోలు ఈ పిల్ల చేతికి ఎలా వచ్చినాయి అనుకుంటూ ఆ అమ్మాయి దగ్గర ఫోటోలు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. తను కంగారుగా పరిగెడుతూ ధీరజ్ని గుద్దుకుంటుంది ఇక ధీరజు ప్రేమతో ఒక ఆట ఆడుకుంటాడు. ఆ ఫోటోలు ఎక్కడ పెళ్లి వాళ్ళకి దొరికిపోతాయి అని కంగారు పడిపోయిన ప్రేమ.. ధీరజ్ నుంచి తప్పించుకొని పరిగెడుతూ ఉంటుంది ఎదురుగా నర్మద రావడంతో ఫోటోల విషయాన్ని నర్మదతో చెప్తుంది.

Advertisement

Also Read : పల్లవి పై అవనికి అవమానం..పల్లవి ప్లాన్ సక్సెస్.. నడుం విరగొట్టిన భానుమతి..

ఆ ఫోటోలు కచ్చితంగా పెళ్లి వాళ్ళ ముందు పడతాయి. అయితే అవి బోర్లు పడడంతో నర్మద ప్రేమలు ఇద్దరు సేఫ్ అని అనుకుంటారు. తని శ్రీ వల్లి వెళ్లి ఫ్యాన్ వేయడంతో అవి రివర్స్ అవుతాయి అది చూసినా నర్మదా వాటిపై స్వీట్ ప్లేటు పెడుతుంది. మొత్తానికి అమూల్య ఎంగేజ్మెంట్ వనజ కొడుకుతో గ్రాండ్గా జరుగుతుంది. ఇద్దరు కలిసి చాలా సంతోషంగా కనిపిస్తారు. అమూల్య ఎంగేజ్మెంట్ పూర్తవడంతో ఇంట్లోని వాళ్ళందరూ ఆటపాటలతో డాన్సులతో సందడిగా ఉంటారు. వనజ నా కోడలికి నా ఇంటి నుంచి వచ్చిన డబ్బులతో నగలు చేయించాలని రామరాజుకు 20 లక్షల డబ్బులను ఇస్తుంది. అది చూసిన శ్రీవల్లి షాక్ అవుతుంది. అమూల్య ఎంగేజ్మెంట్ జరిగిందని విశ్వం షాక్ అవుతాడు. ఇంట్లోని వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×