Intinti Ramayanam Today Episode july 14th: నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి అక్షయ్ భానుమతి ఏం చేస్తున్నారో చూడాలని వస్తుంది. ఆ ఇంటికి తాళం వేయడం చూసి వీళ్ళు అవనితో కలిసిపోయారని అనుమానంతో ఆ ఇంటికి చూడాలని వస్తుంది. పల్లవి విలను చూస్తే కచ్చితంగా అత్తయ్య దగ్గర చెప్పి పెద్ద రచ్చ చేస్తుంది అని అవని ఆలోచిస్తుంది. పల్లవికి అవి నేను చూడగానే అనుమానం మొదలవుతుంది. ఇంట్లోకి వెళ్లి నేను చెక్ చేయాలని అంటుంది. అందరూ తడబడుతూ సమాధానం చెప్పడంలో పల్లవి అనుమానం మరింత బలంగా మారుతుంది. వెళ్లి ఇంట్లో రూములు చెక్ చేస్తానని అంటుంది. ప్రణతి కావాలనే పల్లవి మీద నీళ్లు పోయడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భానుమతి మాటలు విని పల్లవి నమ్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అక్షయ్ ఫోన్ తీసుకొని పార్వతి ఫోన్ చేసిందని తెలుసుకొని మళ్లీ ఫోన్ చేస్తాడు.. ఏంటమ్మా ఎన్నిసార్లు ఫోన్ చేసావ్ సైలెంట్ లో ఉండింది నేను చూసుకోలేదు అమ్మ ఇంటర్వ్యూ కోసం వచ్చాను అని అబద్ధం చెప్తాడు. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు నానమ్మ నువ్వు అక్కడ ఎంత కష్టపడుతున్నారో తెలుసుకోవాలని నేను మీ నాన్నకు ఫోన్ చేస్తే అవ్వని ఫోన్ లిఫ్ట్ చేసి ఎటకారంగా ఫోన్ మాట్లాడింది. మీ అబ్బాయి నా దగ్గరకు వచ్చేస్తాడని మీరు భయపడుతున్నారా అది ఇది అని ఏదో మాట్లాడింది. దానికి బుద్ధి చెప్పకుండా మీ నాన్న కూడా వత్తాసు పాడారు అని పార్వతి అంటుంది.
అక్షయ్ మాత్రం అవని ఇక్కడ ఉన్న విషయం అయితే చెప్పలేదు అని పార్వతికి అబద్ధం చెప్తాడు. అవని నాకు ఎదురు పడకుండా అవని మొహాన్ని నేను చూడకుండా బయటికి కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నానమ్మా అని అబద్ధం చెప్తాడు. ఆ మాట విన్న రాజేంద్రప్రసాద్ అవని లోపలికి వచ్చి మీ అమ్మకు నువ్వు అబద్ధం చెప్పావా అని అడుగుతారు. అక్కడ ఏదో సమస్య ఉందని వెళ్ళింది. నేను ఇలా ఇక్కడ ఉన్నాను అని తెలిస్తే అందులో నా ఆరోగ్యం బాగాలేదని తెలిస్తే అమ్మ వెంటనే నా దగ్గరికి వచ్చేస్తుంది. అందుకే నేను ఇలా అబద్దం చెప్పాను అని అంటాడు.
ఇక ఆ తర్వాత పల్లవి శ్రియాలు ఇద్దరూ ఫంక్షన్ కి వెళ్లాలని రెడీ అవుతారు. అయితే ఇద్దరూ రెడీ అవ్వడం దగ్గర వాదులు ఆడుకోవడం విని కమలు వీలు ఇంక మారరు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కమల్ని పార్వతీ పిలిచి శ్రేయ పలివిలు కనిపించలేదు ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది.. తను ఇప్పుడు అయితే పార్వతి ఏదో తప్పు అయిందని కోడళ్లని ఆపుతుంది. ప్రేమని
మనం ఇంత పెద్ద కుటుంబం నుంచి వచ్చాం కదా ఖచ్చితంగా నగలు ఉంటే బాగుంటుందని అందరూ అనుకుంటారు. అందులో ది గ్రేట్ రాజేంద్రప్రసాద్ గారి కోడలైన మీరు ఒంటిమీద నగలు లేకుండా వెళ్తే ఏమైనా బాగుంటుందా అని కమల్ పల్లవి శ్రియాలను అడ్డంగా ఇరికిస్తాడు.. పల్లవి, శ్రీయలు ఇద్దరు ఆ నగలు దొంగలు ఎత్తుకుపోయారు అన్న విషయం నీకు తెలుసు కదా మళ్లీ ఎందుకు బావ నువ్వు అత్తయ్య దగ్గర అంటావు అని అంటుంది. అయితే దొంగలు ఎత్తుకుపోవడం ఏంటి అని పార్వతి అడుగుతుంది..
మేము ఆ నగల్ని వేసుకున్నప్పుడు ఒక దొంగ వచ్చినా గాని కొట్టేసారు అత్తయ్య అని పల్లవి అంటుంది. పార్వతీ మాత్రం దొంగలు ఎత్తుకెళ్తే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వకుండా ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు అని అడుగుతుంది. అప్పుడే శ్రీకర్ అక్కడికి వస్తాడు. అయితే ఈ నగలు దొంగలు ఎత్తుకెళ్లినవి పోలీసులకు నేను కంప్లైంట్ ఇచ్చాను వాళ్ళు నగలు వచ్చాయి అని నాకు ఇస్తే తీసుకొని వచ్చాను అని అంటాడు. నగలను పార్వతి చూసి ఇవి నా నగలు కాదు అని అంటుంది. అది నీ నగలే అమ్మ వీళ్ళిద్దరూ కరిగించి కొత్తగా వాళ్లకు తగ్గట్టు చేయించుకున్నారు అని కమలంటాడు.
Also Read :తండ్రి కోసం బాలు షాకింగ్ నిర్ణయం.. శృతి, రవి మళ్లీ కలుస్తారా?
ఆ నగల చరిత్ర గురించి మీకు తెలిస్తే ఇలా చేయరు అని క్లాస్ పీకుతుంది పార్వతి. తరతరాలుగా వంశపారపర్యంగా వస్తున్న నగలు.. అసలు మీకు ఇవ్వడం నాది బుద్ధి తక్కువ అని పార్వతీ ఆ నగలను తీసుకొని వెళ్తుంది.. నాకెందుకు నీ మొగుడే దొంగగా వచ్చి ఆ నగలను దొబ్బేసాడు ఏమో అని డౌట్ గా ఉంది అంటూ శ్రియా పల్లవితో గొడవకు దిగుతుంది. పల్లవి మీ ఆయనే నగలు దొరికాయని తెచ్చాడు కదా ఆ దొంగని అరేంజ్ చేసి తీసుకొచ్చారేమో.. మా ఆయన గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు అని ఇద్దరు మరోసారి గొడవపడితే పార్వతి వచ్చి మీకు కొంచమైన బుద్ధుందా అని అరుస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..