Goldberg Retirement: వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ {WWE} అభిమానులకు హార్ట్ బ్రేకింగ్ న్యూస్. విలియం స్కాట్ గోల్డ్ బర్క్ రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2025 సమ్మర్ స్లామ్ కి ముందు డబ్ల్యుడబ్ల్యుఈ చివరి ప్రీమియం లైవ్ ఈవెంట్ జార్జియాలోని అట్లాంటాలో జరుగుతుంది. ఇది తన చివరి మ్యాచ్ అని ప్రకటించాడు డబ్ల్యూడబ్ల్యూఈ లెజెండరీ గోల్డ్ బర్క్. 1997లో రెజ్లింగ్ లోకి ఎంట్రీ ఇచ్చిన గోల్డ్ బర్క్.. తన 28 ఏళ్లకు దీర్ఘ కెరీర్ కి ముగింపు పలుకుతూ తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు.
గోల్డ్ బర్క్ జీవితం:
గోల్డ్ బర్గ్ 1966 డిసెంబర్ 27న ఒక్ల హోమాలోని తూల్షాలో ఒక రిఫార్మ్ యాదు కుటుంబంలో జన్మించాడు. ఇతడు రష్యన్ – యాదు మరియు రొమేనియన్ – యాదు సంతతికి చెందిన వాడు. అతడి తండ్రి ఫార్వార్డ్ మరియు జాన్స్ అప్కిన్స్ విశ్వవిద్యాలయం రెండింటిలో పట్టభద్రుడు. గోల్డ్ బర్గ్ జన్మించిన తర్వాత అతడి తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఇక అతడి తండ్రి 2006లో మరణించాడు. అతని తల్లి పూల మొక్కలను పెంచి 2000 సంవత్సరంలో అవార్డు గెలుచుకుంది. ఇక గోల్డ్ బర్క్ కి ఇద్దరు సోదరులు ఉన్నారు. ఇతడు తన జీవిత ప్రారంభంలోనే ఫుట్ బాల్ పై ఆసక్తి పెంచుకున్నాడు. 16 సంవత్సరాల వయసులో హైట్ కారణంగా నైట్ క్లబ్ బౌన్సర్ గా పనిచేయడం ప్రారంభించాడు. ఇక 1992 ఫిబ్రవరి 4న వరల్డ్ లీగ్ ఆఫ్ అమెరికన్ ఫుట్బాల్ లోని సాక్రమెంటో సర్జ్ ద్వారా ఏడవ రౌండ్ లో ఎంపికయ్యాడు. కాగా తన ప్రొఫెషనల్ ఫుట్బాల్ కెరీర్ ముగిసిన తర్వాత పునరావాసంలో భాగంగా పవర్ లిఫ్టింగ్, మిశ్రమ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందడం ప్రారంభించాడు. ఆ తర్వాత రెజ్లింగ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక గోల్డ్ బర్గ్ రిటైర్మెంట్ ప్రకటించాడని తెలిసిన ఆయన అభిమానులు నిరాశకు గురవుతున్నారు.
గోల్డ్ బర్గ్ రికార్డులు:
1997లో డబ్ల్యూసిడబ్ల్యూ లో అరంగేట్రం చేసిన గోల్డ్ బర్క్.. 173 మ్యాచ్ లలో అజేయంగా నిలిచాడు. ఇక తన కెరీర్ లో గోల్డ్ బర్క్ ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ గెలుచుకున్నాడు. వాటిలో 2016లో రెజ్లింగ్ లోకి తిరిగి వచ్చిన తర్వాత అతను సాధించిన రెండు యూనివర్సల్ ఛాంపియన్షిప్ లు కూడా ఉన్నాయి. ఇక 2017లో హాల్ ఆఫ్ ఫెమ్ లో కూడా చేరాడు. అలాగే 1999లో డబ్ల్యూసిడబ్ల్యూ కోసం పనిచేసే సమయంలో గోల్డ్ బర్క్ నటించడం ప్రారంభించాడు. అలా చాలా చిత్రాలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. పవర్ఫుల్ పంచులతో ప్రత్యర్థులపై విరుచుకుపడే గోల్డ్ బర్గ్ అటాకింగ్ గేమ్ కి అభిమానులు ఫిదా అవుతారు. ఇక ఇప్పుడు అతడు వీడ్కోలు తీసుకునేందుకు సమయం ఆసన్నమైందని భావిస్తున్నాడు.