BigTV English

Amaravati: అమరావతిలో బిట్స్ క్యాంపస్.. మరో రెండేళ్లలో ప్రవేశాలు-కుమారమంగళం బిర్లా

Amaravati: అమరావతిలో బిట్స్ క్యాంపస్.. మరో రెండేళ్లలో ప్రవేశాలు-కుమారమంగళం బిర్లా

Amaravati: ఏపీ రాజధాని అమరావతిలో ‘ఏఐ ప్లస్‌ క్యాంపస్‌’ ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ వైస్ ఛాన్సలర్, బిజినెస్‌మేన్ కుమారమంగళం బిర్లా వెల్లడించారు. అక్కడ రానున్న ఐదేళ్లలో రూ. 1000 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు తెలిపారు. అమరావతి క్యాంపస్‌ను ఆధునిక సాంకేతిక విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు.


అమరావతిలో ఏర్పాటు చేస్తన్న బిట్స్ ఏఐ ప్లస్‌ క్యాంపస్‌ ప్రవేశాలను మరో రెండేళ్లలో అంటే 2027 నుంచి మొదలుపెడతామని కుమారమంగళం బిర్లా స్పష్టం చేశారు. కృత్రిమ మేధ, డేటా సైన్స్, రోబోటిక్స్, కంప్యుటేషనల్‌ లింగ్విస్టిక్స్, సైబర్‌ ఫిజికల్‌ సిస్టమ్స్‌ వంటి కోర్సులకు తొలి ప్రయార్టీ ఇస్తామన్నారు.

రెండు దశల్లో దాదాపు 7 వేల మంది విద్యార్థులకు అక్కడ చదువుకునేందుకు అవకాశం కల్పించేలా క్యాంపస్‌ని తీర్చిదిద్దుతామన్నారు. రానున్న ఐదేళ్లలో అక్కడ వెయ్యి కోట్ల పెట్టుబడి పెడతామన్నారు. అమరావతితోపాటు పిలానీ, హైదరాబాద్, గోవా క్యాంపస్‌ల విస్తరణకు రూ.1,200 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు.


ప్రస్తుతం అక్కడున్న విద్యార్థుల సంఖ్యను 2030-31 నాటికి 26వేలకు పెంచుతామని వెల్లడించారు. రానున్న ఐదేళ్లలో బిట్స్ పిలానీ డిజిటల్ 32 ప్రోగ్రామ్‌లు మొదలుకానున్నాయి. అందులో 11 డిగ్రీ కోర్సులు, 21 సర్టిఫికేట్ కోర్సులున్నాయి.

ALSO READ: వచ్చేవారం సింగపూర్‌కు సీఎం చంద్రబాబు టీమ్

అమరావతి క్యాంపస్‌ దేశంలో తొలి ఏఐ క్యాంపస్‌ కాబోతోందన్నారు. కంప్యూటర్‌ సైన్స్‌లో ముఖ్యమైన ప్రోగ్రామ్స్‌ ఉంటాయన్నారు. వీటితోపాటు మైనర్‌ ప్రోగ్రామ్స్‌ అందుబాటులోకి తెస్తామన్నారు. ఏఐలో అన్ని బేసిక్‌ కాన్సెప్ట్స్‌ ఉంటాయన్నారు. వ్యవసాయం, వాతావరణం, ఆరోగ్య సంరక్షణ వరకు అన్నిరంగాల కోర్సులకు ప్రణాళికలు రెడీ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

దీనికి సంబంధించి వివిధ దేశాల యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నామని తెలిపారు. పిలానీ-2025 స్నాతకోత్సవంలో మాట్లాడిన ఆయన దేశం 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే ఆశయంతో బిట్స్ పిలానీ దేశ నిర్మాణానికి తన నిబద్ధతను చాటుకుంటూ మూడు ప్రణాళికలను ప్రకటించిందని చెప్పారు.

అమరావతిలో బిట్స్‌ క్యాంపస్‌ ఉండాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన అని, తక్కువ ధరకే భూములిచ్చారని అన్నారు. అమరావతి క్యాంపస్ సీఎం చంద్రబాబు ఆలోచనకు అనుగుణంగా ఉంటుందన్నా రు. ప్రస్తుతం అక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గ్రీన్ ‌బిల్డింగ్స్, పునరుత్పాదక విద్యుత్తు విధానాలతో నిర్మాణాలు జరగనున్నాయి.

దేశంలో ఆ తరహా క్యాంపస్‌ లేదని గుర్తు చేశారు. అమరావతిలో రెండేళ్లు, విదేశీ విశ్వవిద్యాలయాల్లో మిగతా రెండేళ్లు విద్యను అభ్యసించేలా కోర్సులను డిజైన్‌ చేస్తున్నట్లు తెలియజేశారు. అమరావతిలో బిట్స్‌ క్యాంపస్‌కు సీఆర్‌డీఏ 70 ఎకరాల భూమి కేటాయించింది. మిగతా యూనివర్సిటీలకు కేటాయించిన ప్రాంతంలో బిట్స్‌ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

సీడ్ ‌యాక్సెస్‌ రోడ్డు పక్కన వేంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో క్యాంపస్ ఉండాలనేది బిట్స్‌ కోరిక. ఆయా భవనాలు ఆలయ నమూనాలో నిర్మించనున్నారు. ఇటీవల బిట్స్‌ క్యాంపస్‌ నమూనాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు కూడా.

Related News

Why Not Pulivendula: వైనాట్ కుప్పం.. వైనాట్ పులివెందుల

RTC mike announcement: మహిళలకు ఫ్రీ బస్.. మైక్ అనౌన్స్‌మెంట్స్ కండక్టర్ కొత్త కల్చర్!

Nara Lokesh: అలాంటి సినిమాలను రిలీజ్ కానివ్వం -లోకేష్ ఘాటు హెచ్చరిక

Ysrcp Silence: స్త్రీశక్తిపై వైసీపీ మౌనం.. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఒప్పుకున్నట్టేనా?

AP Free Bus: ఏపీలో ఫ్రీ బస్.. బస్సులో ప్రయాణించిన చంద్రబాబు, పవన్.. వారితో మహిళల మాట ఇదే!

AP weather alert: తీరప్రాంతంలో టెన్షన్ టెన్షన్.. 24 గంటల్లో అక్కడ దంచుడే!

Big Stories

×