E-Paper
Advertisement

Telangana News: తెలంగాణ కాంగ్రెస్ నేత సునీల్ కుమార్ అరెస్ట్.. ఆయన్ని విచారిస్తున్న అధికారులు

Telangana News: తెలంగాణ కాంగ్రెస్ నేత సునీల్ కుమార్ అరెస్ట్..  ఆయన్ని విచారిస్తున్న అధికారులు
Advertisement

Telangana News:  జీఎస్టీ పన్ను ఎగవేత కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేత సునీల్ కుమార్ అరెస్టు అయ్యారు. దాదాపు రూ. 28 కోట్ల పన్ను ఎగవేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ గా ఉన్నారు. అంతేకాదు ఆరెంజ్ ట్రావెల్స్ కంపెనీ ఎండిగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సునీల్ కుమార్‌ను విచారిస్తున్నారు జీఎస్టీ ఇంటలిజెన్స్ అధికారులు.

తెలంగాణ కాంగ్రెస్ నేత సునీల్ కుమార్ అరెస్ట్

Advertisement

ఇయర్ ముగింపు రావడంతో పన్ను ఎగవేత దారులపై జీఎస్టీ అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలో పన్ను ఎగవేస్తున్నవారికి నోటీసులు ఇస్తున్నారు. నోటీసులకు స్పందించని వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నేత, బాల్కొండ నియోజకవర్గం ఇన్ ఛార్జ్ సునీల్ కుమార్‌ని అరెస్టు చేశారు జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు.

Advertisement

ఆరెంజ్ ట్రావెల్ ఓనరైన సునీల్‌కుమార్, దాదాపు రూ. 28 కోట్ల పైచిలుకు పన్ను ఎగవేసినట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అధికారులు నోటీసులు ఇచ్చినా ఆయన స్పందించలేదని సమాచారం. చివరకు బుధవారం ఉదయం ఆయన్ని అదుపులోకి తీసుకున్నారట.  ప్రస్తుం జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం ఆయన్ని విచారణ చేస్తోంది. 

జీఎస్టీ పన్ను ఎగవేత.. ఆయన్ని విచారిస్తున్న అధికారులు

గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు సునీల్‌కుమార్. బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆయన్ని ఓడించారు. అయితే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలను గమనించిన ఆయన మూడేళ్లు కిందట బీజేపీలోకి చేరాలని భావించారు. ఎందుకోగానీ అక్కడి ఎంపీ అడ్డుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. బహుశా వ్యాపారం నిమిత్తం కమలం తీర్థం పుచ్చుకోవాలని భావించారట ఆయన.

దీన్ని ముందుగానే పసిగట్టిన సదరు ఎంపీ అడుగడుగునా అడ్డుపుల్ల వేసినట్టు పొలిటికల్ సర్కిల్స్ ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ఏకంగా జీఎస్టీ అధికారులు ఆయన్ని అరెస్టు చేశారు.  సునీల్‌ కుమార్ అరెస్టుతో కొందరు నేతల్లో గుబులు మొదలైంది. రాజకీయాల్లో ఉంటూ వ్యాపారాలు చేస్తున్న పలువురు నేతల్లో టెన్షన్ మొదలైంది. పన్ను ఎగవేస్తే తమను అరెస్టు చేస్తారేమోనన్న భయం వాటిని వెంటాడుతోంది.

ALSO READ: కవిత రాజీనామాను ఆమోదించిన మండలి ఛైర్మన్ గుత్తా

 

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×