Gundeninda GudiGantalu Today episode july 5th: నిన్నటి ఎపిసోడ్ లో.. రోహిణి సెట్ చేసిన అతనితో బాలు పూర్తిగా తాగించేస్తాడు. నువ్వేంటి ఇంకా తాగట్లేదు అని అడుగుతాడు. నేను నా భార్యకి ఇచ్చిన మాట కోసమే తాగట్లేదు నువ్వు కాని చెయ్ నువ్వు హ్యాపీ కదా అని అతను అంటాడు. ఆ మాట విన్న మీనా బాలు దగ్గరకొచ్చి హగ్ చేసుకుంటుంది. నా మాట కోసం మీరు తాగలేదు చూడు అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అని బాలుతో అంటుంది. బాలు మీనా లోపలికి రావడంతో సత్యం ఎక్కడికి వెళ్లారు రా ఇప్పటివరకు ఎక్కడున్నాడు అమ్మ వీడు ఏం చేశాడు అని అడుగుతాడు. ఇక్కడే ఫంక్షన్ లో ఉన్నాడు మామయ్య ఎక్కడికి వెళ్ళలేదు అని మీనా అంటుంది.
ఇదంతా కాదు గాని ఆయన వచ్చారా ఆయన కోసమే అంత వెయిట్ చేస్తున్నారు కదా అని బాలు అడుగుతాడు.. ఇప్పటివరకు వెయిట్ చేసాము ఇంకా రాలేదని అమ్మాయి కూడా తాళి మార్చే ఫంక్షన్ చేసేసాము అని సత్యం అంటాడు. గొడవలు పెట్టాలని శోభన ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా బాలు వాటి అన్నిటిని తప్పించుకుంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. తన కూతురిని అల్లుడిని శాశ్వతంగా తన ఇంట్లోనే ఉంచుకోవాలని శోభన ప్లాన్ చేస్తుంది. బాలుని రెచ్చగొట్టి గొడవ జరిగేలా చేసి శృతిని తన ఇంట్లోనే ఉంచుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా కూడా బాలు మాత్రం తెలివిగా తప్పించుకున్నాడు.. చివరగా బాలు, సత్యం ను ఎలాగైనా అవమానించాలి భోజనం దగ్గర కూర్చోబెట్టి, పెద్దవాళ్ళు తినాల్సిన దగ్గర మీరు తింటున్నారా? అని అవమానిస్తే వాడి కోపం వస్తుంది కచ్చితంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు అని అనుకుంటారు శోభన సురేంద్ర.. వాళ్ళని కావాలని భోజనానికి పిలుస్తారు.
శోభన వాళ్ళ మనుషులు దగ్గరుండి వాళ్ళని భోజనానికి కూర్చోబెడతారు. ఎలాగైనా సరే ఇక్కడ వీళ్ళని దారుణంగా అవమానిస్తే ఆ బాలు గాడికి కోపం వస్తుంది. కచ్చితంగా గొడవకు దిగుతాడు నాలుగు పీకుతాడు అని సురేంద్ర అనుకుంటాడు. బాలు మాత్రం వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు ఏదో జరగబోతుంది అని సత్యంతో అంటాడు. అక్కడ కొంతమంది పిల్లలు భోజనానికి కోసం వెయిట్ చేస్తుంటే వారిని కూర్చోబెట్టి భోజనం వడ్డిస్తారు. చూసిన శోభన, షాక్ అవుతారు.
అదేంటి మీరు కూర్చోకుండా పిల్లల్ని కూర్చోబెట్టారు నేను వేరే కుర్చీలు తెప్పిస్తానని సురేంద్ర అంటాడు. మరేం పర్వాలేదు వీళ్ళు తిన్న తర్వాతే మేము తింటాము అని సత్యం అంటాడు. వీళ్ళని ఎంతగా తిట్టి అవమానించాలని చూసిన సరే ఏదో ఒక విధంగా తప్పించుకుంటున్నారు. ఈ ఫంక్షన్ అయితే పూర్తి అయిపోయింది అని సురేందర్ శోభన అనుకుంటారు. బాలుడు దెబ్బ కొట్టడం కాదు బాలు చుట్టూ ఉన్న వాళ్ళని ఏదో ఒక విధంగా బాధ పెడితే వాడి కోపం వస్తుంది అని అనుకుంటారు.
Also Read:హీరోలకు శాపంగా పవన్ కళ్యాణ్.. మరో హీరోకు బిగ్ షాక్..!
దిష్టి తీయాలి అని శ్రుతిని తీసుకురమ్మని చెప్తే మీనా శృతి గదిలోకి వస్తుంది. అక్కడ శృతి లేకపోవడంతో మీనా గదంతా వెతికి దండ తీసేసి ఇక్కడ పడేసి వెళ్లిపోయిందని అనుకుంటుంది. ఆ గదిలో దండతో పాటు చైను కూడా ఉండడంతో దాన్ని తీసి శృతికి ఇవ్వాలని మీనా అనుకుంటుంది. కానీ శృతి వాళ్ళ నాన్న సురేందర్ వచ్చి ఏంటి దొంగతనం చేస్తున్నావా అని రచ్చ చేస్తాడు. శోభన కూడా ఇదే మంచి టైం అని మీనా పై విరుచుకుపడుతుంది. ఎంత చెప్పినా కూడా వినకుండా మీనా పై దొంగతనం అంటగడతారు. నేను అలాంటి దాన్ని కాదు అని అంటున్న వినకుండా రెచ్చిపోతారు. మీనా ఆ మాట వినగానే వీళ్ళు కావాలని ఏదో చేస్తున్నారు అని అనుకుంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.