BigTV English

AP Politics: కొత్త పార్టీల్లో ఒంటరి పోరాటం

AP Politics: కొత్త పార్టీల్లో ఒంటరి పోరాటం

AP Politics: ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి పార్టీలు వచ్చే ఎన్నికలే లక్ష్యంగా తమ వ్యూహాలను సిద్దం చేస్తున్నాయి. సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు తాజాగా కార్యాచరణ ఖరారు చేసారు. వైసీపీ లక్ష్యంగా టీడీపీ రాజకీయ అడుగులు వేస్తోంది. అటు జగన్ ప్రభుత్వంపై పోరు బాట ప్రారంభించారు. అలా ఎవరి వ్యూహాల్లో వారుంటే ఎన్నికల్లో ఓటమి తరువాత జగన్‌ను వీడి కూటమిలో చేరిన మాజీ మంత్రుల పరిస్థితిపై ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. కొత్త పార్టీల్లో సదరు నేతలు ఒంటరి పోరాటం చేయాల్సి వస్తోందంటు. వారికి కనీస గుర్తింపు దక్కటం లేదంట. ఆ క్రమంలో ఇప్పుడు వారి ముందున్న ప్రత్యామ్నాయాలు ఏంటి?.. అసలు వారి విషయంలో ఏం జరుగుతోంది?


కూటమి పార్టీల్లో చేరిన వైసీపీ కీలక నేతలు

2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తరువాత జగన్ వద్ద మంత్రులుగా పని చేసిన కీలక నేతలు వైసీపీని వీడి కూటమి పార్టీల్లో చేరారు. జగన్ అధికారంలో ఉన్న సమయంలో వారంతా ఒక వెలుగు వెలిగారు. జగన్‌కు బంధువు.. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరారు. ఆ పార్టీలో చేరి నెలలు అవుతున్నా… ఆయనకు తగిన గుర్తింపు లేదని అనుచరులు వాపోతున్నారంట. బాలినేని సొంత నియోజకవర్గంలో ఒంగోలులో జనసేన మిత్రపక్షం టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల, నేతలు ఆయనతో కలిసి పని చేయటానికి సుముఖంగా లేరు. వారు బాలినేని జనసేన చేరికను ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఆ లెక్కలతోనే బాలినేనికి ఎలాంటి పదవి.. బాధ్యతలు అప్పగించడం లేదంట. దాంతో తన వర్గాన్ని కాపాడు కోవటానికి బాలినేని నానా పాట్లు పడాల్సి వస్తోందంట.


6 నెలల క్రితం టీడీపీలో చేరిన ఆళ్ల నాని

ఇక, కాపు వర్గం నుంచి డిప్యూటీ సీఎంగా పని చేసిన ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని పరిస్థితి ఇదే విధంగా ఉందన్నచర్చ జరుగుతోంది. ఆళ్లనాని తెలుగుదేశం పార్టీలో చేరి నెలలు గడుస్తున్నాయి. నాని చేరికను తొలి నుంచి టీడీపీ ఏలూరు నేతలు వ్యతిరేకిస్తున్నారు. అయినా ఆళ్ల నాని పార్టీలో చేరగలిగారు. టీడీపీ శ్రేణులు మాత్రం నానిని తమ నేతగా అంగీకరించటం లేదంట. పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానం పంపడం లేదంట. ఇంత దానికి పార్టీ మారటం ఎందుకని ఆళ్ల నానిని అనుచరులు నిలదీస్తున్నారంట.

టీడీపీ ఆఫీసులోకి వెళ్ల లేకపోతున్న ఆళ్ల నాని

ఏలూరు టీడీపీ కార్యాలయంలోకి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని వెళ్లలేని పరిస్థితి నెలకొందంట. జగన్ ఇచ్చిన ప్రాధాన్యతను మర్చిపోయి.. పార్టీ ఓడగానే టీడీపీలోకి వెళ్లిన నానిని వైసీపీ శ్రేణులు కూడా శత్రువులా చూస్తున్నాయంట. దాంతో మాజీ ఉప ముఖ్యమంత్రికి ఇప్పుడు భవిష్యత్ అంతు చిక్కటం లేదంట. ఆ క్రమంలో సొంత కేడర్ నుంచి సరైన నిర్ణయం తీసుకోవాలనే ఒత్తిడి పెరుగుతోందంట.

మోపిదేవిని ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇచ్చిన జగన్

అదే విధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ పరిస్థితి ఉందన్న టీడీపీలో చర్చ జరుగుతోంది. మోపిదేవి వెంకటరమణ 2019 ఎన్నికల్లో ఓడినా ఎమ్మెల్సీని చేసి మంత్రిగా జగన్ అవకాశం కల్పించారు. ఆ తరువాత రాజ్యసభకు పంపారు. అయితే, 2024 ఎన్నికల్లో పార్టీ ఓడిన తరువాత రాజ్యసభతో పాటుగా వైసీపీకి రాజీనామా చేసిన మోపిదేవి టీడీపీలో చేరారు. ఇప్పటి వరకు అంతటి సీనియర్‌కు టీడీపీలో ఎలాంటి పదవి దక్కలేదు.

Also Read: జపాన్‌లో ఈరోజు ఏం జరుగబోతోంది? వినాశనం తప్పదా..!

టీడీపీ కార్యక్రమాల్లోనూ మోపిదేవి కనిపించటం లేదు. అయితే ఎన్నికల ముందు వైసీపీ నుంచి కూటమి పార్టీల్లోకి వెళ్లిన వారి పరిస్థితి కాస్త మెరుగ్గానే కనిపిస్తోంది. కొందరు మంత్రులు అయ్యారు. ఓడిపోయిన ఈ మాజీ మంత్రులు మాత్రం ఒంటరి పోరాటం చేయాల్సి వస్తోందంట. ఆ పార్టీల్లోకి వెళ్లిన తరువాత వెనక్కు రాలేక.. ఆ పార్టీ శ్రేణుల నుంచి మద్దతు లేక డైలమాలో పడ్డారంటున్నారు. మరి.. వీరు రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

Related News

Yellandu Politics: ఇల్లందులో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ పెత్తనంపై వ్యతిరేకత..

Congress: కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య గ్యాప్ వచ్చిందా..?

Srikakulam Politics: దువ్వాడ కుల రాజకీయం

KCR: కేటీఆర్ కామెంట్స్.. బీఆర్ఎస్ ఫ్యూచర్ ఏంటో?

BC Reservations: స్థానిక సంస్థల ఎన్నికలు.. కాంగ్రెస్‌లో కొత్త టెన్షన్..

Bigg Boss AgniPariksha E3 Promo1: ఎమోషన్స్ తో చంపేస్తున్న సామాన్యులు.. వర్కౌట్ అవుతుందా?

Big Stories

×