BigTV English

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, సేన కుటుంబాల మధ్య గొడవ.. అవమానంతో కన్నీళ్లు పెట్టుకున్న రామరాజు..

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, సేన కుటుంబాల మధ్య గొడవ.. అవమానంతో కన్నీళ్లు పెట్టుకున్న రామరాజు..
Advertisement

Illu Illalu Pillalu Today Episode july 14th: నిన్నటి ఎపిసోడ్ లో… కోడలు సంపాదనతో ఇల్లు గడుపుకోవాలి అని చూస్తున్నావా? కూతుర్ని ఎలా పెంచానో తెలుసా? నువ్వు ఇలా చేస్తావని అస్సలు ఊహించలేదు కొంచెమైనా సిగ్గుందా అని సేన రెచ్చిపోయి మాట్లాడుతాడు. రామరాజు కుటుంబ సభ్యులు అందరూ అప్పుడే ఒక్కొక్కరుగా ఇంటికి వచ్చేస్తారు. ఏమైంది ఎందుకు అరుస్తున్నావు అని అంటే.. నా కూతురు చేత జాబ్ చేస్తున్నావా అని సేన అడుగుతాడు. నేను అమ్మాయిని ఎప్పుడో జాబ్ మానేయమని చెప్పాను మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎవరో చెప్పిన మాటలు విని నన్ను అంటున్నారు అని రామరాజు చెప్తాడు. ప్రేమను రామరాజు జాబ్ చేస్తున్నావా అని అడుగుతాడు.. ప్రేమ చేస్తున్నాను అని చెప్తుంది. ఆ తర్వాత మాటలు యుద్ధం జరుగుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రామరాజు కుటుంబం పై సేనాపతి, భద్రావతి గొడవకు దిగుతారు. మాటలతో సేనా రెచ్చగొడతాడు. ఏంట్రా నోటికొచ్చినట్టు వాగుతున్నావ్ అని రామరాజు అంటే.. వాగడం కాదురా.. ముక్కలుగా నరికేయాలన్నంత కోపం వస్తుంది అని అంటాడు సేనాపతి. ‘ఏంట్రా నరుకుతావా? నరుకూ అని ముందుకు వెళ్తాడు రామరాజు. ఒరేయ్ సేనా.. ఎన్నాళ్లురా ఇలా? ఎప్పుడూ ఈ గొడవలేంట్రా.. ఇంత చిన్న విషయానికి అని అంటుంది శారదాంబ. ఏంటీ చిన్న విషయమా? వీళ్లు నా మేనకోడల్ని హింస పెట్టడం చిన్న విషయమా? అని అంటుంది భద్రావతి. ఆ మాటతో వేదవతి కల్పించుకుని..

ఇదిగో అది నీకే కాదు.. నాకూ మేనకోడలే ముందు అది గుర్తుపెట్టుకో.. నీ కన్నా ఎక్కువగా నేనే దాన్ని బాగా చూసుకుంటున్నాను అని వేదవతి అంటుంది. నా మేన కోడలిని బయటకు పంపించి ఉద్యోగం చేపిస్తున్నారా అని అడుగుతుంది. దానిపై సీరియస్ అయినా రామరాజు.. ఏం మాట్లాడుతున్నావ్.. మతి ఉండే మాట్లాడుతున్నావా? కాలేజ్‌కి వెళ్లి చదువుకుంటున్న పిల్లని పట్టుకుని పని చేస్తుందని అంటావ్ ఏంటీ? అని అంటాడు. ఎహే ఆపరా నీ డ్రామాలు.. నా కూతురు బయటకు వెళ్లి డాన్స్ క్లాస్‌లు చెప్తుంది ఆ విషయం మాకు తెలియదని అనుకుంటున్నావా? కోడలితో పని చేయించుని.. దాని సంపాదనపై బతకడానికి సిగ్గుగా అనిపించడం లేదా? అని అంటాడు సేన..


ఆ తర్వాత నా కూతురు నగలు నీ ఇంట్లోనే ఉన్నాయి అని అంటాడు సేన.. ఏంట్రా నీ బాబు పెద్ద ధర్మరాజు అన్నట్టు మాట్లాడతావ్.. వాడు అంత గొప్పేడే అయితే. రోషం పౌరుషం ఉంటే మా అమ్మాయి నగల్ని మాకు ఇచ్చేసేవాడు అని అంటాడు సేనాపతి..నా మరదలితో నగల్ని నీ ఇంటికి రప్పించుకున్నావ్.. చాలా తెలివిగా ఆ నగల్ని కొట్టేశావ్.. పరాయి వాళ్ల సొమ్ముని కాజేసే నీదీ ఓ బతుకేనా? ఛీ ఛీ అని అంటుంది భద్రావతి.. తండ్రి నీ నాట మాటలు అంటుంటే కొడుకులు సేనపై గొడవ దిగుతారు.
అయితే నగల గురించి అందరూ కొట్టుకుంటారు. రామరాజు మాత్రం మౌనంగా ఉండిపోతాడు. శారదాంబ ఇలాంటివన్నీ చూడడానికేనా నేను బతికుండేది మీ నాన్నతో పాటు నేను కూడా పోయి ఉంటే బాగుండేది అని గట్టిగా అరవడంతో గొడవని ఆపేసి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లిపోతారు.. ఇంట్లోకి వెళ్ళగానే రామరాజు ఇలాంటి మాటలు పడాలని రా మీరు దారిలో ఉండాలి మంచిగా బతకాలని నేను కోరుకుంటున్నాను.. కోడలి నగలతో నేను ఇంటిని గడుపుతున్నానా..? అందరి చేత నన్ను ఇన్ని మాటలు అనిపిస్తున్నారే మీకు నేను ఏం ద్రోహం చేశాను అని రామరాజు కన్నీళ్లు పెట్టుకుంటాడు.

ఏవండీ అని వేదవతి అనగానే నువ్వు నాతో మాట్లాడొద్దు బుజ్జమ్మ ఈ లోకంలో నా నిన్ను తప్ప నేను ఎవరిని నమ్మలేదు. నాకోసం మీ వాళ్ళందరినీ వదిలేసుకుని వచ్చావని నిన్ను ఎంతో గొప్పగా చూసుకున్నాను. ఇంత మోసం చేస్తావని నేను అస్సలు ఊరు అనుకోలేదు అని రామరాజు వేదవతి తో అంటాడు. నగల విషయం నా దగ్గర ఎందుకు దాచావు అని వేదవతిని అడుగుతాడు. పెద్దోడివి పెళ్లి హడావిడిలో మర్చిపోయాను అండి చెప్పడం అని అంటుంది వేదవతి.. మొన్న బ్యాంకులో పెట్టేటప్పుడు చెబుదామనుకున్నాను ఇది చిన్న విషయమే కదా అని చెప్పలేకపోయాను అని అంటుంది.

Also Read :తల్లికి అక్షయ్ అబద్దం.. నగలను పోగొట్టిన కోడళ్లు.. కమల్ ప్లాన్ సక్సెస్..

నువ్వు నాతో మాట్లాడద్దు నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదని వేదవతిని ఏడిపించేస్తాడు రామరాజు.. ఆ మాట విన్నా ప్రేమ వేదవతి దగ్గరికి వచ్చి నన్ను క్షమించత్తా అని అంటుంది. ఏం ద్రోహం చేశానే నిన్నే నీకేం పాపం చేశాను నేను.. నా మీద ఒట్టేసావు కదా మరి నేనంటే నీకు అంత లెక్క లేకుండా పోయిందా? మీ మావయ్య నన్ను ఎన్ని మాటలు అంటున్నాడు చూసావా అని అడుగుతుంది. ఇదంతా ఎందుకు చేసావ్ చెప్పు అంటే ధీరజ్ కోసం చేశానని ప్రేమ అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Nindu Noorella Saavasam Serial Today october 19th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరుకు షాక్‌ ఇచ్చిన యముడు  

Intinti Ramayanam Today Episode: మళ్లీ కలిసిపోయిన పల్లవి.. కండీషన్స్ కోసం శ్రీయా ఫైట్..బూతులు తిట్టుకున్న కోడళ్లు..

GudiGantalu Today episode: ప్రభావతి ఇంట దీపావళి సంబరాలు.. రోహిణికి దినేష్ వార్నింగ్..మీనా కిడ్నాప్..

Illu Illalu Pillalu Today Episode: నర్మదకు అడ్డంగా దొరికిపోయిన శ్రీవల్లి.. సిగ్గుపడ్డ వేదవతి.. ధీరజ్ కోసం ప్రేమ రచ్చ..

Illu illaalu pillalu Kamakshi : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ కామాక్షి రియల్ లైఫ్.. కుర్రాళ్ల మతిపోగొడుతుంది మావా..

Today Movies in TV : ఆదివారం మూవీ లవర్స్ కు పండగే..టీవీల్లోకి హిట్ సినిమాలు..

Big tv Kissik Talks: బిగ్ బాస్ హౌస్ పాములు.. పులుల అరుపులు షాకింగ్ విషయాలు బయటపెట్టిన హరితేజ!

Big tv Kissik Talks: ఎన్టీఆర్ తో హరితేజ గొడవ…  డైరెక్టర్లకు వార్నింగ్ ఇచ్చిన తారక్?

Big Stories

×