Illu Illalu Pillalu Today Episode july 24th: భద్రావతి శారదాంబ రేవతిని వంట గదిలోకి తీసుకెళ్లిన వేదవతి తాను చేసిన పిండి వంటలని చూపిస్తూ మీరు తినాల్సిందే నేను అస్సలు ఒప్పుకోను అని అంటుంది.. తన అక్క కోసం చాలా ఇష్టమైన వంటలు నేను చేశాను మా అక్క మొత్తం తినాల్సిందే అని వేదవతి మారం చేస్తుంది.. తన కూతుర్లు ఇద్దరు కలిసిపోయారని శారదాంబ చాలా సంతోషంగా ఉంటుంది.. వీళ్ళని కిటికీలుంచి చూస్తున్న శ్రీవల్లి మాత్రం కోపంతో రగిలిపోతుంది. ఇకపోతే వేదవతి తన అక్క వాళ్ళకి చేస్తున్న మర్యాదలను చూసి భద్ర కన్నీళ్లు పెట్టుకుంటుంది. మొత్తానికి ఈ ఎపిసోడ్ ఫ్యామిలీ సెంటిమెంట్తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది..
మొదటిసారి తన అక్క తన ఇంటికి వచ్చింది అని వేదవతి తన అక్కకి దగ్గరుండి తానే వడ్డించాలని అనుకుంటుంది.. నేను మా అక్క కోసం చిన్నప్పుడు ఏం చేసినా కూడా నన్ను కాదనేది కాదు. మా అక్క నన్ను ఎంతగా సపోర్ట్ చేసిన కూడా నేను ఏమి చేయకపోయినా కూడా నన్ను అన్ని చేస్తున్నావని అందరి దగ్గర పొగిడేది. మా అక్క నా గుండె చప్పుడు.. ఇంట్లో చిన్నదాని కాబట్టి నన్ను చాలా రోజుల వరకు వంట గదిలోకి కూడా వెళ్ళనివ్వకుండా గారాభరణం పెంచారు అని వేదవతి తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకొని ఎమోషనల్ అవుతుంది.. ఇక వెధవది సంతోషాన్ని చూసిన నర్మదా ఈమె ఎంతగా ఎమోషనల్ అవుతుంది అని సెటైర్ల వర్షం కురిపిస్తుంది.. వేదవతి మాటకు నర్మదా ఇంకా రెచ్చిపోయి మాట్లాడడంతో వేదవతి చాలా ఫీల్ అవుతుంది..
కామాక్షి మాత్రం పెద్దమ్మ చీరలు నగలు చాలా బాగున్నాయి అని వచ్చినప్పటి నుంచి తన మీదే మాట్లాడుతూ ఉంటుంది.. అయితే ఏం భద్ర తన నగల గురించి చెప్తూ ఉన్నా కూడా కామాక్షిని వేదవతి అరుస్తుంది.. ఎప్పుడు నీకు అదే ఆలోచన కొంచెం కూడా నీకు బుద్ధి లేదా అని కామాక్షిని తిడుతుంది. మరేం పర్వాలేదు లేదా నేను తనకోసం గాజులు తీసుకొని వచ్చాను అని చెప్పగానే నాకోసం గాజులు తీసుకొని వచ్చావా పెద్దమ్మ అని కామాక్షి చాలా సంతోషంగా ఉంటుంది.. అయితే కామాక్షికి గాజులు ఇచ్చిన భద్ర అమూల్యకి కూడా గాజులు చేయించానని అంటుంది.. కానీ అమూల్య మాత్రం ఆ గాజులు తీసుకోవడానికి ఇష్టపడదు.. ఇక రామరాజు పర్మిషన్ ఇవ్వడంతో అమూల్య ఆ గాజులను తీసుకుంటుంది.. రామరాజు తన కూతుర్ని ఇలా పెంచడానికి భద్ర ఆలోచిస్తూ ఉంటుంది..
ధీరజ్ ను సాగర్ ఇద్దరు కూడా మీ మామ కాస్త సీరియస్ గా ఉన్నాడు రా ఏంటి ఏమైనా అయిందా అని అడుగుతాడు. మా మామ బిజ్జాలు ఉన్నా కూడా బాగానే ఉన్నాడు రా.. ఎప్పుడు నిజాయితీగానే ఉంటాడు ఏదైనా ఉన్నా కూడా మనసులో దాచుకోకుండా మొహం మీద చెప్పేస్తుంటాడు.. కానీ మీ మామ అలా కాదు.. ఇంట్లో పుల్లలు పెట్టడం కుటుంబాన్ని విడగొట్టాలని చూడడం చేస్తూ ఉంటాడు అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా చందు ఏంట్రా ఇప్పుడు ఈ గోల ముందు కానివ్వండి అమ్మమ్మ చాలా సంతోషంగా తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలి అని అంటాడు.. ఇక ఇద్దరూ కలిసి మీ మామ మాటలకి ఫీజులు ఎగిరిపోయాయి అలా మాట్లాడుతున్నావు అంటూ కామెడీ చేస్తారు..
శారదాంబ పుట్టినరోజు వేడుకల కోసం గ్రాండ్గా రామరాజు కుటుంబం ఏర్పాటు చేస్తుంది. ఆ ఏర్పాట్లును చూసిన శారదాంబ ఎమోషనల్ అవుతుంది. మనం అందరం ఇలా సంతోషంగా ఉండాలని అనుకున్నాను కదా ఇప్పుడు ఆ రోజు వచ్చేసింది అని వేదవతి చాలా సంతోషంగా ఉంటుంది. ఇక కేక్ కట్ చేయడానికి అన్ని సిద్ధం చేస్తూ ఉండగా శారదమ్మ మాత్రం మీ అందరిని చూస్తుంటే నాకు కన్నీళ్లు ఆగడం లేదు. నా పుట్టిన రోజుని ఇలా జరుపుకుంటానని నేను అస్సలు ఊహించలేదు.. బ్రతికున్నన్ని రోజులు కనీసం ఇలా రెండు కుటుంబాలు కలిసి ఉంటాయని చూస్తానని అసలు అనుకోలేదు అంటూ ఎమోషనల్ అయిపోతుంది. సంతోషంగా పుట్టినరోజు వేడుకలు చేసుకోవాలి అని అందరూ అంటారు..
ఇక కేక్ కటింగ్ కోసం అని అందరూ ఒక చోటికి రాగానే సేన మాత్రం మనం తెచ్చిన కేక్ ని అమ్మ కట్ చేయాలి. పుట్టినరోజు వేడుకల్ని ఎలా ఇంట్లో చేస్తున్నారు కదా ఇప్పుడు కేక అయినా మనది కట్ చేయాలి అని అంటాడు. ఆ మాట వినగానే సాగర్ కోపంతో రగిలిపోతాడు.. అదేదో అంతగా కట్ చేయించుకోవాలి అనుకుంటే మీ అమ్మని మీ ఇంట్లోనే పుట్టినరోజు వేడుకలు చేసుకోమని చెప్పొచ్చు కదా అని అంటాడు.. ఇక ధీరజ్ కూడా సాగర్ కి సపోర్ట్ గా నిలుస్తూ ఆ కేక్ ని అక్కడి కట్ చేయించుకోవచ్చు కదా అని మాట్లాడితే శారదాంబ నా పుట్టినరోజులు నాడు గొడవలు వద్దు అని అంటుంది.. అయితే కేక్ కట్ చేసిన తర్వాత భద్ర వాళ్ళ అమ్మకి కేక్ పెడుతుండగా సేన ఆపుతాడు.. కేకులు ఏదో కలిపారు అంటూ ధీరజ్ అనడంతో ప్రేమతో పాటు అక్కడున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..