E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి షాక్.. మరోసారి బుట్టలోపడ్డ కామాక్షి.. ప్రేమ, ధీరజ్ ల డ్రీమ్..

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి షాక్.. మరోసారి బుట్టలోపడ్డ కామాక్షి.. ప్రేమ, ధీరజ్ ల డ్రీమ్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode January 7th: నిన్నటి ఎపిసోడ్ లో.. కాలికి పోయే తీగని ఇలా తగిలించుకోవడం అంటే ఇదే.. నా నెత్తిన తెచ్చిపెట్టారు ఇప్పుడు నేను బాధపడాలి అని శ్రీవల్లి అంటుంది.. ఆ తర్వాత రామరాజు పెళ్లి చూపులు వాళ్ళు వస్తున్నారని వేదవతి తో అంటాడు. ఈ పెళ్లి జరిగితే అమూల్య జీవితం బాగుంటుంది అని అంటాడు.. అయితే అమూల్య సంతోషం కన్నా మనకు ఏం కావాలండి మీరు ఎలా చెప్తే అలానే చేద్దాం అని వేదవతి అంటుంది. ఆ తర్వాత తిరుపతి తన సౌందర్య లహరి తో ఫోన్ మాట్లాడుతాడు.. అతను మాట్లాడడం వినిన అల్లుళ్ళు ఆటపట్టిస్తారు.. ఒకసారి ఈ వీడియో కాల్ చేయవా అని సౌందర్యలహరిని తిరుపతి అడుగుతాడు.. కానీ సాయంత్రం కలుద్దాము అని తను చెప్తుంది.. మామ గంటలు గంటలు ఫోన్ మాట్లాడుతున్నాడు అసలు ఎవరు ఆమీడ అనేది తెలుసుకోవాలి అని అనుకుంటారు. తిరుపతి మాత్రం నా సౌందర్యలహరిని సాయంత్రం చూడబోతున్నాను నాకు సిగ్గేస్తుంది అబ్బా ఇప్పటినుంచే పౌడర్ కొట్టుకొని రెడీగా ఉంటాను అని అంటాడు.. పెళ్లి చూపుల్ని చెడగొట్టేందుకు భాగ్యం ఆనందరావు గెటప్పులు మార్చుకొని ప్లాన్ చేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. శ్రీవల్లి మాత్రం వాళ్లు ఇక రారు అని అనగానే వేదవతి షాక్ అవుతుంది. అక్కడ పెళ్లి వాళ్ళు వచ్చారు లేదా వెళ్లి చూడు అని అంటుంది వేదవతి. ఇక శ్రీవల్లి బయటికి వెళ్లి రామరాజు వాళ్ళు టెన్షన్ పడుతుండడం చూసి పెళ్లి వాళ్ళు ఇంకా రాలేదని అనుకుంటుంది.. వాళ్లు ఇక రారు అని సంతోష్ పడిపోతూ ఉంటుంది. ఇక తర్వాత వాళ్ళు రాగానే శ్రీవల్లి షాక్ అవుతుంది.. ఏంటండీ మీకు ఫోన్ చేస్తున్న కాని మీరు తీయట్లేదు అని రామరాజు అంటాడు.. వీళ్ళేంట్రా బాబు రారనుకుంటే వచ్చేసారు అని శ్రీవల్లి టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. లోపలికి రండి అని రామరాజు అందర్నీ లోపలికి తీసుకొని వెళ్తాడు.. ఈ మాత్రం దేవుడా ఏం జరిగిందో అసలు రారు అనుకుంటే ఇలా వచ్చారు ఏంటి అని కంగారు పడిపోతూ ఉంటుంది..

Advertisement

ఇక లోపలికి వెళ్ళగానే శ్రీవల్లి మాత్రం ఏమైంది ఈ అమ్మ ఎక్కడికి చచ్చింది నన్ను కొంప కొల్లేరు చేసేటట్టు ఉంది అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. అప్పుడే అక్కడికి భాగ్యం ఆనందరావు వస్తారు.. మీరు చేసింది ఏంటి మీరు గెటప్పులు మార్చుకొని వెళ్లి వాడిని చెడగొడతామని ఏదేదో కోతలు కోశారు అని అంటుంది. మేము ప్రయత్నం చేశాం అమ్మడు కానీ అక్కడ ఏం జరిగింది అనేది వివరిస్తుంది భాగ్యం. రామరాజు కూతురు పెళ్లికి వెళ్తున్నారా అని అతనితో మాట్లాడుతూ ఉండగా వాళ్ళ ఆవిడ వచ్చి చెవిటి మిషన్ పెట్టుకోండి అని అంది.. అంతలోపే ధీరజ్ ప్రేమ రావడంతో మేము అక్కడి నుంచి వచ్చేసాము అని వాళ్ళు చెప్తారు.. మీరు ఉండాల్సిన వల్లే అసలే టెన్షన్తో తట్టుకోలేకపోతున్నాను ఇప్పుడు ఇలాంటి తలనొప్పి తెచ్చి పెట్టారని శ్రీవల్లి తిడుతూ ఉంటుంది.

అప్పుడే విశ్వం మైకు పట్టుకుని మాట్లాడడంతో శ్రీవల్లి షాక్ అవుతుంది.. వీడొకడు సందు దొరికితే నన్ను ఎలా ఇరికించాలని చూస్తుంటాడు. అరే నాయనా కాసేపు ఆగరా బండ సచ్చినోడా అని శ్రీవల్లి తిడుతూ ఉంటుంది. కానీ వాడు అమూల్య కి ఫోన్ చేసి శ్రీవల్లిని పిలవమని చెప్తాడు.. గెట్టిగారిస్తే తెలిసిపోతుందని అమూల్య ఇస్ అని అంటుంది. ఇక్కడ నాగుపాము ఎక్కడో బుసలు కొట్టేటట్టు ఉంది అని వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు. అప్పుడే అమూల్య పిలుస్తుంది.. విశ్వం లైన్లో ఉన్నాడు వదిన నీతో మాట్లాడాలని అనుకుంటున్నాడని అమూల్య అంటుంది.

Advertisement

ఈ పెళ్లి చూపులు కనక చెడగొట్టలేదనుకో కచ్చితంగా నువ్వే ఇదంతా చేసావని అందరికీ మైక్ లో చెప్పేస్తానని విశ్వం బెదిరిస్తాడు. దాంతో శ్రీవల్లి కంగారు పడిపోతూ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అమ్మోయ్ అని ఏడుస్తూ ఉంటుంది. భాగ్యం వెంటనే కామాక్షి రాలేదు కదా కామాక్షిని రంగంలోకి దించాలి అని అంటుంది.. శ్రీవల్లి కామాక్షి దగ్గరికి వెళ్లేసి మీ చెల్లెలు పెళ్లి చూపులను అర్జెంటుగా రావాలని తీసుకొస్తుంది.. ఇక పెళ్లిచూపులు వాళ్ళ ఇంట్లోకి రాగానే రామరాజు ఏం చెప్పినా సరే పెళ్ళికొడుకు తండ్రి మాత్రం నవ్వుతూ ఉంటాడు. ఇదేదో తేడాగా ఉంది అని తిరుపతి కూడా ఆలోచిస్తూ ఉంటాడు.. అమ్మాయిని తీసుకురండి అని వాళ్ళు అడుగుతారు.

Also Read :అవనికి ఘోర అవమానం.. అమ్మవారిలాగ మారిన అవని.. పల్లవి దొరికిపోతుందా..?

ప్రేమ నాకు ధీరజ్ కి పెళ్లి చూపులు జరగలేదు కదా అని సిగ్గు పడిపోతూ ఉంటుంది.. ఒకవేళ మా ఇద్దరికి పెళ్లిచూపులు జరిగితే ఎలా ఉంటుందో అని ఆలోచించుకుంటూ ఉంటుంది.. వాళ్ళిద్దరికీ వాళ్ల ఇంట్లో పెళ్లిచూపులు జరిగితే ఎలా ఉంటుందని ఊహించుకుంటుంది.. ప్రేమ ఊహల్లో పెళ్లిచూపులు సరదాగా ఉంటాయి. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Big Stories

Advertisement
×