BigTV English

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లిని రామరాజు క్షమిస్తాడా? చందుకు పది లక్షల మ్యాటర్ లీక్..

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లిని రామరాజు క్షమిస్తాడా? చందుకు పది లక్షల మ్యాటర్ లీక్..

Illu Illalu Pillalu Today Episode july 5th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ, నర్మద కలిసి ఆ వల్లి మ్యాటర్ గురించి మాట్లాడుకుంటారు.. ఆ తర్వాత వాళ్ళ నాన్న ఇడ్లీ అమ్ముతాడు ఆ సెంటర్ కి మనం వెళ్దాం పద అని నర్మదా ప్రేమను తీసుకొని వెళుతుంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ ఒకచోట ఆనందరావు ఇడ్లీలు అమ్మడం చూసి అక్కడికి వెళ్తారు. బాబాయ్ నాకు ఒక రెండు ఇడ్లీలు అని నర్మదా అడుగుతుంది. ఆనందరావు షాక్ అవుతాడు. ఇలా అమ్మాలి అని రావు ఏదో ఒక కుర్రాన్ని పట్టుకొని మేనేజ్ చేస్తాడు. ఇలా అమ్మితే కస్టమర్లు బాగా వస్తారని ఆయన అంటాడు. నర్మద ప్రేమలను చూసిన ఆనంద్ రావు మైండ్ బ్లాక్ అవుతుంది. ఏం చేయాలో తెలియక అక్కడున్న ఒక కుర్రాడికి పనప్పగిచ్చేసి అక్కడి నుంచి మెల్లగా జారుకునే ప్రయత్నం చేస్తాడు. నర్మద, ప్రేమలు శ్రీవల్లి ది ఫ్రాడ్ ఫ్యామిలీ అని కన్ఫామ్ చేసుకుంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. నర్మదకు నిజం తెలిసిందని కంగారు పడుతుంది.. ప్రేమ వల్లి అక్కను చూస్తుంటే ఏదో టెన్షన్ పడుతున్నట్లు అనిపిస్తుంది అని అంటుంది.. దానికి వల్లి నేను టెన్షన్ పడుతున్నానా ఎందుకు టెన్షన్.. ఎంత ఉల్లాసంగా ఉన్నానో, ఉత్సాహంగా ఉన్నాను చూడండి అని అంటుంది. నువ్వు సంతోషించే విషయం ఒకటి చెప్పనా మీ నాన్నగారిని మేము మున్సిపల్ ఆఫీసు దగ్గర సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముతుంటే కలిసాము అని అంటారు. ఆ మాట వినగానే ఇంట్లోని వాళ్ళందరూ షాక్ అవుతారు. ఫైనాన్స్ బిజినెస్ అంటే కేవలం బిజినెస్ గురించి మాట్లాడాలి ఆయన మాత్రం పల్లీల్లో చట్నీ ఎలా వేయాలి. చట్నీలో బెల్లం వేస్తే టేస్ట్ అదిరిపోతుంది ఇలాంటివన్నీ మాట్లాడినప్పుడే నాకు అనుమానం వచ్చింది అని తిరుపతి అంటాడు.

ఇంత ఫ్రాడ్ ఫ్యామిలీని అస్సలు అనుకోలేదు. మీరు నిజంగానే ప్రోడ్ ఫ్యామిలీ బావ చెప్పమ్మా చెప్పు అని తిరుపతి శ్రీవల్లిని అడుగుతాడు. శ్రీవల్లి నోట మాట రాకుండా ఉంటుంది. అటు రామరాజు కూడా ఏంటమ్మా శ్రీవల్లి మీ నాన్న ఫైనాన్స్ బిజినెస్ అన్నావు కదా ఇడ్లీలు వ్యాపారం ఏంటి అని అడుగుతాడు. పొంతన లేకుండా సమాధానం చెబుతుంది శ్రీవల్లి. ఆ తర్వాత అడ్డంగా ఇరుక్కుపోయాను ఇప్పుడేం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.


శ్రీవల్లిని ముప్పు తిప్పలు పెట్టిన నర్మదా ఇడ్లీలు వ్యాపారం చేయట్లేదు మావయ్య గారు. పెద్దపెద్ద వాళ్లకి అప్పులు ఇవ్వడంతో పాటుగా చిరు వ్యాపారులు కూడా ఆయన ఫైనాన్స్ అందిస్తుంటారట. అయితే వ్యాపారాలు దెబ్బతిన్నప్పుడు ఆయనే స్వయంగా రంగంలోకి దిగుతారట. సైకిల్ మీద ఇడ్లీలు తీసుకొచ్చి వ్యాపారులకు ఎలా చేయాలో నేర్పిస్తాడు. ఆ మాట వినగానే శ్రీవల్లి చల్లబడుతుంది. ఇంతటితో అవ్వలేదు మొత్తం కూపి లాగి నిజాలను బయట పెడతానని నర్మదా మనసులో అనుకుంటుంది..

అమ్మయ్య ఈ గండం నుంచి గట్టెక్కాను ఇక ముందు జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటుంది. ధీరజ్ కోసం ప్రేమ కష్టపడుతున్న విషయాన్ని చెప్పకుండా షర్టుతో మాట్లాడుతూ ఉంటుంది. నేను డాన్స్ క్లాస్ నేర్పిస్తూ నీకు అండగా ఉండాలని అనుకుంటున్నాను. నువ్వు ఏమన్నా పర్లేదు ఎవరేమన్నా పర్లేదు అని మాట్లాడటం చూసి ధీరజ్ ప్రేమకు నిజంగానే పిచ్చి పట్టిందేమో అని అనుకుంటాడు. నువ్వు నాతో మాట్లాడాలి అనుకుంటే డైరెక్ట్గా నాతో మాట్లాడొచ్చు లేదా ఫోన్ చేసి మాట్లాడొచ్చు.. కానీ ఇలా చొక్కా తో మాట్లాడటం ఏంటి అని అడుగుతాడు..

Also Read: రోహిణిని క్షమించని ప్రభావతి.. మీనా పై దొంగతనం నింద..

కొంపతీసి నువ్వు ఏమైనా ఉద్యోగం చేస్తున్నావా ఏంటి అలాంటివి ఏం చేయకు తల్లి మొన్న జరిగిన రచ్చకే ఏదోలా ఉంది అని ధీరజ్ అంటాడు. ఏం చేయట్లే లేరా నువ్వు వెళ్లి ఫ్రెష్ చేయరా అన్నం పెడతాను అనేసి అంటుంది.. నర్మదా సాగర్ ఇద్దరూ అర్ధరాత్రి దొంగగా లాంతరు తీసుకొని బయటకొస్తారు. అది చూసిన శ్రీవల్లి కూడా వాళ్ళని ఫాలో అవుతూ వెనకాలే వస్తుంది. వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు అంటే సాగర్ కు చదువు చెప్పిందా? ఎందుకు ఇప్పుడు చదువుతున్నారు. వీరిద్దరి మేటర్ మీ ఇంట్లో వాళ్లకి కచ్చితంగా తెలిసేలా చేయాలని దొంగ దొంగ అని అరుస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇప్పుడు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Mahesh Babu -Sandra: ఘనంగా బుల్లితెర నటుడు మహేష్ బాబు నిశ్చితార్థం..ఫోటో వైరల్!

Anasuya: వారందరికీ శాపాలు పెట్టిన అనసూయా.. చాలా బాధగా ఉందంటూ?

Sreemukhi: శ్రీముఖికి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన బాలు.. నిజంగానే ప్రేమలో పడ్డాడా ఏంటీ?

Big Tv Kissik talks: ప్రాణ స్నేహితుడితో ఢీ డాన్సర్ పండుకి గొడవలు.. లైవ్ లోనే ఎమోషనల్.!

Intinti Ramayanam Today Episode: అక్షయ్ కు క్లాస్ పీకిన అవని.. అడ్డంగా బుక్కయిన చక్రధర్.. వ్రతం ఆపేందుకు ప్లాన్..

GudiGantalu Today episode: బాలు తప్పులేదని తెలుసుకున్న మీనా.. గుణకు చుక్కలే.. షాక్ లో ప్రభావతి..

Big Stories

×