Japan Mega Earthquake: ఓ వైపు అయోమయం.. మరోవైపు భయం భయం! జపాన్.. అనుక్షణం వణికిపోతోంది. ఎప్పుడేం జరుగుతుందోనని.. ప్రతి క్షణం భయపడుతోంది. ఇంకొన్ని గంటల్లో.. మాంగా ఆర్టిస్ట్ చెప్పిన జోస్యం నిజమవుతుందేమోనని.. జపాన్ ప్రజలంతా టెన్షన్ పడుతున్నారు. క్షణమొగ యుగంగా గడుపుతున్నారు. ఆమె చెప్పిందే నిజమైతే.. భారీ సునామీతో జపాన్ తుడిచిపెట్టుకుపోతుందా?
ఇంకొన్ని గంటల్లో భారీ సునామీ రాబోతోందా?
ఇప్పుడు ప్రపంచం మొత్తం.. దీనిమీదే ఆందోళన నెలకొంది. జులై 5న జపాన్ తీరంలో ఊహించని స్థాయిలో పెను విపత్తు సంభవిస్తుందని.. జపాన్‌కి, ఫిలిప్పీన్స్‌కి మధ్య.. సముద్రగర్భంలో చీలిక ఏర్పడుతుందని.. దాని ప్రభావంతో.. 2011లో పెను విధ్వంసం సృష్టించిన సునామీకన్నా.. ఎత్తైన అలలు సముద్రంలో ఏర్పడతాయని.. జపాన్‌కి చెందిన మాంగా ఆర్టిస్ట్, న్యూ వంగా బాబాగా పేరొందిన ర్యోటుట్సుకీ రాసిన ది ఫ్యూచర్ ఐ సా పుస్తకంలో చెప్పిన జోస్యం.. ఇప్పుడు.. ఆ దేశాన్ని ప్రతిక్షణం భయపెడుతోంది. జపాన్ ప్రజలంతా ఇప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని.. బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.
సౌత్ జపాన్‌లోని టొకారా దీవుల్లో 900 పైగా భూప్రకంపనలు
2019లో ప్రపంచాన్ని వణించికిన కరోనా సహా ఆ పుస్తకంలో.. ర్యోటుటుక్సీ చెప్పిన చాలో విషయాలు నిజమవడంతో.. ఇది కూడా జరుగుతుందేమోనని జపాన్ వాసులు భయపడుతున్నారు. ఇప్పటికే.. కొన్ని రోజులుగా.. సౌత్ జపాన్‌లోని టొకారా దీవుల్లో.. 9 వందల సార్లకు పైగా.. భూప్రకంపనలు నమోదవడం వారిని మరింత వణికించేస్తోంది. ఆ ప్రాంతం మొత్తం.. ఎప్పుడూ కదులుతున్నట్లే అనిపిస్తోందని.. కంటి మీద రెప్ప వేయాలంటే కూడా భయమేస్తోందని అక్కడి వాళ్లు చెబుతున్నారంటే.. వాళ్లు ఏ స్థాయిలో వణికిపోతున్నారో తెలుస్తోంది. సునామీ భయంతో.. సురక్షిత ప్రాంతానికి తరలిపోవాలని చూస్తున్నారు. జూన్ 21 నుంచి మొదలైన ఈ భూప్రకంపనల తీవ్రత.. క్రమంగా పెరుగుతూ ఒక్కసారిగా 5.5 తీవ్రతతో భూకంపం నమోదైంది. దాంతో.. జపాన్ ప్రభుత్వం, వాతావరణ సంస్థ అప్రమత్తమైంది.
అండమాన్‌లోనూ 4.9 తీవ్రతతో భూప్రకంపనలు
తాజాగా.. అండమాన్‌లోనూ భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై 4.9గా భూకంప తీవ్రత నమోదైంది. నాలుగు రోజులుగా అండమాన్‌లో భూప్రకంపనలు వస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని ప్రకంపనలు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దాంతో.. సమద్రంలో ఏదో జరుగుతోందనే అనుమానాలు బలపడుతున్నాయ్. అయితే.. న్యూ వంగా బాబా జోస్యాన్ని నమ్మలేమని.. అలాంటి సునామీ వస్తుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని జపాన్ అధికారులు కొట్టిపారేస్తున్నారు. 12 దీవులున్న టొకారాలో.. 7 దీవుల్లో 700 మంది నివసిస్తున్నారు. 4 ప్రధాన టెక్టానిక్ ప్లేట్ల మధ్య పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌గా పిలిచే ప్రాంతంలో ఉండే జపాన్‌కు భూప్రకంపనలు కొత్త కాదు. టొకారో దీవుల్లోని వారికి కూడా ఇదంతా సాధారణమే. 2023 సెప్టెంబర్‌లో అక్కడ 346 ప్రకంపనలు నమోదయ్యాయి. కానీ.. ఈ జోస్యమే.. ఇప్పుడు వారిని భయపెడుతోంది. ఇంకొన్ని గంటలు గడిస్తే గానీ.. అక్కడేం జరుగుతుందన్న దానిపై స్పష్టత లేదు.
Also Read: ఏపీలో నిశబ్ద నిరసన.. అసలు కరేడులో ఏం జరుగుతోంది?
కోవిడ్ గురించి 1999లోనే జోస్యం చెప్పిన మాంగా ఆర్టిస్ట్
మరోవైపు.. మాంగా ఆర్టిస్ట్ జోస్యం గురించి విస్తృతంగా ప్రచారం కావడంతో.. చైనా, సౌత్ కొరియా, తైవాన్ నుంచి జపాన్‌కు వచ్చే టూరిస్టుల సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. 2020 ఏప్రిల్‌లో ప్రపంచమంతా ఓ వైరస్ వ్యాపిస్తుందంటూ.. కోవిడ్ గురించి టట్సుకీ 1999లోనే జోస్యం చెప్పారు. అది నిజమైంది. అంతేకాదు.. కరోనా కొంతకాలం పాటు మాయమై.. 2030లో మరింత ప్రాణాంతకంగా మారి మళ్లీ వస్తుందని చెప్పారు. ఇప్పుడు.. ఆమె చెప్పినట్లే.. జపాన్‌లో గనక ఇప్పుడు సునామీ వచ్చిందంటే.. ఇప్పుడున్న భయం మరింత రెట్టింపవుతుంది. 2030ని తల్చుకొని.. ప్రపంచం మొత్తం వణికిపోతుంది. ఆమె చెప్పిన జోస్యం నిజమవుతుందా? లేదా? అనేది.. ఇంకొన్ని గంటల్లోనే తేలిపోనుంది.